సినిమా బాగుంది, నీకు మంచి భవిష్యత్తుంది బ్రదర్‌! | Anil Ravipudi Praises Abishan Jeevinth With Love Movie | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: ఈ సినిమా ఎంజాయ్‌ చేశా.. డైలాగ్స్‌ నీట్‌గా..

Feb 8 2026 12:11 PM | Updated on Feb 8 2026 1:05 PM

Anil Ravipudi Praises Abishan Jeevinth With Love Movie

'టూరిస్ట్‌ ఫ్యామిలీ'తో దర్శకుడిగా సత్తా చాటిన అభిషన్‌ జీవింత్‌ 'విత్‌ లవ్‌' మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటున్న ఈ సినిమాపై తెలుగు దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రశంసలు కురిపించాడు.

విత్‌ లవ్‌పై ప్రశంసలు
విత్‌ లవ్‌ సినిమాను చాలా ఎంజాయ్‌ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, నీట్‌గా ఉన్నాయి. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్‌ రోల్డన్‌ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది.

మంచి భవిష్యత్తు
తొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్‌ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్‌, మగేశ్‌కు శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు అని ట్వీట్‌ చేశాడు.

దర్శకుడి నుంచి హీరోగా..
అభిషన్‌ జీవింత్‌ యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమాకే సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్‌ ఫ్యామిలీ నిర్మాత మగేశ్‌ రాజ్‌.. అభిషన్‌కు కారు గిఫ్ట్‌ ఇచ్చాడు.

 

 

చదవండి: సర్వం మాయ హిట్‌.. తండ్రికి దర్శకుడి విలువైన కానుక

Advertisement
 
Advertisement
Advertisement