పొట్టి క్రికెట్ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
టాస్ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.
It’s semi-final time! Mitchell Santner has won the toss and opted to bowl first! 🪙
Who will be the first team to make it to the final? 🤔
ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/N8m1kkxoX8— Star Sports (@StarSportsIndia) March 4, 2026
మా తుదిజట్టులో మూడు మార్పులు
ఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్‌లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్ చేశాము.
మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్, కేశవ్ మహరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్ వేట దిశగా సెమీస్ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారు
నిలకడైన ఆట.. ప్రొటిస్‌దే పైచేయి
మరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని న్యూజిలాండ్ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు.
ఇక సూపర్-8 దశలో పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. పాక్ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.
తుదిజట్లు ఇవే
న్యూజిలాండ్
టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్‌కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్
సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.
చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా


