టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.
యాన్సెన్ హాఫ్ సెంచరీ
అదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు.
Everything is flying to the boundary tonight! 🫣
ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026
ఫాస్టెస్ట్ సెంచరీ
కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్ చరిత్ర సృష్టించాడు.


