శరణ్య కూతురి రిసెప్షన్‌.. హాజరైన స్టార్‌ హీరోలు | Suriya, Karthi Attend Actress Saranya Daughter Reception | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి ఇంట పెళ్లి వేడుక.. స్టార్‌ హీరోల సందడి

Feb 7 2026 9:20 PM | Updated on Feb 8 2026 12:04 PM

Suriya, Karthi Attend Actress Saranya Daughter Reception

ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్‌ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తమిళ స్టార్‌ హీరోలు ధనుష్‌, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇద్దరూ డాక్టర్సే..
చాందిని డాక్టర్‌ కాగా, అతడి భర్త ఫిలిప్‌ కూడా డాక్టర్‌ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్‌లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్‌ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్‌ లీడర్‌, రఘువరన్‌ బీటెక్‌, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్‌గా స్థిరపడ్డారు.

 

 

చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement