ఫంకీ ట్రైలర్‌: పంచులే పంచులు! | Vishwaksen, Anudeep Funky Movie Trailer Released | Sakshi
Sakshi News home page

ఫంకీ ట్రైలర్‌.. అనుదీప్‌ మార్క్‌ కామెడీ, పంచులు

Feb 7 2026 6:40 PM | Updated on Feb 7 2026 7:23 PM

Vishwaksen, Anudeep Funky Movie Trailer Released

గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్‌సేన్‌. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్‌ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్‌ బ్యూటీ కయాదు లోహర్‌ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ట్రైలర్‌ నిండా పంచులే
ట్రైలర్‌ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్‌ చేయాలంటే నాకు రాదు డాక్టర్‌ అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. ఓనర్‌కు రెంట్‌ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్‌ అనిపిస్తయ్‌ అంటాడు హీరో. ట్రైలర్‌ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్‌ చేశారు. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి హైప్‌ ఇచ్చారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement