ఏఐ సాంకేతికతను ఎన్ని రకాలుగా వాడేస్తున్నారంటే..ఇలా కూడా ఉపయోగించొచ్చా అనేలా అబ్బురపరుస్తున్నాయి ఆ ఆలోచనలు. టెక్నాలజీతో మంచి సందేశాన్నిస్తూ ప్రభావితం చేయడం గురించి విన్నారా. అదే నేర్పిస్తుంది చైనా. టెక్నాలజీని విపరీతంగా వాడే డ్రాగన్ దేశం ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. అందర్నీ తనవైపుకి తిప్పుకుంది.
ప్రస్తుతం యువత కెరీర్ ఫస్ట్ పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత అంటోంది. దాంతో పరిస్థితి ఏ విధంగా తయారైందో అందరికి తెలిసిందే. ఇది కరెక్ట్ కాదని ఎంతోమంది మేధావులు, మానసిక నిపుణులు చెబుతున్నా.. యువత అందుకు ససేమరి నో అనే చెబుతోంది. అలాంటి యువతను చాకచక్యంగా మార్గంలో పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ ఏఐ టెక్నాలజీతో భావోద్వేగ సందేశంతో పిలుపునిస్తూ..యువతరాన్ని ప్రభావితం చేసే పనిలో పడింది.
ఏం చేస్తోందంటే..ఏం లేదండి..ఏఐ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఆన్‌లైన్ వీడియోలతో బలమైన భావోద్వేగ సందేశాలతో యువత దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఏఐ జనరేటెడ్ మహిళలు యువతను సరైన వయసుకి వివాహం చేసుకోవాలని పిలుపునిస్తూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తోంది. వివాహం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో యువతకు స్పష్టమైన అవగాహన ఉండాలనే బలమైన సందేశాన్ని అందిస్తోంది.
ఈ వీడియోల్లో మధ్య వయస్కురాలైన ఒంటిరి మహిళ తాను పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం పట్ల విచారం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ..యూత్‌ని ఆ అంశాలపై ఆలోచనత్మాక దృష్టిని అందిస్తోంది. అంతేగాదు ఆ వీడియోల్లో ఆస్పత్రి లాంటి వాతావరణంలో మహిళలు ఏడుస్తున్నట్లు చిత్రీకరించాయి. తాము ఒంటరితనంతో విలపిస్తున్నామని, యంగ్‌గా ఉన్నప్పుడూ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ జీవితాలు దుఃఖమయంగా మారాయంటూ రికార్డు చేసిన వీడియోలు యువతకు సరైన దృక్పథం తోపాటు సరైన దిశలో నడిపించేలా ప్రభావితం చేస్తున్నాయి.
సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. వృద్ధాప్య జీవితం ఎంత భారంగా దయనీయంగా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చూపిస్తూ..యువతను మేల్కొపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేగాదు ఆ ఆ వీడియోలో వివేకవంతమైన మార్పు వైపుకి మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నాయి.
డబుల్ ఇన్‌కమ్, పిల్లలు లేని జీవితం అవసనా దశనను ఎంత దుర్భరంగా మారుస్తోంది కనువిప్పు కలిగేలా చేసి.. యువతకు కుటుంబం, పెళ్లి వంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి, మంచి నిర్ణయం తీసుకునేలా ఆ సాంకేతిక వీడియోలు బలమైన సందేశాన్నిస్తుండటం విశేషం. ఒకరకంగా చైనా సరికొత్త సందేశాత్మక ధోరణి.. సాంకేతికతను మంచి దృక్పథానికి ఎలా వాడాలనేది హైలెట్ చేసింది కదూ..!.
(చదవండి: ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్‌గా..)


