టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్‌ కీలక అడుగు | Bangladesh announce new tournament after missing out on T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్‌ కీలక అడుగు

Feb 1 2026 4:38 PM | Updated on Feb 1 2026 4:50 PM

Bangladesh announce new tournament after missing out on T20 World Cup 2026

టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్‌ గ్యాప్‌ను కవర్‌ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్‌ టీ20 కప్‌గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.  

టోర్నీ లాంచ్‌ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్‌–ఉల్–ఆలమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్‌ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

కాగా, భారత్‌లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు ప్రపంచకప్‌కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌కు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కింది.

ODOMMO టోర్నీ వివరాలు  
- జట్లు: ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI  
- కెప్టెన్లు: లిటన్‌ దాస్‌ (ధూమకేతు), నజ్ముల్‌ హొసైన్‌ షాంటో (దుర్బార్‌), అక్బర్‌ అలీ (దురొంటో)  
- మ్యాచ్‌లు: గ్రూప్‌ స్టేజ్‌ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్‌ ఫిబ్రవరి 9  
- ప్రారంభం: ప్రతి మ్యాచ్‌ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్‌  
- ప్రైజ్‌ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులు కూడా ఇవ్వబడతాయి  
 

Advertisement
 
Advertisement
Advertisement