డ‌బ్ల్యూపీఎల్‌ 2026.. టాప్‌లో ఉంది వీరే.. | Womens Premier League 2026 Complete Statistics, Highlights And Key Performances, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

WPL 2026 Highlights: డ‌బ్ల్యూపీఎల్‌లో ఎవ‌రు ఎక్క‌డ‌?

Feb 6 2026 2:33 PM | Updated on Feb 6 2026 2:45 PM

women premier league 2026 statistics full details

డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌ (Photo: BCCI)

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపీఎల్‌) విజ‌య‌వంతంగా ముగిసింది. స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండోసారి విజేత‌గా నిలిచింది. టోర్ని ఆరంభం నుంచి ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించిన ఆర్సీబీ అఖరిపోరులోనూ అదో జోరును కొన‌సాగించి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వ‌రుస‌గా నాలుగోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశ ఎదురైంది. టైటిల్ విజేత ఆర్సీబీకి రూ. 6 కోట్ల ప్రైజ్‌మ‌నీ దక్కింది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన డీసీకి రూ. 3 కోట్లు ద‌క్కాయి.

ఫైన‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైంది. ఓవ‌రాల్‌గా  337 ప‌రుగుల‌తో అంద‌రి కంటే ముందు నిలిచిన ఆమెనే 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్ని' కిరీటం వ‌రించింది. ఈ టోర్న‌మెంట్‌లో ఎక్కువ ఫోర్లు (57) కొట్టింది కూడా ఆమెనే కావ‌డం విశేషం. బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ (68.40) మాత్రం ముంబై కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ న‌మోదు చేసింది. అంతేకాదు అత్య‌ధిక సిక్స‌ర్లు (13) కూడా ఆమెనే బాదింది.

ఇక బౌలింగ్‌లోనూ ఢిల్లీ, బెంగ‌ళూరు బౌల‌ర్లు స‌త్తా చాటారు. టాప్‌-10లో న‌లుగురు డీసీ బౌల‌ర్లు, ముగ్గురు ఆర్సీబీ అమ్మాయిలు ఉన్నారు. ఢిల్లీ బౌల‌ర్లు నందినీ శ‌ర్మ 2, తెలుగు అమ్మాయి శ్రీచ‌ర‌ణి 5, చినెల్లే హెన్రీ 6, మారిజాన్ కాప్ 10 స్థానాల్లో నిలిచారు. గుజ‌రాత్ జెయింట్స్ (జీజీ) సోఫీ డివైన్ 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు ప‌డ‌గొట్టి టాప్‌లో నిలిచింది. 10 మ్యాచ్‌ల్లో  17 వికెట్లు తీసిన నందినీ శ‌ర్మ రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ బౌల‌ర్ న‌దైన్ డిక్లెర్క్ 9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు ప‌డగొట్టి మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది. అమీలియార్ కెర్ (ముంబై), శ్రీచ‌ర‌ణి(డీసీ), చినెల్లే హెన్రీ (డీసీ), లారెన్ బెల్‌(ఆర్సీబీ), రాజేశ్వ‌రి గైక్వాడ్‌(జీజీ), శ్రేయాంక పాటిల్‌(ఆర్సీబీ), మారిజాన్ కాప్(డీసీ) వ‌రుస‌గా త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఫెయిర్ ప్లే: ముంబై ఇండియ‌న్స్‌
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్‌: సోఫీ డివైన్ (గుజ‌రాత్‌)
సూప‌ర్ స్టైక‌ర్ ఆఫ్ ది సీజ‌న్‌: గ్రేస్ హారిస్‌(ఆర్సీబీ)
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: గ్రేస్ హారిస్‌ (ఆర్సీబీ)
ఫాస్టెస్ట్ సెంచ‌రీ: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై)
హ‌య్య‌స్ట్ స్కోర్: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై)
బెస్ట్ బ్యాటింగ్ స్టైక్ రేట్‌: ఆశా శోభ‌న (యూపీ వారియ‌ర్స్‌)

బ్యాటింగ్‌లో ఇర‌గ‌దీసింది వీరే 
1. స్మృతి మంధాన (377)- బెంగ‌ళూరు
2. హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (342)- ముంబై
3.  నాట్ స్కైవర్-బ్రంట్ (321)- ముంబై
4. లిజెల్ లీ (320)- ఢిల్లీ
5. లారా వోల్వార్డ్ట్(317)- ఢిల్లీ
6. జెమిమా రోడ్రిగ్స్ (264)-ఢిల్లీ
7.  షెఫాలీ వ‌ర్మ (259)- ఢిల్లీ
8. బెత్ మూనీ (258)- గుజ‌రాత్‌
9. మెగ్ లానింగ్(248)- యూపీ
10. ఆష్లీ గార్డనర్ (244)- గుజ‌రాత్‌

బౌలింగ్‌లో అద‌ర‌గొట్టింది వీరే..
మోస్ట్‌ మేడిన్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)
మోస్ట్ గ్రీన్ డాట్ బాల్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)
మోస్ట్ డాట్ బాల్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)
బెస్ట్ బౌలింగ్ యావ‌రేజ్‌: ప్రేమ రావ‌త్ (ఆర్సీబీ)
బెస్ట్ ఎకాన‌మీ రేట్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)
బెస్ట్ బౌలింగ్‌ ఎకాన‌మీ: మారిజాన్ కాప్ (డీసీ)
బెస్ట్ బౌలింగ్‌ స్టైక్ రేట్‌: ప్రేమ రావ‌త్ (ఆర్సీబీ)
బెస్ట్ ఫిగ‌ర్స్‌: శ్రేయాంక పాటిల్‌(ఆర్సీబీ)

చ‌ద‌వండి: ఆర్సీబీ విన్‌.. విరాట్‌ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

Advertisement
 
Advertisement
Advertisement