Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్‌? | Prabhas Kalki 2 Update: shooting will begin soon with Kamal, Amitabh | Sakshi
Sakshi News home page

Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్‌?

Feb 8 2026 11:45 PM | Updated on Feb 9 2026 5:43 AM

Prabhas Kalki 2 Update: shooting will begin soon with Kamal, Amitabh

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్‌ హిట్‌ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది.  

ప్రభాస్ ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది.  

దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్‌ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement