అండర్-19 ప్రపంచకప్ విజేత‌గా భార‌త్‌ | U19 WC 2026 Final Ind vs Eng: India Won Toss Playing XIs Update | Sakshi
Sakshi News home page

అండర్-19 ప్రపంచకప్ విజేత‌గా భార‌త్‌

Feb 6 2026 12:35 PM | Updated on Feb 6 2026 8:40 PM

U19 WC 2026 Final Ind vs Eng: India Won Toss Playing XIs Update

అండర్-19 ప్రపంచకప్ 2026 చాంపియ‌న్స్‌గా యువ భార‌త జ‌ట్టు అవ‌త‌రించింది. శుక్ర‌వారం హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఇంగ్లండ్‌ను 100 ప‌రుగుల తేడాతో ఓడించిన భార‌త్.. ఆరో అండర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను త‌మ ఖాతాలో వేసుకుంది. 412 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవ‌ర్ల‌లో 311 ప‌రుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో కాలేబ్ ఫాల్కనర్(115 ) ఒంట‌రి పోరాటం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో ఆర్‌ఎస్ అంబరీష్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. 

ఎనిమిదో వికెట్ డౌన్‌
269 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 28 ప‌రుగులు చేసిన మింటో..అంబ‌రిష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. మ‌రోవైపు ఫాల్క‌న‌ర్(77) మాత్రం ఒంట‌రి పోరాటం చేస్తున్నాడు.

ఫాల్కనర్ ఒంట‌రి పోరాటం
31 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇంగ్లండ్ 7 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగులు చేసింది. కాలేబ్ ఫాల్కనర్ (58) దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 166 ప‌రుగులు కావాలి.

ఇంగ్లండ్ ఏడో వికెట్ డౌన్
142 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 ప‌రుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఇంగ్లండ్ విజ‌యానికి ఇంకా 227 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. ఆరో టైటిల్‌ను ముద్దాడేందుకు భార‌త్‌కు మూడు వికెట్లు కావాలి.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
అయూశ్ మాత్రే వేసిన 21 ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ వ‌రుసగా రెండు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. 66 ప‌రుగులు చేసిన బెన్ డాకిన్స్ క్యాచ్ ఔట్ కాగా.. రాల్ఫీ ఆల్బర్ట్ క్లీన్ ర‌నౌట‌య్యాడు. 21 ఓవ‌ర్లకు ఇంగ్లండ్ స్కోర్‌: 174/5

ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
142 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 ప‌రుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్‌
93 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 45 ప‌రుగులు  చేసిన  బెన్ మేయెస్.. ఖిలాన్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 15 ఓవ‌ర్లకు ఇంగ్లండ్ స్కోర్‌: 114/2

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌
భారీ ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ త‌గిలింది. 17 ప‌రుగులు చేసిన‌ జోసెఫ్ మూర్స్.. అంబరీష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 7 ఓవ‌ర్లకు ఇంగ్లండ్ స్కోర్‌: 25/1

భారత్‌ భారీ స్కోరు
ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో మెరవగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే హాఫ్‌ సెంచరీ (53) సాధించాడు. వేదాంత్‌ 32, విహాన్‌ 30, అభిజ్ఞాన్‌ 40 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కనిష్క్‌ 20 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది.

UPDATES:
తొమ్మిదో వికెట్‌ డౌన్‌
48.6: హెనిల్‌ పటేల్‌ (5) రనౌట్‌. తొమ్మిదో వికెట్‌ డౌన్‌. స్కోరు: 393-9(49)

ఎనిమిదో వికెట్‌ డౌన్‌
46.4: సెబాస్టియన్‌ బౌలింగ్‌లో ఖిలాన్‌ పటేల్‌ (3) అవుట్‌. క్రీజులోకి హెనిల్‌ పటేల్‌. స్కోరు: 376-8(47).

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
45.1: జేమ్స్‌ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరినఅంబరీష్‌ (18). క్రీజులోకి ఖిలాన్‌ పటేల్‌

ఆరో వికెట్‌ డౌన్‌
44.2: సెబాస్టియన్‌ బౌలింగ్‌లో రాల్ఫీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అభిజ్ఞాన్‌ (40). క్రీజులోకి వచ్చిన కనిష్క్‌ చౌహాన్‌. స్కోరు: 367-6 (45). 

41 ఓవర్లలో భారత్ స్కోరు: 323-5(41)
అంబరీష్‌ పది, అభిజ్ఞాన్‌ ఏడు పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
36.3: సెబాస్టియన్‌ బౌలింగ్‌లో మేయ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వేదాంత్‌ (32). ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ క్రీజులోకి వచ్చాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
34.2: జేమ్స్‌ బౌలింగ్‌లో డాకిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి విహాన్‌ (30) అవుట్‌. క్రీజులోకి అభిజ్ఞాన్‌ కుందు. స్కోరు: 304-4(34.4). వేదాంత్‌ 29 పరుగులతో ఉన్నాడు

భారత్‌ స్కోరు: 297-3(33)
విహాన్‌ మల్హోత్రా 27, వేదాంత్‌ త్రివేది 27 పరుగులతో ఉన్నారు.

వైభ‌వ్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌
వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసానికి బ్రేక్ ప‌డింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వైభ‌వ్‌.. డ‌బుల్ సెంచ‌రీ చేసేందుకు కేవ‌లం 25 ప‌రుగుల దూరంలో నిలిచిపోయాడు. 80 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న వైభ‌వ్‌..15 ఫోర్లు, 15 సిక్స్‌ల‌తో 175 ప‌రుగులు చేశాడు. స్కోరు: 253-3(26)

వైభవ్‌ సెంచరీ
19.6ఫ: 55 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్‌

రెండో వికెట్‌ డౌన్‌
18.6: అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో మేయ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ (53) అవుట్‌. విహాన్‌ మల్హోత్రా క్రీజులోకి రాగా.. వైభవ్‌ 97 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 162-2(19)

వంద పరుగుల భాగస్వామ్యం
ఆయుశ్‌ మాత్రే- వైభవ్‌ సూర్యవంశీ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు.స్కోరు:  122-1 (15).

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్‌ సూర్యవంశీ
10.5: ఫర్హాన్‌ అహ్మద్‌ బౌలింగ్లో సింగిల్‌ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వైభవ్‌. 31 బంతుల్లో అర్ధ శతకం. స్కోరు: 89-1 (11). ఆయుశ్‌ 28 పరుగులతో ఉన్నాడు.

భారత్‌ హాఫ్‌ సెంచరీ- 53-1(8) 
ఆయుశ్‌ 18, వైభవ్‌ 24 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
3.6: సెమీస్‌లో సెంచరీ చేసిన ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (11 బంతుల్లో 9).. అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో అవుట్‌. స్కోరు: 20-1(4). వైభవ్‌ సూర్యవంశీ 10 పరుగులతో ఉండగా.. ఆయుశ్‌ మాత్రే క్రీజులోకి వచ్చాడు.

మా వాళ్లు అదరగొడతారు..
ఈ సందర్భంగా భారత యువ జట్టు కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే మాట్లాడుతూ.. "మేము తొలుత బ్యాటింగ్‌ చేస్తాము. పిచ్‌ బాగుందనిపిస్తోంది. మెరుగైన స్కోరు సాధిస్తాం. ఇది బ్యాటింగ్‌ పిచ్‌ కాబట్టి మా వాళ్లు అదరగొడతారు. మాదైన సహజ శైలిలోనే ఆడతాము. సెమీస్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని తెలిపాడు.

కాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ ఇప్పటి వరకు ఆరుసార్లు టైటిల్‌ గెలిచింది. ఇప్పటికి పదిసార్లు (తాజా ఎడిషన్‌ కలిపి) ఫైనల్‌ చేరింది భారత్‌. మరోవైపు.. ఇప్పటికి ఒ‍కే ఒక్కసారి ట్రోఫీ సాధించిన ఇంగ్లండ్‌.. రెండో టైటిల్‌పై కన్నేసింది.  

ఇదిలా ఉంటే.. తొలి సెమీస్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసి భారత్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లు
భారత్‌
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌ కీపర్‌), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

ఇంగ్లండ్‌
బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement