Finn Allen
-
అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసరకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా కేకేఆర్ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్ నైట్స్, గోల్డెన్ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్ అలెన్ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్ అలెన్ సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్ వేయగా ఫిన్ అలెన్ వికెట్ నుంచి పక్కకు జరిగి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్ అలెన్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్ నైట్స్ 6 వికెట్ల తేడాతో గోల్డెన్ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (45), సార్థక్ రాజన్ (37), రింకూ సింగ్ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్ఆర్హెచ్, పంజాబ్, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’ -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు దూరం
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత న్యూజిలాండ్ తమ మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది.ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ప్రపంచ కప్ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీలు వంటి స్టార్ ప్లేయర్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.కటేన్ క్లార్క్, నిక్ కెల్లీ, జేడన్ లెన్నాక్స్‌లకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్సన్ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. బెవాన్ జాకబ్స్, జాక్ ఫౌల్క్స్,టిమ్ రాబిన్సన్ కూడా పునరాగమనం చేశారు. వీరు ముగ్గురు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్నారు.కాగా కెప్టెన్ శాంట్నర్ తొలి మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఆ తర్వాత ఆఖరి రెండు టీ20ల్లో టామ్ లాథమ్ కివీస్ జట్టును నడిపించనున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2026 రన్నరప్‌గా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే.సౌతాఫ్రికా సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టుకటేన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, బెవాన్ జాకబ్స్, కైల్ జెమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జేడన్ లెన్నాక్స్, కోల్ మెక్కాన్చీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సీర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న న్యూజిలాండ్ చిచ్చరపిడుగులు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్ మినీ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ టిమ్ సీఫర్ట్ (రూ. 1.5 కోట్లు), ఫిన్ అల్లెన్ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. మరో ఎండ్‌లో సీఫర్ట్ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్, సీఫర్ట్ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డన్స్‌లో కావడం విశేషం. అల్లెన్, సీఫర్ట్ విధ్వంసకాండ చూశాక కేకేఆర్ అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వచ్చింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్‌కు అల్లెన్, సీఫర్ట్ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్ వచ్చే సీజన్లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్ మరోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం. దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్‌ను రెండో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో వీరిద్దరి ఫామ్ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు. తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అల్లెన్-సీఫర్ట్ జోడి.. ఈ ఎడిషన్‌లో 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్ రికార్డు నెలకొల్పింది. మొత్తంగా అల్లెన్-సీఫర్ట్ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్ యోధుడు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్‌గా (ఫుల్ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్‌గా ఓ ఫుల్ మెంబర్ జట్టు తరఫున సికందర్ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో బ్రెండన్ మెక్కల్లమ్తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీ కౌంట్ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్‌కప్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్ బాల్స్ (3). టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున మూడో శతకం (మెక్కల్లమ్, ఫిలిప్).ఈ ఇన్నింగ్స్‌తో అల్లెన్ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్ చేసి న్యూజిలాండ్‌ను ప్రపంచకప్ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
కివీస్ కిర్రాక్ షో
చోకర్స్... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్ మొదలు, సూపర్–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్ కొచ్చేసరికి చేతులెత్తేసింది. కోల్‌కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్‌లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్‌రేట్‌తో సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. సఫారీ జట్టు మూగబోయింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. కివీస్ బౌలర్లు మెక్‌కోన్‌కీ (2/9), రచిన్ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ అలెన్ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ (2021లో తొలిసారి రన్నరప్)... నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్ కోసం తలపడుతుంది. టాపార్డర్ తడబాటు కెప్టెన్ మార్క్రమ్ (18), డికాక్ (10), రికెల్టన్ (0) ఇలా టాప్–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్ (6), అప్పటిదాకా టాప్‌స్కోరర్ అయిన బ్రెవిస్ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. అలెన్ ధన్ ధనాధన్ తొలి ఓవర్లో సీఫెర్ట్ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్ ఫోర్ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్‌ను దాటేశాయి. 6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్‌లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్‌ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్ స్ట్రోక్స్ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్‌ను అవుట్ చేశాడు. కానీ కివీస్ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్ సాఫల్యానికి ఆలస్యమైంది. అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్ వేసిన 13వ ఓవర్లో అలెన్ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. 33 టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అలెన్ రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్ సవరించాడు.6 ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) మిచెల్ (బి) రచిన్ 18; డికాక్ (సి) ఫెర్గూసన్ (బి) మెక్‌కోన్‌కీ 10; రికెల్టన్ (సి) అలెన్ (బి) మెక్‌కోన్‌కీ 0; బ్రెవిస్ (సి) సాంట్నర్ (బి) నీషమ్ 34; మిల్లర్ (సి) మిచెల్ (బి) రచిన్ 6; స్టబ్స్ (బి) ఫెర్గూసన్ 29; యాన్సెన్ (నాటౌట్) 55; బాష్ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్ (బి) హెన్రీ 0; కేశవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్: హెన్రీ 4–0–34–2, మెక్‌కోన్‌కీ 1–0–9–2, ఫెర్గూసన్ 4–0–29–1, నీషమ్ 3–0–42–1, సాంట్నర్ 4–0–25–0, రచిన్ రవీంద్ర 4–0–29–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (బి) రబడ 58; అలెన్ (నాటౌట్) 100; రచిన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 173. వికెట్ పతనం: 1–117. బౌలింగ్: యాన్సెన్ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్గిడి 2–0–22–0, బాష్ 2–0–35–0, కేశవ్ 3–0–33–0. -
ఫిన్ అలెన్ వరల్డ్ రికార్డ్.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్..!
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. -
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్ చరిత్ర సృష్టించాడు. -
T20 WC 2026: కివీస్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్ రికార్డు విజయం సాధించింది. చెన్నై వేదికగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడింది కివీస్. చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లోయూఏఈని ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్‌కు ఈ విజయం సాధ్యమైంది. వరల్డ్‌కప్ టోర్నీ తాజా ఎడిషన్ తొలి పోరులో అఫ్గనిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. తద్వారా సూపర్ ఎయిట్‌కు కివీస్ మరింత చేరువైంది.77 బంతుల్లోనే 107 పరుగులుకాగా న్యూజిలాండ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది యూఏఈ. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (45 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలీషాన్ షరఫు (47 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 77 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు.మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి 2 వికెట్లు తీయగా.. జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రపంచ రికార్డు అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.సీఫెర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 89 పరుగులు.. అలెన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 84 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.తద్వారా తొలి వికెట్‌కు 92 బంతుల్లోనే 175 పరుగులు జత చేసి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఏ వికెట్‌కైనా అత్యధిక స్కోరు సాధించిన జోడీగా సీఫెర్ట్- అలెన్ ప్రపంచ రికార్డు సాధించారు. తమ అద్భుత ప్రదర్శనతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే యూఏఈపై జట్టుకు విజయం అందించారు.టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక భాగస్వామ్యం (ఏ వికెట్‌కైనా)🏏టిమ్ సీఫెర్ట్- ఫిన్ అలెన్ (న్యూజిలాండ్): 2026లో యూఏఈ మీద 175 నాటౌట్🏏జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్): 2022లో టీమిండియా మీద 170 నాటౌట్🏏క్వింటన్ డికాక్- రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా): 2022లో బంగ్లాదేశ్ మీద 168 🏏మహేళ జయవర్దనే- కుమార్ సంగక్కర (శ్రీలంక): 2010లో వెస్టిండీస్ మీద 166🏏ఇబ్రహీం జద్రాన్- రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్): 2024లో ఉగాండా మీద 154న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ స్కోర్లు👉యూఏఈ: 173/6(20)👉న్యూజిలాండ్: 175/0(15.2)👉ఫలితం: యూఏఈపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..Absolute carnage 🔥New Zealand shatter records with the highest partnership and the highest successful chase without losing any wickets in ICC Men’s T20 World Cup history. 🇳🇿ICC Men’s #T20WorldCup | #PAKvUSA | LIVE NOW 👉 https://t.co/97PRnnpgoP pic.twitter.com/KjichpPvP0— Star Sports (@StarSportsIndia) February 10, 2026 -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. సీఫర్ట్-అలెన్ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్ రన్స్‌ను కూడా సీఫర్ట్ సిక్సర్‌తోనే సాధించాడు. అలెన్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సీఫర్ట్ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సీఫర్ట్ ధాటికి ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్ విధ్వంసకర ఫామ్ చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్‌కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్‌లపై న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమే. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు బౌలింగ్‌లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ లాంటి ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్ ఖాన్ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. -
IND vs NZ: న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పులు
టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ హ్యాట్రిక్ విజయాలతో 3-0తో కివీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తమకు మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు సంబంధించి తమ జట్టులో కీలక మార్పులు చేసింది.ఆ ఇద్దరిపై వేటుయువ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్లను జట్టు నుంచి తొలగించిన కివీస్. వారి స్థానాల్లో జేమ్స్ నీషమ్, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా టిమ్ సీఫర్ట్ కూడా జట్టుతో చేరినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక ఐదో టీ20 కోసం టాపార్డర్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా జట్టుతో చేరతాడని బ్లాక్‌క్యాప్స్ తెలిపింది.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ 2-1తో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించిన కివీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలతో ఓటమిపాలైంది. ఇక భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాలుగో టీ20, శనివారం ఐదో టీ20 జరుగనున్నాయి. ఇందుకు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలు.భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జేకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జెమీసన్, మైకేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జేకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం.. జోష్‌లో కేకేఆర్ ఫ్యాన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో అలెన్‌కు ఇది ఐదో శతకం. బీబీఎల్‌లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్‌లోనూ జోష్ నింపింది. అలెన్‌కు కేకేఆర్ 2026 సీజన్ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన అలెన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. కేవలం 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్ సంధు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అలెన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అలెన్ ఊచకోత కోయడంతో స్కార్చర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్.. అలెన్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్ మార్ష్ 20, కూపర్ కన్నోలీ 18, ఆరోన్ హార్డీ 22, ఆస్టన్ టర్నర్ 13, లారీ ఈవాన్స్ 21, నిక్ హాబ్సన్ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో సామ్ ఇలియట్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ తడబడింది. టిమ్ సీఫర్ట్ (66), జేక్ ఫ్రేజర్ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్ బౌలర్లు కన్నోలీ, బియర్డ్‌మన్ తలో 2, లూక్ హాల్ట్, ఆరోన్ హార్డీ చెరో వికెట్ తీసి రెనెగేడ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. -
న్యూజిలాండ్ క్రికెట్‌కు బిగ్ షాక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో ఆటగాడు కూడా ఈ జాబితాలో చేరాడు. ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరూర్కీ (William O'Rourke) ఆటకు మూడు నెలల పాటు దూరంగా ఉండనున్నాడు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈనెలలో జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి టెస్టు సందర్భంగా 24 ఏళ్ల విలియమ్ గాయపడ్డాడు. అతడి వెన్ను నొప్పి దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకున్నాడు.కనీసం మూడు నెలలపాటు విశ్రాంతిఈ క్రమంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. కనీసం మూడు నెలలపాటు విలియమ్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. కాగా అక్టోబరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో కూడా తలపడాల్సి ఉంది.గ్లెన్, ఫిన్ కూడా అవుట్‌ఈ మూడు ప్రధాన సిరీస్‌లకు విలియమ్ ఓరూర్కీ దూరం కానున్నాడు. మరోవైపు.. ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philps) గజ్జల్లో గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా కుడికాలి పాదం నొప్పితో కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి.సారథికీ గాయంఇదిలా ఉంటే.. కివీస్ వన్డే, టీ20 క్రికెట్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా గాయపడటం గమనార్హం. గజ్జల్లో నొప్పి కారణంగా అతడు ఇటీవలే ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చాడు. ది హండ్రెడ్ లీగ్ నుంచి అర్ధరంతంగా తప్పుకొన్నాడు. సాంట్నర్ కూడా నెలరోజుల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.అతడొక వరల్డ్ క్లాస్ప్లేయర్.. జట్టులో ఉంటాడుఈ విషయాల గురించి న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘విలియమ్ పరిస్థితి బాధాకరంగా ఉంది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. గ్లెన్, ఫిన్ కూడా ఇప్పటికే దూరమయ్యారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు టీ20 జట్టులో కీలక బ్యాటర్లుగా మారిపోయారు. కానీ దురదృష్టవశాత్తూ గాయాలు వారిని వెంటాడుతున్నాయి. మిచెల్ సాంట్నర్ ఓ వరల్డ్‌క్లాస్ ప్లేయర్. ఆటగాడిగా, కెప్టెన్‌గా అతడి నైపుణ్యాలు అమోఘం. జట్టులో అతడు ఉంటాడు. అయితే, సర్జరీ తర్వాత ఫిట్నెస్ ఆధారంగా మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని తెలిపాడు. మరోవైపు.. పేస్ బౌలర్ బెన్ సీర్స్ రూపంలో కివీస్‌కు శుభవార్త అందింది. పక్కటెముకల నొప్పి నుంచి అతడు కోలుకున్నాడు. కాగా గాయం వల్ల ఈ పేస్ బౌలర్ జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్‌లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్ (225) అలెన్‌దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ మహోగ్రరూపం దాల్చాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ లీగ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న అలెన్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇవాళ (జూన్ 13) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్ 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అలెన్ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు పూరన్ పేరిట ఉండేది. పూరన్ 2023 ఎడిషన్‌లో 40 బంతుల్లో శతక్కొట్టాడు. నేటి మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎంఎల్సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. గతంలో కూడా ఈ రికార్డు యూనికార్న్స్ (215/5) పేరిటే ఉంది.నేటి మ్యాచ్‌లో యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి 20 బంతుల్లో 36, హసన్ ఖాన్ 18 బంతుల్లో 38 (నాటౌట్), టిమ్ సీఫర్ట్ 10 బంతుల్లో 18, జేక్ ఫ్రేజర్ 9 బంతుల్లో 6, కూపర్ కన్నోలీ 7 బంతుల్లో 5, కోరె ఆండర్సన్ 6 బంతుల్లో 3 (నాటౌట్) పరుగులు చేశారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, నేత్రావల్కర్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ గట్టిగానే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతుంది. 10 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ స్కోర్ 118/8గా ఉంది. బెన్ సియర్స్ (1), ఇయాన్ హోలాండ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (20 బంతుల్లో 39), రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 42), వన్ డౌన్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ (7 బంతుల్లో 21) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఆతర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (5), గ్లెన్ ఫిలప్స్ (0), ఆండ్రియస్ గౌస్ (2), ఒబస్ పియనార్ (2), ముక్తార్ అహ్మద్ (1) దారుణంగా విఫలమయ్యారు. యూనికార్న్స్ బౌలర్లలో రౌక్స్, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లు తీయగా.. లియామ్ ప్లంకెట్ ఓ వికెట్ పడగొట్టాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు..ఫిన్ అలెన్-19 (న్యూజిలాండ్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్)సాహిల్ చౌహాన్-18 (సైప్రస్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్) -
PAK Vs NZ: పాక్‌తో నాలుగో టీ20.. ఫిన్ అలెన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు.అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్‌ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది. ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మేల్కొలిపాడు. బ్రేస్‌వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్‌వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. ఆ ఓవర్లో బ్రేస్‌వెల్‌తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో బ్రేస్‌వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది. 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీస్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను వీరిద్దరూ వదులుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాన్వే, అలెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ తమ కాంట్రక్ట్ రెన్యూవల్‌పై సంతకం చేయలేదని కివీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.కివీస్ సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా అభ్యర్ధను అంగీకరించినందుకు న్యూజిలాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. ఈ నిర్ణయం నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను. నా కుటంబంతో కొద్ది రోజులు గడపాలనకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్క్లాప్స్ తరపున ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో ముఖ్యమైన టెస్టు సిరీస్‌లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేండుకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసే ప్రకటనలో డెవాన్ పేర్కొన్నాడు. కాగా అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు కాన్వేకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. -
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(33 బంతుల్లో 8, 3 సిక్స్‌లతో 62 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్ ఖాన్ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్ రెండు, కౌచ్, ఆండర్సన్ తలా వికెట్ సాధించారు.ఫిన్ అలెన్ విధ్వంసం..అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్ అలెన్(న్యూజిలాండ్) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాప్ సెంచూరియన్‌గా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆసీస్ స్టార్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్(24నాటౌట్) రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్‌కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్‌తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్‌లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
ఫిన్ అలెన్ ఊచకోత.. పాక్ బౌలర్లపై మెరుపుదాడి
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో కివీస్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
అలెన్ అదరహో
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (34 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ (3/23), ఇష్ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే! వీడియో వైరల్
మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్ ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో 142 పరుగులకే ఆలౌటైంది. సీటెల్ ఓర్కాస్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్ ఫిన్ అలెన్ విచిత్రకర రీతీలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? శాన్ ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ వేసిన కామెరాన్ గానన్ బౌలింగ్‌లో రెండో బంతిని అలెన్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డర్ కాస్త దూరంగా ఉండడంతో ఈజీగా పరుగు తీయవచ్చని అలెన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే ఫీల్డర్ షెహన్ జయసూర్య వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రీజుకు దగ్గరలో ఉన్న అలెన్ కాస్త వేగంగా పరిగిత్తే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోయి కింద పడిపోయింది. అంతలో షెహన్ జయసూర్య స్టంప్స్‌ను పడగొట్టడంతో అలెన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగులు చేసిన అలెన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అలెన్ రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రనౌట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. "పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే" అంటూ కామెంట్ చేశాడు. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి WHAT JUST HAPPENED⁉️ Was this the only way Finn Allen could get out tonight? HEADS-UP play and a BEAUTIFUL throw from Shehan Jayasuriya! 4⃣2⃣/1⃣ (3.2) pic.twitter.com/GZk5bkYG4Q — Major League Cricket (@MLCricket) July 16, 2023 -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియా పేసర్
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్, న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌లు నామినేట్ అయ్యారు. అర్ష్‌దీప్ సింగ్: టీమిండియాకు ఈ ఏడాది టి20ల్లో లభించిన ఆణిముత్యం అర్ష్‌దీప్ సింగ్. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తూ అర్ష్‌దీప్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ మెగాటోర్నీలో పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తంగా 21 మ్యాచ్‌లాడి 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్స్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అర్ష్‌దీప్ ఎటువంటి గొడవలు, బెరుకు లేకుండా బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. ఆరంభంలో తొలి బంతికే బాబర్ ఆజంను గోల్డెన్ డకౌట్ చేసిన అర్ష్‌దీప్ తన మరుసటి ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ ఈసారి ఆసిఫ్ అలీని ఔట్ చేసి ఓవరాల్‌గా 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఈ ఏడాది టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డేల్లో మ్యాచ్‌ల్లో పలు వికెట్లు తీసిన జాన్సెన్కు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ మరిచిపోలేనిది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 158 పరుగులకే కుప్పకూలడంలో జాన్సెన్ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 35 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఇబ్రహీం జర్దన్: ఈ ఏడాది అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్కు మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే జర్దన్ ఈ ఏడాది వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు.. అలాగే 36.70 సగటుతో టి20ల్లో 367 పరుగులు చేశాడు. ఇక పల్లకెలే వేదికగా లంకతో మ్యాచ్‌లో 162 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే మహ్మద్ షెహజాద్ 131 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఫిన్ అలెన్: టి20 మెగాటోర్నీ ఆరంభానికి ముందు స్కాట్లాండ్తో జరిగిన టి20 సిరీస్‌లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఢిపెండింగ్ చాంపియన్ ఆసీస్ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్ టూర్లో హాప్ సెంచరీతో మెరిసిన అలెన్ ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లతో మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక మహిళల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేట్ కావడం విశేషం. పేసర్ రేణుకా సింగ్‌తో పాటు వికెట్ కీపర్ యస్తిక బాటియా ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలిస్ కాప్సీ కూడా పోటీలో ఉన్నారు. ఐసీసీ 2022 అవార్డ్స్‌ను మొత్తంగా 13 కేటగిరీల్లో ఇవ్వనున్నారు. ఇందులో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిష్టాత్మక సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందజేయనున్నారు. అలాగే ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన క్రికెటర్‌కు రేచల్ హేయో ఫ్లింట్ అవార్డు ఇవ్వనున్నారు. The future looks bright 🙌 Our nominees for the ICC Men’s Emerging Cricketer of the Year were phenomenal in 2022. Find out more about them 👉 https://t.co/eHhghBmGo3#ICCAwards pic.twitter.com/rY5AAyBSK1 — ICC (@ICC) December 28, 2022 The four nominees for the ICC Women’s Emerging Cricketer in 2022 produced some amazing performances 🔥 More on their achievements 👉 https://t.co/04vQypUyAt #ICCAwards pic.twitter.com/eWir1w81Rk — ICC (@ICC) December 28, 2022 చదవండి: మాట నిలబెట్టుకున్న కేన్ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర -
WC 2022: కుప్పకూలిన టాపార్డర్.. మరీ ఇంత చెత్తగానా? అస్సలు ఊహించలేదు
T20 World Cup 2022 - New Zealand vs Australia: స్వదేశంలో భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైంది. బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి సూపర్-12 ఆరంభం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కంగారూ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్(16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 పరుగులు- నాటౌట్) అద్భుత ఆరంభం అందించారు. వీరిద్దరి విజృంభణతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 200 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు ఒకటి, హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుప్పకూలిన టాపార్డర్ న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు వార్నర్ 5, ఆరోన్ ఫించ్ 13.. వన్‌డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 16 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ చేసిన 28 పరుగులే ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. ఇక ఆఖర్లో ప్యాట్ కమిన్స్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లోనే 89 పరుగులతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరీ చెత్తగా ప్రతిష్టాత్మక టోర్నీలో స్వదేశంలో ఆరంభ మ్యాచ్‌లోనే ఆసీస్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్, బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడ్డ ఫించ్ బృందంపై అభిమానులు మండిపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మరీ ఇంత చెత్తగా ఆడుతుందని ఊహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ పరిస్థితి ఇలా ఉంటే.. న్యూజిలాండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టి సమిష్టి కృషితో విజయం సాధించింది. చదవండి: T20 WC 2022: ఇదేం బ్యాటింగ్‌రా బాబు.. తొలి ఓవర్లోనే బౌలర్‌కు చుక్కలు! T20 WC 2022: ఫిలిప్స్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ..! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇదేం బ్యాటింగ్‌రా బాబు.. తొలి ఓవర్లోనే బౌలర్‌కు చుక్కలు!
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 సమరం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 16 బంతుల్లోనే 5ఫోర్లు, 42 పరుగులు చేసి కివీస్‌కు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచిల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో అలెన్ ఏకంగా 14 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్లో మూడో బంతికి అలెన్ లాంగ్ ఆన్ మీదగా అద్భుతమైన సిక్స్ బాదాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సునామీ ఇన్నింగ్స్ ఆడిన అలెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్‌కు ఇటువంటి షాట్ ఆడటం అంత ఈజీ కాదు అని కొనియాడుతున్నారు. ఇక అఖరికి 42 పరుగులు చేసిన అలెన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. This was a crazy shot from Finn Allen. pic.twitter.com/b5ZeZz4iNa — Johns. (@CricCrazyJohns) October 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా -
NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సేన రికార్డు
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు దుమ్ములేపారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దంచికొట్టారు. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఫిన్ అలెన్ 16 బంతుల్లో 42 పరుగులు సాధించగా.. డెవాన్ కాన్వే సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23 పరుగులు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు సాధించాడు. జేమ్స్ నీషమ్ ఆఖర్లో మెరుపులు(13 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్) మెరిపించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో ఐర్లాండ్, బంగ్లాదేశ్ మీద 190 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన కివీస్.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై ఈ మేరకు రాణించడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ అత్యధిక స్కోర్లు సిడ్నీ- 2022- ఆస్ట్రేలియా మీద- 200/3 నాటింగ్‌హాం- 2009- ఐర్లాండ్ మీద- 198/5 పల్లకెలె- 2012- బంగ్లాదేశ్ మీద- 191/32 ఇక ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మెగా టోర్నీ పవర్‌ప్లేలోనూ తమ అత్యధిక స్కోరు(65/1) నమోదు చేసింది న్యూజిలాండ్ జట్టు. ఆసీస్‌తో గత మ్యాచ్‌లలో పవర్‌ప్లేలో కీవీస్ నమోదు చేసిన స్కోర్లు 2018- అక్లాండ్లో- 67/0 2018- అక్లాండ్లో-63/2 చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్! కొత్తగా ఎవరంటే? View this post on Instagram A post shared by ICC (@icc)


