తమిళ నటుడు సూర్య కో-ఓనర్‌గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్‌కతా టైగర్స్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది.
సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్‌ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు.
టెన్నిస్ బాల్‌తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్‌కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్‌లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్‌కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు.
అవార్డులు
- MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు.
- Best Batter: సైఫ్ అలీ (కోల్‌కతా టైగర్స్)
- Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్)
- Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్)
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్‌లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది.
అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్‌కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్‌కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.


