టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కామెంటేటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈసారి కూడా అత్యుత్తమ కామెంట్రీతో ఆకట్టుకునేందుకు ఐసీసీ టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్ అనుభూతిని అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొంది.
బంగ్లాదేశ్- పాకిస్తాన్‌కు మద్దతుగా
అయితే, ఈ కామెంటేటర్ల లిస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్‌కు చోటు ఇవ్వడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్- పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతూ.. భారత్, ఐసీసీని నాసిర్ హొసేన్ విమర్శించిన విషయం తెలిసిందే. బంగ్లా, పాక్‌లను ఒక విధంగా.. టీమిండియాను మరో విధంగా ఐసీసీ చూస్తోందని.. ఇదెక్కడి న్యాయం అని అతడు ప్రశ్నించాడు.
భారత్ దగ్గర డబ్బు ఉందని ఆ జట్టు అభిమానులు అనుకోవచ్చని.. అయితే, ఐసీసీ అందరినీ సమానంగా చూడాలంటూ నాసిర్ హొసేన్ వ్యాఖ్యానించాడు. కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతం ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఐసీసీఐ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందనేలా నాసిర్ మాట్లాడాడు.
మరచిపోతే ఎలా?
అయితే, నెటిజన్లు అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే విషయంలో ఇంగ్లండ్ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది.
అయినా సరే బంగ్లా పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తామంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అదే జరిగితే ఐసీసీతో పాటు ఐసీసీ సభ్య దేశాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖారారైంది. ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్-2026 కామెంటేటర్లు వీరే
రవిశాస్త్రి, నాసిర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, కుమార్ సంగక్కర, శామ్యూల్ బద్రీ, రాబిన్ ఉతప్ప, కార్లోస్ బ్రాత్‌వైట్, ఇయాన్ మోర్గాన్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, డేల్ స్టెయిన్, మైఖేల్ అథర్టన్.....
వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, హర్ష భోగ్లే, పుమెలెలో ఎంబంగ్వా, నటాలీ జర్మనోస్, డానీ మోరిసన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మార్క్ హోవార్డ్..
నిక్ నైట్, అథర్ అలీ ఖాన్, కాస్ నైడూ, బాజిద్ ఖాన్, రౌనక్ కపూర్, నియాల్ ఓ'బ్రియన్, ప్రెస్టన్ మామ్సెన్, ఆండ్రూ లియోనార్డ్, రస్సెల్ ఆర్నాల్డ్, రోషన్ అబేసింఘే, ఏంజెలో మాథ్యూస్, టెంబా బావుమా.


