ఐపీఎల్-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు.ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.
30 పరుగుల లోపు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అలెన్.. ఆ తర్వాత మాత్రం గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అలెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
👉ఒకే ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అంతకుముందు మే 8న ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లోనూ అతడు 10 సిక్సర్లు బాదాడు.
👉గుజరాత్ టైటాన్స్‌పై కేకేఆర్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా అలెన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెంకటేశ్ అయ్యర్(83) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అయ్యర్‌ను అలెన్ అధిగమించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫిన్ అలెన్‌తో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కేకేఆర్ చరిత్ర సృష్టించింది.
చదవండి: IND vs AFG: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?


