అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా.. | American founders post her relationship with Indian mother-in-law | Sakshi
Sakshi News home page

అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..

Feb 10 2026 4:10 PM | Updated on Feb 10 2026 5:46 PM

American founders post her relationship with Indian mother-in-law

అత్తా కోడలు బంధం అనగానే ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక ఇంటిలో రెండు కొప్పులు పొసగవు అన్న నానుడిలా ఉంటుంది చాలావరకు. కానీ ఈ అత్తాకోడళ్లు అందుకు విరుద్ధం. పైగా ఆ కోడలు దేశం, సంస్కృతి, వేషధారణ అన్ని పూర్తి విభిన్నం..అయినా వారి మధ్య అనుబంధం మాములుగా లేదు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోని డెట్రాయిట్‌లో జన్మించిన వ్యవస్థపకురాలు బ్రిటినీ గ్రే యాదవ్‌ షేర్‌ చేశారు. ఆ వీడియోలో రెండు వేర్వేరు దేశాలు మధ్య శక్తిమంతమైన బాండింగ్‌ని చూపించింది. ఆమె తన భారతీయ అత్తగారితో గడిపిన క్షణాన్ని షేర్‌ చేసింది. తాము రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటామని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆతర్వాత ఆమె తన అత్తగారు ఆ వీడియోలో ఎందుకు అంతలా నవ్వుకుంటున్నామో వివరించింది. 

తాము సరదాగా మాట్లాడుకుంటూ..తన అత్తగారు కోడలి నుంచి ఆశిస్తోంది ఏంటో చెప్పగా..దాన్ని తాను చేసి చూపించడంతో నవ్వులు విరిశాయని పేర్కొంది. ఇంతకీ భారతీయ అత్తగారు కోడలి నుంచి ఏం ఆశించారంటే..ప్రతి రోజు వంట చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పాదాలు నొక్కడం తదితరాలని మాట. ఆ అత్తగారు కోరుకున్నట్లుగానే బ్రిటనీ నేలపై కూర్చోగా..అత్తగారు సోఫాలో కూర్చొని..ఒకటే పకపక నవ్వు. ఇద్దర్నీ చూస్తే..అత్త కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా మెలుగుతున్న వారిని చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత అద్భుతంగా ఉంది ఆ ఘట్టం. 

ఇక బ్రిటనీ డెట్రాయిట్‌కి చెందిన నల్లజాతి అమ్మాయి కాగా, ఆ అత్తగారు భారత్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నెటిజన్లు కూడా ఆ అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉన్న విధం చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: బరువు తగ్గాలంటే..తూచా తప్పకుండా పాటించాల్సిన ఏడు సూత్రాలు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement