సంక్రాంతికి సోగ్గాళ్లు | Annapurna Studios Announces 2027 Sankranthi Soggallu Movie From Akkineni Heroes | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సోగ్గాళ్లు

Feb 9 2026 12:32 AM | Updated on Feb 9 2026 12:32 AM

Annapurna Studios Announces 2027 Sankranthi Soggallu Movie From Akkineni Heroes

నాగచైతన్య, నాగార్జున, అఖిల్‌

‘‘వాసివాడి తస్సాదియ్యా... వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటాది కదా. డేట్‌ మార్క్‌ చేసుకోండి’’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రతినిధులు ‘ఎక్స్‌’లోపోస్ట్‌ చేశారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016). ఈ చిత్రంలో నాగార్జున  ‘వాసివాడి తస్సాదియ్యా...’ అంటూ డైలాగ్‌ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ వచ్చేట్లు ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు కాబట్టి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి కొత్త చిత్రం రాబోతోందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుందని స్పష్టమవుతోంది.

ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) సినిమాలు సంక్రాంతికే విడుదలై, సూపర్‌హిట్స్‌గా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఇటీవలే నాగార్జునను కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథతోనే కొత్త సీక్వెల్‌ తెరకెక్కనుందనీ, జూన్‌లో షూటింగ్‌ ఆరంభిస్తారనీ   తెలిసింది. ‘బంగార్రాజు’లో నాగార్జున–నాగచైతన్య నటించారు. వచ్చే సంక్రాంతికి రానున్న చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి నటించనున్నారని భోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement