అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు | Ajith Kumar Gears Up For Abu Dhabi Car Race, Tamil Film Stars Line Up To Meet Him, Photos Went Viral | Sakshi
Sakshi News home page

అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు

Feb 9 2026 6:52 AM | Updated on Feb 9 2026 1:31 PM

Kollywood Actors Meet With Ajith Kumar

 హీరో అజిత్‌.. వివాదాలకు చోటు ఇవ్వని అరుదైన నటుడు. అందుకే ఆయనంటే తోటి నటీనటులందరికీ ఇష్టం. ఇకపోతే  అభిమానం పేరుతో వెర్రితలలు వేయకుండా కుటుంబం కోసం శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులకు పదేపదే హితవు చెబుతుంటారు. కాగా ఈయన ఇటీవల నటనతో పాటూ కార్‌ రేస్‌ పోటీలపైనా అధిక మక్కువ చూపుతున్న విషయం  తెలిసిందే. అజిత్‌ అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొంటూ  పథకాలను గెలుస్తున్నారు. అలా  దుబాయ్, బెల్జియం మొదలగు పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొన్నారు. 

కాగా ప్రస్తుతం దుబాయిలోని అబుదాబిలో జరగనున్న కార్‌రేస్‌ పోటీల్లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ను అబిదబిలో కలవడానికి మన సినీ స్టార్స్‌ క్యూ కడుతున్నారు. ఇప్పటికే నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్, జీవి.ప్రకాశ్‌కుమార్, దర్శకుడు వెంకట్‌ప్రభు, మాదవన్, నటి నయనతార, శ్రీలీల వంటి పలువురు అజిత్‌ను కలిసి తమ అనందాన్ని వ్యక్తం చేయడంతో పాటూ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నటుడు శివకార్తీకేయన్‌ ప్రత్యేకంగా దుబాయ్‌కి వెళ్లి అజిత్‌ను కలిశారు. 

అక్కడ వారు దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలోనే మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రం త్కరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈచిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  

Advertisement
 
Advertisement
Advertisement