క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో | German woman loses only credit card in India saved by friends | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో

Feb 11 2026 3:40 PM | Updated on Feb 11 2026 4:20 PM

German woman loses only credit card in India saved by friends

దేశం కాని దేశంలో మనకు సంబంధించిన వస్తువులను చాలా ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా వీసా, పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌ కార్డు అత్యంత ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు. క్రెడిట్ కార్డును కోల్పోయిన మహిళను స్నేహితులు సేవ్ చేసారు. దీనికి సంబంధించి ఆమె షేర్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అదేంటో చూద్దామా.

బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే 29 ఏళ్ల యువతి  భారత పర్యటనకు వచ్చింది.  అయితే ఊహించని క్రమంలో క్రెడిట్ కార్డులు. కార్పొరేట్ ఐడి క్రెడిట్‌ కార్డు ఉన్న పర్స్‌ ఎక్కడో పారేసుకుంది. దీంతో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కానీ ఈ సమయంలో ఒక్క సెకను కూడా చింతించిలేదనీ, దీనికి కారణంగా భారత్‌లో ఉన్న తన స్నేహితులేనని చెప్పుకొచ్చింది. వారంతా కష్టకాలంలో అండగా నిలిచి గట్టెక్కించారనీ, ట్రూ స్టోరీ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌ చేసింది. అలాగే జెన్నిఫర్ తన స్నేహితులతో తన వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లను  షేర్‌ చేసింది.

తన టూర్‌ పూర్తయ్యేవరకు తన ఫ్రెండ్స్‌ తనకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేసి తాను ఎలాంటి ఆందోళన పడకుండా చూసుకున్నారని, ఇలాంటి మద్దతు లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొంది. అంతేకాదు ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేస్తాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనులు కూడా ఆనందాన్ని ప్రకటించారు.

 

నెటిజ‌న్ల స్పంద‌న‌
బెంగళూరులోని బస్సులో పర్సును (క్రెడిట్ కార్డులు , కార్పొరేట్ ఐడీ కార్డ్‌ ఉన్న) పోగొట్టుకున్నా.. ఆ మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఇవ్వడానికి తన కార్యాలయానికి వచ్చాడంటూ తన అనుభవాన్ని ఒకరు పంచుకున్నారు. స్నేహం,స్నేహితులు అంటే అదే కదా.. జాతి, జాతీయత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదుకుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement