breaking news
ICC Under 19 World Cup 2026
-
వైభవ్ సూర్యవంశీ తండ్రి కీలక వ్యాఖ్యలు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్ ఆరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.ఐపీఎల్-2026కు సన్నద్ధంఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.పరీక్షలకు దూరంఅయితే, వైభవ్ చదివే స్కూల్ డైరెక్టర్ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్డే’తో మాట్లాడుతూ..అవును.. మాకు అదే ముఖ్యం‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి వైభవ్ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు.అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్ మాత్రమే’’ అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్ బిహార్‌లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎగ్జామ్‌కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ ఎన్కే సిన్హా ANIకి తెలిపారు.చదవండి: అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్ -
గ్యారీ సోబర్స్‌కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు. కాగా ఫార్మాట్లకు అతీతంగా ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్.ధనాధన్బిహార్కు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.ఫైనల్లోనూ భారీ శతకంఇక ఇటీవల ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్‌పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌ను గుర్తుకు తెస్తోందన్నాడు.గ్యారీ సోబర్స్‌కి కార్బన్ కాపీవిజ్డన్ క్రికెట్ వీక్లీ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. “వైభవ్‌ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్‌ను స్వింగ్ చేయడం.. ఆ టైమింగ్, పరిపూర్ణత సూపర్. అతడి హ్యాండ్ స్పీడ్, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.అచ్చం సోబర్స్ లాగే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్‌ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్ మాత్రం తన బ్యాటింగ్ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్ స్వింగ్ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్’’ అని మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీని కొనియాడాడు. చదవండి: పాక్ స్పిన్నర్‌కు అశ్విన్ మద్దతు.. నెటిజన్స్ ఫైర్ -
బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌టాపిక్. ఫార్మాట్ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్‌కు అలవాటుగా మారింది..ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లో వైభవ్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్వరల్డ్కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026పుత్రోత్సాహంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోనుఈ క్రమంలో సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్ టెస్టు మ్యాచ్ ఆడేదాకా తననొక స్టార్ క్రికెటర్‌గా నేను పరిగణించను’’ అని సంజీవ్ సూర్యవంశీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్‌లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంటీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్ టెండుల్కర్‌ను చూసి ఓ క్రికెటర్ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్? -
జగజ్జేత భారత్‌కు భారీ నజరానా
అండర్ 19 ప్రపంచకప్ 2026 విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్ పలు రికార్డులు సొంతం చేసుకుంది.దేశమంతా గర్విస్తుందిజగజ్జేత భారత్‌కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్‌పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు. ప్రధాని అభినందనలు ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆరోసారి తాజా టైటిల్‌తో భారత్ ఆరోసారి అండర్ 19 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
వైభవ్ సూర్యవంశీ కూడా వారిలాగే కనుమరుగైపోతాడా..?
అండర్ 19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి, భారత్‌ను ఆరోసారి జగజ్జేతగా నిలిపిన విషయం విధితమే. హరారే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఈ మహా విధ్వంసం కారణంగా వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ మొత్తంలో ఇదే తరహా ఫామ్‌ను (439 పరుగులు, ఓ వికెట్) కొనసాగించినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా వైభవ్‌కే దక్కింది.ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన గత ఐదు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచిన ఏ ఒక్క ఆటగాడు కెరీర్లో పెద్దగా ఎదగలేకపోయాడు. తూతూమంత్రంగా కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత శాశ్వతంగా కనుమరుగైపోయారు. దీంతో భారత ఆటగాళ్లకు ఫైనల్స్ కలిరాదనే భావన కలుగుతోంది.తాజాగా వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడంతో, ఇతనికి కూడా గత ఐదు వరల్డ్‌కప్ ఫైనల్స్ హీరోలకు పట్టిన గతే పడుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వైభవ్ దూకుడు చూసి కొందరు అలాగే జరుగుతుందని అంటుంటే.. మరికొందరేమో వైభవ్ టీమిండియా తరఫున అద్భుతమైన కెరీర్‌ను కొనసాగిస్తాడని అభిప్రాయపడుతున్నారు.ఇంతకీ గతంలో భారత్ అండర్ 19 వరల్డకప్‌లు గెలిచిన సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2000) రితిందర్ సింగ్ సోధి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో సోధి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి భారత్ తొలిసారి వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సోధి తొలుత బౌలింగ్‌లో (10-0-26-0), ఆతర్వాత బ్యాటింగ్‌లో (39 నాటౌట్ (43)) రాణించాడు. ఈ ప్రపంచకప్ తర్వాత సోధి కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత కనుమరుగైపోయాడు.ఆతర్వాత భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2008) అజితేశ్ అర్గల్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అర్గల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-7-2) మెరిసి, భారత్ రెండో ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్గల్ ఆ ప్రపంచకప్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్లో ఓ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆటగాడిగా కనుమరుగైపోయారు. అయితే ఆశ్చర్యకరంగా అతను అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని, క్రికెట్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నాడు.భారత్ మూడోసారి ప్రపంచకప్ సాధించడంలో (2012) నాటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో ఉన్ముక్త్ అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్) చేసి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో ఉన్ముక్త్‌ను అందరూ భావి భారత తారగా అనుకున్నారు. అయితే ఆశర్చర్యకరంగా అతని కెరీర్ కూడా ముందుకు సాగలేదు. అవకాశాలు లభించినా అతను ఒడిసి పట్టుకోలేకపోయాడు. భారత్‌లో కాదని వేరే దేశానికి వెళ్లినా అతని ఫేట్ మారలేదు. దీంతో అతను క్రమంగా కనుమరుగైపోయాడు.భారత్ నాలుగోసారి (2018) ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో మన్జోత్ కల్రా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్స్‌లో కల్రా మెరుపు సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. పై ముగ్గురితో పోలిస్తే, కల్రా పరిస్థితి మరీ దారుణం. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత ఇతను ఎక్కడా కనపడలేదు. లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లో కేవలం ఒకటి అరా మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ చేసి రాత్రికిరాత్రే హీరో ఇమేజ్ దక్కినా, ఎందుకో ఆ ఇమేజ్ను కొనసాగించలేకపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెరుపులా ఒక్కసారి మెరిసి ఆతర్వాత అదృశ్యమయ్యాడు.భారత్ ఐదోసారి వరల్డ్‌కప్ గెలవడంలో రాజ్ బవా కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి ఫైనల్లో బవా ఆల్‌రౌండర్‌గా (34 (54), 5-31) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌గా నిలిచాడు. ఆ ఫైనల్ తర్వాత బవాకు మంచి అవకాశాలే లభించినా, పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్లో అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. ఇతను శాశ్వతంగా కనుమరుగుకాకపోయినప్పటికీ.. ఇంచుమించు అంచున ఉన్నాడు.పై ఐదుగురు వరల్డ్‌కప్ ఫైనల్స్ హీరోల పరిస్థితి చూశాక వైభవ్ ఎమవుతాడోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఉంది. ప్లేయర్ ఆఫ ద ఫైనల్స్‌గా నిలిచిన ఆటగాళ్ల కెరీర్లు బాగా లేకపోయినా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వాళ్ల కెరీర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజా వరల్డ్‌కప్‌లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో వైభవ్ కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఫ్యాన్స్ ఊరట పొందుతున్నారు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు (వైభవ్ సహా) ఐదుగురు (యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్)ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు. వీరంతా కెరీర్లో అత్యున్నతి సాధించారు. వైభవ్ కూడా వీరి బాటలోనే నడవాలని ఆశిద్దాం. -
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్
హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్ 19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్‌లోని ఫైర్ చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్‌ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు. విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఐస్లాండ్ క్రికెట్ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరును ఐస్లాండ్ క్రికెట్ ఎక్స్ రేటెడ్ హింసగా పేర్కొంది. Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!— Iceland Cricket (@icelandcricket) February 6, 2026ఐస్లాండ్ క్రికెట్ ఈ ట్వీట్‌ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్ రేటెడ్ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్ బీభత్సం.ఈ సునామీ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
వైభవ్ విశ్వరూపం.. వరల్డ్ రికార్డులు బద్దలు
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. రికార్డుస్దాయిలో ఆరోసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. తుది పోరులో వైభవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 150 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 412 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్ రికార్డులు బద్దలు👉అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(175) సాధించిన ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉన్మక్త్ చంద్(111*) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చంద్‌ను వైభవ్ అధిగమించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే వైభవ్ సెంచరీ సాధించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా సూర్యవంశీనే కావడం విశేషం.👉అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది.👉అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ (30) నిలిచాడు. -
ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు.. వరల్డ్ ఛాంపియన్స్‌గా భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన యువ భారత్.. ఆరో వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల వైభవ్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ అయూశ్ మాత్రే(53), కనిష్క్ చౌహాన్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఫాల్కనర్ విరోచిత పోరాటం..అనంతరం భారీ లక్ష్య చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలేబ్ ఫాల్కనర్ వీరోచిత పోరాటం కనబరిచాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఫాల్కనర్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.అతడితో పాటు బెన్ డాకిన్స్ (66),థామస్ రెవ్(31) తమ వంతు ప్రయత్నం చేశారు. మిగితా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు పడగొట్టగా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఫైనల్లో భారీ సెంచరీతో చెలరేగిన వైభవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా సరికొత్త చరిత్రఅండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.అండర్-19 ప్రపంచకప్‌లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్‌ను నమోదు చేసింది. -
వరల్డ్‌కప్ ఫైనల్లో వైభవ్ విధ్వంసం.. జస్ట్ డబుల్ సెంచరీ మిస్
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అతడి బ్యాటింగ్ తుఫాను ముందు బౌండరీలు చిన్నబోయాయి.ఈ క్రమంలో కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కును వైభవ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. తొలి స్దానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్జుక్(51) ఉన్నాడు. అయతే ఈ ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సునాయసంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ ద్విశతకానికి 25 పరుగుల దూరంలో అతడు నిలిచిపోయాడు. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యవంశీ తన వికెట్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్..15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ 25 ఓవర్లకే 250 పరుగుల మార్క్ దాటిపోయింది.కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఈ బిహార్ ఆటగాడు పలు వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన వైభవ్అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మైఖేల్ హిల్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. అదేవిధంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాజ్ అంగద్ బావా పేరిట ఉండేది. అతడు 2022లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ సాధించాడు.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 -
WC: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును జమ చేసుకున్నాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్, యూత్ వన్డేల్లో అతి పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ ఫైనల్‌కు చేరింది.55 బంతుల్లో సెంచరీఇందులో భాగంగా శుక్రవారం నాటి టైటిల్ పోరులో ఇంగ్లండ్‌తో తలపడుతున్న ఆయుశ్ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ (9) విఫలం కాగా.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నెమ్మదిగా ఆరంభించినా వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చర పిడుగు.. 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.That's a BIGGIEEEE! 🤯🔥Vaibhav Sooryavanshi is unstoppable at the moment as he scores a MASSIVE SIX off Farhan Ahmed while the 100 run-stand between Boss Baby & Ayush! 🔥🙌🏻ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/O876Ot9LrZ— Star Sports (@StarSportsIndia) February 6, 2026ఈ క్రమంలో ఐదు సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఎడిషన్‌లో ఇరవై సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఏకంగాఇ 175 పరుగులు సాధించాడు. అయితే, లమ్స్‌డన్ బౌలింగ్‌లో థామస్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ డబుల్ సెంచరీ చేయకుండానే నిష్క్రమించాడు.అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏వైభవ్ సూర్యవంశీ- 2026లో 20*🏏డెవాల్డ్ బ్రెవిస్- 2022లో 18🏏ఫిన్ అలెన్- 2016, 2018లో కలిపి 18🏏జాక్ బర్న్‌హామ్- 2016లో 15🏏మైకేల్ హిల్-2008లో 14🏏నికోలస్ పూరన్- 2014లో 14.వరల్డ్‌కప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ఇంగ్లండ్బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్ కీపర్/కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ -
అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026 చాంపియన్స్‌గా యువ భారత జట్టు అవతరించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఆరో అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలేబ్ ఫాల్కనర్(115 ) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు పడగొట్టగా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎనిమిదో వికెట్ డౌన్269 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మింటో..అంబరిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు ఫాల్కనర్(77) మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఫాల్కనర్ ఒంటరి పోరాటం31 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కాలేబ్ ఫాల్కనర్ (58) దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 166 పరుగులు కావాలి.ఇంగ్లండ్ ఏడో వికెట్ డౌన్142 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 227 పరుగులు అవసరమవ్వగా.. ఆరో టైటిల్‌ను ముద్దాడేందుకు భారత్‌కు మూడు వికెట్లు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఅయూశ్ మాత్రే వేసిన 21 ఓవర్లో ఇంగ్లండ్ వరుసగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 66 పరుగులు చేసిన బెన్ డాకిన్స్ క్యాచ్ ఔట్ కాగా.. రాల్ఫీ ఆల్బర్ట్ క్లీన్ రనౌటయ్యాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 174/5ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్142 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్93 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బెన్ మేయెస్.. ఖిలాన్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 114/2తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన జోసెఫ్ మూర్స్.. అంబరీష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/1భారత్ భారీ స్కోరుఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో మెరవగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీ (53) సాధించాడు. వేదాంత్ 32, విహాన్ 30, అభిజ్ఞాన్ 40 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కనిష్క్ 20 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది.UPDATES:తొమ్మిదో వికెట్ డౌన్48.6: హెనిల్ పటేల్ (5) రనౌట్. తొమ్మిదో వికెట్ డౌన్. స్కోరు: 393-9(49)ఎనిమిదో వికెట్ డౌన్46.4: సెబాస్టియన్ బౌలింగ్‌లో ఖిలాన్ పటేల్ (3) అవుట్. క్రీజులోకి హెనిల్ పటేల్. స్కోరు: 376-8(47).ఏడో వికెట్ కోల్పోయిన భారత్45.1: జేమ్స్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరినఅంబరీష్ (18). క్రీజులోకి ఖిలాన్ పటేల్ఆరో వికెట్ డౌన్44.2: సెబాస్టియన్ బౌలింగ్‌లో రాల్ఫీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అభిజ్ఞాన్ (40). క్రీజులోకి వచ్చిన కనిష్క్ చౌహాన్. స్కోరు: 367-6 (45). 41 ఓవర్లలో భారత్ స్కోరు: 323-5(41)అంబరీష్ పది, అభిజ్ఞాన్ ఏడు పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన భారత్36.3: సెబాస్టియన్ బౌలింగ్‌లో మేయ్స్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వేదాంత్ (32). ఆర్ఎస్ అంబరీశ్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్34.2: జేమ్స్ బౌలింగ్‌లో డాకిన్స్కు క్యాచ్ ఇచ్చి విహాన్ (30) అవుట్. క్రీజులోకి అభిజ్ఞాన్ కుందు. స్కోరు: 304-4(34.4). వేదాంత్ 29 పరుగులతో ఉన్నాడుభారత్ స్కోరు: 297-3(33)విహాన్ మల్హోత్రా 27, వేదాంత్ త్రివేది 27 పరుగులతో ఉన్నారు.వైభవ్ డబుల్ సెంచరీ మిస్వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్ పడింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. డబుల్ సెంచరీ చేసేందుకు కేవలం 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 80 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్..15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులు చేశాడు. స్కోరు: 253-3(26)వైభవ్ సెంచరీ19.6ఫ: 55 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్రెండో వికెట్ డౌన్18.6: అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో మేయ్స్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ (53) అవుట్. విహాన్ మల్హోత్రా క్రీజులోకి రాగా.. వైభవ్ 97 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 162-2(19)వంద పరుగుల భాగస్వామ్యంఆయుశ్ మాత్రే- వైభవ్ సూర్యవంశీ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు.స్కోరు: 122-1 (15).హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ10.5: ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వైభవ్. 31 బంతుల్లో అర్ధ శతకం. స్కోరు: 89-1 (11). ఆయుశ్ 28 పరుగులతో ఉన్నాడు.భారత్ హాఫ్ సెంచరీ- 53-1(8) ఆయుశ్ 18, వైభవ్ 24 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్3.6: సెమీస్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ ఆరోన్ జార్జ్ (11 బంతుల్లో 9).. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్. స్కోరు: 20-1(4). వైభవ్ సూర్యవంశీ 10 పరుగులతో ఉండగా.. ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు.మా వాళ్లు అదరగొడతారు..ఈ సందర్భంగా భారత యువ జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే మాట్లాడుతూ.. "మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. పిచ్ బాగుందనిపిస్తోంది. మెరుగైన స్కోరు సాధిస్తాం. ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి మా వాళ్లు అదరగొడతారు. మాదైన సహజ శైలిలోనే ఆడతాము. సెమీస్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని తెలిపాడు.కాగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆరుసార్లు టైటిల్ గెలిచింది. ఇప్పటికి పదిసార్లు (తాజా ఎడిషన్ కలిపి) ఫైనల్ చేరింది భారత్. మరోవైపు.. ఇప్పటికి ఒకే ఒక్కసారి ట్రోఫీ సాధించిన ఇంగ్లండ్.. రెండో టైటిల్‌పై కన్నేసింది. ఇదిలా ఉంటే.. తొలి సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ఇంగ్లండ్బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్ కీపర్/కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్ -
భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ పదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్‌కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్‌గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్‌గా, రన్నరప్‌గానూ నిలవలేదు. యంగ్ ఇండియా మరోసారి ఫైనల్‌కు చేరి అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.నిన్న జరిగిన 2026 ఎడిషన్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు, వన్‌డౌన్ బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్ వన్‌మ్యాన్ షో కారణంగా భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అత్యుత్తమ ఛేదనఈ ఛేదన అండర్ 19 వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2006 ఎడిషన్‌లో ఐర్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది.ఆఫ్ఘన్ ఆటగాళ్లు శతకాలు వృధాఅంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్ అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించడంతో ఫైజల్, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.ఇంగ్లండ్‌తో అమీతుమీతొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఈ ఆరోన్ జార్జ్ ఎవరు..?ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్ సెంచరీతో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన ఆరోన్ జార్జ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్ గురించిన సమాచారం కోసం గూగుల్ చేస్తున్నారు.మన హైదరాబాదీనే..!19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.సంజూ శాంసన్‌లా..!అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైదరాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పరుగుల వరదగత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.అప్పడు పాక్‌పై..ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్‌ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
భారత అండర్-19 క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్ వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యువ భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా హాఫ్ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్ ఐర్లాండ్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్ వర్సెస్ భారత్మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
WC 2026: వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్ సిక్స్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్ జట్టుతో తలపడింది.ఇద్దరు శతకాలు బాదిహరారేలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్ బ్యాటర్లలో ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగి.. అఫ్గన్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్‌ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.మిగతా వారిలో విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్ దంచికొట్టడంతో అఫ్గన్ విధించిన లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో నూరిస్తాని ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ఫైనల్ జరుగనుంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారుHighest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | IND 🆚 ENG | FRI, 6th FEB, 1 PM pic.twitter.com/Pzay5mAdoI— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
World Cup 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్‌వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో నూరిస్తాని ఒమర్జాయ్ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్ సదాత్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. కాగా ఓపెనర్ ఆరోన్ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్ 310 పరుగులు సాధించింది. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో అఫ్గన్ బ్యాటర్లుకు లైఫ్ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్ రెండో సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్ సదాత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్ బ్యాటర్ ఉజైరుల్లా నియాజాయ్ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరుఅండర్-19 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ -
ప్రపంచకప్ సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్‌డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్‌కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్! -
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి. -
పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు. -
భారత్‌తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు. -
భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్‌లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్ సూర్యవంశీ కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. వైభవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్ చేసిన ఈ స్కోర్ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్‌లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వైభవ్‌పై కట్టలు తెంచుకుంది.వీరిద్దరితో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (16) కూడా విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్ పేసర్ మొహమ్మద్ సయ్యమ్ భారత టాపార్డర్‌ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. మరో 62 పరుగుల తర్వాత భారత్ మరో వికెట్ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్ మల్హోత్రా (21) అహ్మద్ హుస్సేన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్ త్రివేది (50), అభిగ్యాన్ కుందు (12) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.కెప్టెన్సీ నుంచి తీసేయండి..!ఇటీవలికాలంలో ఆయుశ్ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్‌పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్‌లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
పాక్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. సూపర్ సిక్స్‌లో భాగంగా బులవాయో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ షయాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో అలీ హసన్ బలోచ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు భారత్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. ఉదవ్ మోహన్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆసియాకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజాభారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..! -
భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశాడు. ఫైసల్‌తో పాటు కెప్టెన్ మహబూబ్ ఖాన్ (89) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్‌ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 1 (సూపర్ సిక్స్) నుంచి సెమీఫైనల్ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్ రేసులో ఉండిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారీ శతకం బాదిన ఫైసల్ షినోజాదాపై సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఫైసల్‌ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా పాకిస్తాన్ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్‌ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు. -
వరల్డ్‌కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్
అండర్–19 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. తద్వారా శ్రీలంక సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 261 పరుగులు సాధించింది.ఓపెనర్ జోరిచ్ వాన్ వాన్ షాల్క్విక్ (116; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అతడితో పాటు అద్నాన్ లగాడియన్(46), జేమ్స్(47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విఘ్నేశ్వరన్ ఆకాశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ విరాన్ చముదిత (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐర్లాండ్‌తో నేడు జరిగే ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓడిపోతేనే శ్రీలంక సెమీఫైనల్ చేరుకుంటుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. గ్రూప్–1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకుంది.సౌతాఫ్రికా అవుట్‌కాగా ఈ ఓటమితో వరల్డ్‌కప్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. సూపర్-6లో ప్రోటీస్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైంది. దీంతో గ్రూపు-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ జట్లు ఇంటిముఖం పట్టాయి. ఈ టోర్నీ అసాంతం సఫారీలు దారుణ ప్రదర్శన కనబరిచారు. లీగ్ స్టేజిలోనూ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.చదవండి: SA vs WI 2nd T20I: డికాక్ విధ్వంసకర సెంచరీ.. 222 టార్గెట్ హాంఫట్ -
World Cup 2026: టీమిండియా ఘన విజయం
అండర్ 19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్‌కు చేరిన యంగ్ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఒడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విహాన్ మల్హోత్రా (109 నాటౌట్) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది.మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్ (62), కియాన్ బ్లిగ్నాట్ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుశ్ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ చెరో వికెట్ తీశారు. సూపర్ సిక్స్‌లో భారత్ నెక్స్ట్ టార్గెట్ దాయాది పాకిస్తాన్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది. -
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్
జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ (352-8) చేసింది.మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.కాగా, గ్రూప్ దశలో భారత్ వరుసగా యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్ సిక్స్‌లో భాగంగానే భారత్ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ (72)తో ఫామ్‌లోకి వచ్చాడు.తొలుత బ్యాటింగ్చివరగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్ ఓడిన భారత్... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.వైభవ్ ధనాధన్‌ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, ఆరోన్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్ పనాషే మజాయ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ బాదే క్రమంలో ఆరోన్.. సింబరెషెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.దీంతో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వైభవ్ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్. 52 పరుగులు చేసిమొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్‌లో సింబరెషెకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్‌కు.. సూపర్ సిక్స్ దశలో ఇదే తొలి మ్యాచ్. తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.జింబాబ్వేనథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్‌స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!𝙒𝙞𝙙𝙩𝙝 𝙤𝙣 𝙤𝙛𝙛𝙚𝙧, & Vaibhav Sooryavanshi accepted it with interest! 🤌Team India are off to a flying start💥#ICCMensU19WC | #INDvZIM 👉 LIVE NOW ➡️ https://t.co/ty11gF03Wh pic.twitter.com/tEXWCDWeuA— Star Sports (@StarSportsIndia) January 27, 2026 -
యువ సంచలనం.. మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?
జింబాబ్వే వేదికగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్-2026లో భారత యువ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఆయుశ్ మాత్రే సేన.. తదుపరి బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.చివరగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ యువ భారత్.. డీఎల్ఎస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కివీస్ యవ జట్టుతో మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీశ్ (RS Ambrish) కీలక పాత్ర పోషించాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి న్యూజిలాండ్ అండర్-19 జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అంబరీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పద్దెమినిదేళ్ల ఈ కుర్రాడు ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ముందుకు సాగితే టీమిండియాకు మరో హార్దిక్ పాండ్యా దొరికినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?హార్దిక్ మాదిరి ఆరో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొత్త బంతితో బౌలింగ్ చేయగల సత్తా కలిగి ఉండటం ఇందుకు కారణం. తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ అంబరీశ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.తండ్రి కల నెరవేరుస్తున్న తనయుడుకూచ్ బెహర్ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబరీశ్.. 33 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్ రెడ్‌బాల్ క్రికెట్లో జట్టుకు ట్రోఫీని అందించాడు. అతడి తండ్రి ఆర్. సుకుమార్ కూడా క్రికెటరే. జూనియర్ క్రికెట్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు మారిన సుకుమార్ సీనియర్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.రైల్వేస్‌లో సెక్యూరిటీగా ఆ తర్వాత రైల్వేస్‌లో సెక్యూరిటీ జాబ్ పొందిన సుకుమార్.. తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలని భావించాడు. అందుకు తగ్గట్లే చిన్ననాటి నుంచే అంబరీశ్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను నెరవేరుస్తున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన అంబరీశ్.. భారత అండర్-19 జట్టులోనూ ఎంట్రీ ఇచ్చాడు.గతేడాది జూన్‌లో ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేల ద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన అంబరీశ్.. అప్పటి నుంచి భారత అండర్-19 తుది జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్న అంబరీశ్ మెరుగ్గా రాణిస్తే.. టీమిండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడనటం అతిశయోక్తి కాదు. చదవండి: యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము! -
పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్‌కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ యువ బ్యాటర్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ బెన్ మేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో మేస్ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేస్ భారీ శతకంతో పాటు ఓపెనర్ జోసఫ్ మూర్స్ (81) అర్ద సెంచరీతో రాణించాడు. లోయర్ మిడిలార్డర్ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్ థామస్ రూ 22, కాలెబ్ ఫాల్క్‌నర్ 32, రాల్ఫీ ఆల్బర్ట్ 13, ఫర్హాన్ అహ్మద్ 15 (నాటౌట్), సెబాస్టియన్ మోర్గాన్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 5 పరుగులకే ఔటయ్యాడు.స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్‌హౌస్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్ 2, మ్యాక్స్ ఛాప్లిన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్ (6), మ్యాక్స్ ఛాప్లిన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, లూక్ హ్యాండ్స్, ఫర్హాన్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.కాగా, ప్రస్తుత ఎడిషన్ ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ విల్ మలాజ్చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. ఖాసిమ్ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ (79 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్ పర్మార్ (33), చార్లెస్ హింజ్ (24), హర హింజ్ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్ బౌలర్లలో కూరే 3, విల్ బైరోమ్ 2, ఆర్యన్ శర్మ, కేసీ బార్టన్ తలో వికెట్ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. మలాజ్చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్‌తో స్కాట్లాండ్ పతనాన్ని శాశించాడు. మొమిన్ కమర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ తలో వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన థామస్ నైట్ టాప్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్ (33), ఓల్లీ జోన్స్ (30), మను సరస్వత్ (25), రోరి గ్రాంట్ (21), ఫిన్లే కార్టర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్‌కు సరస్వత్, ఫిన్లే జోన్స్ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్ ఖాన్ (75), అహ్మద్ హుసేన్ (47) పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ ఫర్హాన్ (18 నాటౌట్) పాక్‌ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అలీ హసన్ బలోచ్ 15, స్టార్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఓల్లీ జోన్స్, సరస్వత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్ సూపర్-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బుల్బులియా, జేసన్ రోల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. -
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?
ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్‌షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్‌కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్‌పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్‌లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో కమల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్‌లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్‌ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
వైభవ్, అభిజ్ఞాన్ హాఫ్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.ప్రారంభంలోనే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోపడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72), అభిజ్ఞాన్ కుండు(80 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.అయితే వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్ చేసేలా కన్పించిన భారత్.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధిముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ప్రస్తుతం బంగ్లా-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు కెప్టెన్లు టాస్ సందర్భంగా కరచాలనం చేసుకునేందుకు నిరాకరించారు.చదవండి: U19 World Cup 2026: భారత్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్' -
భారత్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్'
నో హ్యాండ్ షేక్.. ఈ వివాదం గతేడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2025 సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయడం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ నఖ్వీ చేతుల మీదగా భారత్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్రత్యర్ధి మారింది.ఏమి జరిగిందంటే?అండర్-19 ప్రపంచకప్ 2026లో బులవాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా 2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. నిన్న (జనవరి 16) జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత సౌతాఫ్రికాను 238 పరుగులకే ఆలౌట్ చేసి, 28 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఖలీద్ అహ్మద్ (74), ఫైసల్ షినోజాదా (81), ఉజైరుల్లా నియాజాయ్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి ఆఫ్ఘనిస్తాన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆతర్వాత అబ్దుల్ అజీజ్, ఖటిర్ స్టానిక్జాయ్ తలో 2, నూరిస్తానీ ఒమర్జాయ్, హఫీజ్ జద్రాన్ చెరో వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బేశారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఫీలర్డు మైదానంలో పదరసంలా కదిలారు. ఏకంగా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లను రనౌట్ చేశారు.సౌతాఫ్రికా విషయానికొస్తే.. తొలుత బౌలింగ్‌లో బుయండా మజోలా, కోర్నే బోథా తలో 3, జేజే బస్సన్ ఓ వికెట్ తీసి రాణించారు. ఆతర్వాత బ్యాటింగ్‌లో జేసన్ రోల్స్ (98) అద్భుతంగా రాణించినా సౌతాఫ్రికాను గట్టెక్కించలేకపోయాడు. రోల్స్ సెంచరీకి ముందు రనౌట్ కావడంతో సౌతాఫ్రికా పరిస్థితి తారుమారయ్యింది. చివర్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లోనై అనవసరపు రనౌట్లయ్యారు. ఫలితంగా మ్యాచ్‌ను కోల్పోయారు. ఈ గెలుపు క్రెడిట్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లకే దక్కుతుంది.కాగా, ప్రపంచకప్‌లో భాగంగా నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా బోణీ కొట్టాయి. ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించాయి. ఇవాళ (జనవరి 17) బంగ్లాదేశ్ భారత్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇదివరకే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. -
అండర్-19 ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్.. అందరి చూపు వైభవ్‌వైపే..!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి (జనవరి 15) అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. భారత్–యూఎస్ఏ మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టింది.23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్‌లుగా (గ్రూప్‌కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్-6, సెమీస్, ఫైనల్ జరుగుతాయి. గ్రూప్‌ల వివరాలు- గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్ - గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా - గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ - గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా ఈ టోర్నీలో భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం ఐదు సార్లు టైటిల్ గెలిచింది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్‌కు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. యువ భారత జట్టులో మరి కొంతమంది గమనించదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు, దీపేశ్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అంబ్రిష్ లాంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ లాంటి వారు అండర్-19 ప్రపంచకప్‌లో మెరిసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ టోర్నీకి చాలా ప్రత్యేకత ఉంది.ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు భారత్ (5) కాగా.. ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్ 2, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలో సారి టైటిళ్లు గెలిచాయి. ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై వైభవ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.భారత్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. సౌతాఫ్రికాతో మూడు యూత్ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాడు వైభవ్. అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీకి ముందు అతడు ఫామ్‌లోకి రావడంతో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.స్కాట్లాండ్తో మ్యాచ్‌లోనూ అదరగొట్టిఅదే జోరును కొనసాగిస్తూ స్కాట్లాండ్తో అండర్-19 వరల్డ్‌కప్-2026 వార్మప్ మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జింబాబ్వే వేదికగా.. స్కాట్లాండ్ జట్టుపై ఈ ఓపెనింగ్ బ్యాటర్ 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం భారత్.. పసికూన స్కాట్లాండ్పై 121 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఒకే ఒక్క పరుగుజట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే, జింబాబ్వేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో సోమవారం నాటి వార్మప్ మ్యాచ్‌లో మాత్రం వైభవ్ పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.ఇంగ్లిష్ పేసర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్‌లో షాట్ ఆడే క్రమంలో థామస్ ర్యూకి క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. పసికూన స్కాట్లాండ్పై చితక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తాజాగా పటిష్ట ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తేలిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. భారత్ మెరుగైన స్కోరుఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. వైభవ్‌తో పాటు వేదాంత్ త్రివేది (14), విహాన్ మల్హోత్రా (10) విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 99 బంతుల్లో 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన వారిలో ఆర్ఎస్ అంబరీశ్ 48, కనిష్క్ చౌహాన్ 45 (నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్‌డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్‌కప్ మొదలుకానుంది.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు


