బాహుబలి బాటలో RRR.. రాజమౌళి ప్రకటన | RRR Movie Anime Confirmed by SS Rajamouli | Sakshi
Sakshi News home page

బాహుబలి బాటలో RRR మూవీ.. రాజమౌళి గుడ్‌న్యూస్‌

Feb 7 2026 1:04 PM | Updated on Feb 7 2026 1:09 PM

RRR Movie Anime Confirmed by SS Rajamouli

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’.. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.  ఈ క్రమంలో తాజాగా  హాలీవుడ్‌ మీడియాకి రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చివరి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆస్కార్‌ అవార్డ్‌ దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌ పేరు వైరల్‌ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. RRR అనిమేషన్‌ చిత్రంగా రూపొందించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను అనేక జపనీస్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు. 

అధికారికంగా ఇంకా ఏమీ ప్రారంభం కానప్పటికీ, ప్రస్తుతం ఆయన చేసిన ఈ ప్రకటనపై అనిమేషన్‌ ప్రేమికులు అభినందిస్తున్నారు. బాహుబలి రెండు భాగాలను యానిమేషన్ సిరీస్‌గా ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం 2027 లో విడుదల కానుంది. ఇప్పుడు తెరపైకి ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా చేరడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement