రైల్లో శాండ్‌విచ్‌...నెటిజన్లరియాక్షన్స్‌ వైరల్‌ వీడియో | Video of family making sandwiches inside train divides internet | Sakshi
Sakshi News home page

రైల్లో శాండ్‌విచ్‌...నెటిజన్ల రియాక్షన్స్‌ వైరల్‌ వీడియో

Feb 11 2026 6:45 PM | Updated on Feb 11 2026 7:58 PM

Video of family making sandwiches inside train divides internet

 
రైలు ప్రయాణాల్లో కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు.  రైల్లో  ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా సుదూర  ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే 24-28 గంటలకు మించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు సరిపడా  భోజనాలు చేసుకుని వెంట తీసుకెళతారు. తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దివ్య జైన్ అనే ఇన్‌స్ట గ్రామ్ యూజర్ ‘రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి,  బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం’  అంటూ చేసిన పోస్ట్‌ ప్రకారం కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్‌, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్‌పై చాకుతోసాస్‌, చట్నీ పూస్తూ ఎంతో జాయ్‌ఫుల్‌గా బ్రెడ్‌ శాండ్‌విచ్‌లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.

 

 fy"> 

నెటిజన్ల స్పందన 
ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్‌ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది  ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.  రైల్వేస్‌లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో

ఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా  శాండ్‌విచ్‌లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో  దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు.   ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ,  ఏ రైలులో జరిగింది అనేదానిపై ‍స్పష్టత లేదు.

ఇదీ చదవండి:  ఇండియన్‌ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం

Advertisement
 
Advertisement
Advertisement