'సర్వం మాయ' ఘన విజయం.. తండ్రికి విలువైన కానుక | Sarvam Maya Movie Director Akhil Sathyan Gifts SUV Car to Father | Sakshi
Sakshi News home page

రూ.150 కోట్ల కలెక్షన్స్‌.. తండ్రికి కారు గిఫ్ట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

Feb 8 2026 11:27 AM | Updated on Feb 8 2026 6:01 PM

Sarvam Maya Movie Director Akhil Sathyan Gifts SUV Car to Father

హారర్‌ సినిమా అనగానే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందనుకునేరు, కానే కాదు.. దెయ్యంతోనే ప్రేమలో పడేలా ఉంటుంది. అదే సర్వం మాయ మూవీ. మలయాళ దర్శకుడు అఖిల్‌ సత్యన్‌ తెరకెక్కించిన ఈ మూవీ 2025 డిసెంబర్‌ 25న థియేటర్‌లో విడుదలవగా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 'ప్రేమమ్‌' ఫేమ్‌ నివిన్‌ పౌలీ హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. 

కారు బహుమతి
అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకున్న సందర్భంగా దర్శకుడు అఖిల్‌ సత్యన్‌ కారు కొన్నాడు. తన తండ్రి, గురువు, దర్శకుడు సత్యన్‌ అంతికడ్‌కు కారు గిఫ్టిచ్చాడు. వోల్వో XC 60 లగ్జరీ ఎస్‌యూవీని తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఈ మోడల్‌ గతేడాది ఆగస్టులోనే ఇండియాలో లాంచ్‌ అయింది. ఈ కారు విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మలయాళంలో ఎన్నో హిట్‌ సినిమాలు తెరకెక్కించిన అంతికడ్‌ చివరగా హృదయపూర్వం అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.

సర్వం మాయ కథ
హీరో ప్రబేందు (నివిన్‌ పౌలీ) నాస్తికుడు. కానీ, కుల వృత్తి ప్రకారం బలవంతంగా అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తుంటాడు. ఓరోజు ప్రబేందుకు బంధువు రూపేష్‌ బలవంతం చేయడంతో దెయ్యం వదిలించే పూజ ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఆ దెయ్యం పేరు డెలలూ. తను చాలా క్యూట్‌గా ఉంటుంది.

దెయ్యం చేసే అల్లరి, చిలిపితనం భలే బాగుంటుంది. డెలలూ.. తాను ఎవరు? ఎందుకు చనిపోయి దెయ్యం అయిందన్న సమాధానం కోసం వెతుకుతుంటుంది. మరి డెలలు ఆచూకీ ప్రబేందు కనిపెట్టాడా? చివరకు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే హాట్‌స్టార్‌లో సర్వం మాయ చూడాల్సిందే!

 

 

చదవండి: 2026: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు

Advertisement
 
Advertisement
Advertisement