రియాన్ ప‌రాగ్ విధ్వంసం.. పసికూన‌ను చిత్తు చేసిన భార‌త్‌ | India A beat Namibia by 130 runs | Sakshi
Sakshi News home page

రియాన్ ప‌రాగ్ విధ్వంసం.. పసికూన‌ను చిత్తు చేసిన భార‌త్‌

Feb 6 2026 9:44 PM | Updated on Feb 6 2026 9:50 PM

India A beat Namibia by 130 runs

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న‌మీబియాతో చివరి వార్మప్ మ్యాచ్‌లో భార‌త్-ఎ జ‌ట్టు 130 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 197 ప‌రుగులు చేసింది. ఇండియా బ్యాట‌ర్ల‌లో రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.

పరాగ్ కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 69 పరుగులు చేశాడు. అత‌డితో పాటు నమన్ ధీర్ (39), అశుతోష్ శర్మ (35) మెరుపులు మెరిపించారు. గెర్హార్డ్ ఎరాస్మస్, రూబెన్ ట్రంపెల్మాన్ ,మాక్స్ హీంగో తలో రెండు వికెట్లు తీశారు. అనంత‌రం 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, భారత బౌలర్ల ధాటికి కేవలం 12.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్ప‌కూలింది.

నమీబియా బ్యాట‌ర్ల‌లో డైలాన్ లీచర్(22) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో గుర్‌జప్‌నీత్ సింగ్, మయాంక్ యాదవ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ త‌లా రెండు వికెట్లు తీసి నమీబియా ప‌త‌నాన్ని శాసించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement