అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.
ప్రారంభంలోనే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోపడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72), అభిజ్ఞాన్ కుండు(80 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
అయితే వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్ చేసేలా కన్పించిన భారత్.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధిముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
కాగా ప్రస్తుతం బంగ్లా-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు కెప్టెన్‌లు టాస్ సందర్భంగా కరచాలనం చేసుకునేందుకు నిరాకరించారు.
చదవండి: U19 World Cup 2026: భారత్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్'


