శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు | Madushan Replaces Injured Eshan Malinga In Sri Lanka's World Cup Squad, Check Out Updated Team Details Inside | Sakshi
Sakshi News home page

శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు

Feb 7 2026 11:09 AM | Updated on Feb 7 2026 11:44 AM

Madushan replaces injured Eshan Malinga in Sri Lanka's World Cup squad

శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్‌ మలింగ ప్రపంచకప్‌ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్‌ మదుశన్‌ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్‌ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్‌ గాయపడటంతో ప్రమోద్‌కు బంపరాఫర్‌ దక్కింది. 

ఈషాన్‌, ప్రమోద్‌ ఇద్దరూ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్లే. ఈషాన్‌ లంక టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కాగా.. ప్రమోద్‌ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. 

అతను చివరిగా 2023 ఏప్రిల్‌లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్‌ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్‌తో మాత్రం అనునిత్యం టచ్‌లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్‌ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో ప్రమోద్‌.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు.

స్వదేశంతో పాటు భారత్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్‌-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్‌, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

అప్‌డేటెడ్‌ శ్రీలంక జట్టు..
- దసున్ షనక (కెప్టెన్)  
- పథుమ్ నిస్సంక  
- కమిల్ మిశారా  
- కుసల్ మెండిస్  
- కమిందు మెండిస్  
- కుసల్ జానిత్ పెరేరా  
- చరిత్ అసలంక  
- జానిత్ లియానగే  
- పవన్ రత్నాయకే  
- వనిందు హసరంగ  
- దునిత్ వెల్లలాగే  
- మహీష్ తీక్షణ  
- దుష్మంత చమీరా  
- మతీషా పథిరానా  
- ప్రమోద్ మదుశన్  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement