టాలీవుడ్ హారర్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న ట్రైలర్ | Tollywood movie Amaravathiki Aahvanam Official Trailer | Sakshi
Sakshi News home page

Amaravathiki Aahvanam Official Trailer: భయపెడుతోన్న అమరావతికి ఆహ్వానం ట్రైలర్

Feb 8 2026 1:35 PM | Updated on Feb 8 2026 1:48 PM

Tollywood movie Amaravathiki Aahvanam Official Trailer

ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, శివ కంఠనేని ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. 

అమరావతికి ఆ‍హ్వానం ట్రైలర్ చూస్తుంటే హారర్‌ థ్రిల్లర్‌ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏంట్రా ఈ ఊరు మనుషులే కనపడట్లేదు అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఈ గ్రామంలో  జరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్‌లో సీన్స్‌ ఆడియన్స్‌ను భయపెట్టేస్తున్నాయి. దెయ్యాల కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement