నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్‌ | Chandrahas Gets Emotional After Watching Barabar Premistha Movie | Sakshi
Sakshi News home page

Chandrahas: నా సినిమాపై ఎఫెక్ట్‌ పడుతుందేమోనని టెన్షన్‌.. హీరో కంటతడి

Feb 7 2026 3:23 PM | Updated on Feb 7 2026 3:40 PM

Chandrahas Gets Emotional After Watching Barabar Premistha Movie

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు, యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం బరాబర్‌ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్‌. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాకు మాటలు రావడం లేదు. రెండు, మూడు నెలల కిందట మ్యూజిక్‌ లేకుండా సినిమా చూశాను. 

ఏడుపాగలేదు
ఫైనల్‌ కాపీ చూడలేదు. ఇప్పుడిలా థియేటర్‌లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్‌లో సినిమా చూస్తున్న అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే (పాట) వివాదం వల్ల నా సినిమా చూసేందుకు జనం రారేమో అని భయపడ్డాను. నా మూవీపై ఎఫెక్ట్‌ పడుతుందేమోనని చాలా భయమేసింది' అంటూ చంద్రహాస్‌ ఏడ్చేశాడు. 

ఏంటా వివాదం?
బరాబర్‌ ప్రేమిస్తా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చంద్రహాస్‌ ఓ పాట పాడాడు. అందులో బూతు పదాలు దొర్లడంతో అతడిపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. హీరో అయుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా? ప్రమోషన్‌ కోసం ఇంత దిగజారాలా? అని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌ వల్ల సినిమాపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుందని చిత్రయూనిట్‌ భయపడ్డారు. సినిమా విషయానికి వస్తే.. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. అర్జున్‌ మహి విలన్‌గా యాక్ట్‌ చేశాడు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించగా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్‌, గాయత్రి చిన్ని నిర్మించారు.

చదవండి: ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన ముమైత్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement