'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది? | Know About Reasons Behind Why Prakash Raj Exit From Sandeep Reddy Vanga And Prabhas Spirit Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Spirit Movie: అనౌన్స్‌మెంట్‌లో ఉన్నాడు.. ఇప్పుడు బయటకొచ్చేశాడు!

Feb 8 2026 10:38 PM | Updated on Feb 9 2026 12:01 PM

Prakash Raj Exit Prabhas Spirit Movie

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు  వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి  ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement