సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. అలాగే, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పెట్రో ధరల పెంపుపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్..‘పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు. ధరల పెంపుతో నిత్యాసరాల రేట్లు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుంది. అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది.
ఎన్నికలు ముగిసిన పది రోజులకే లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకం. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చెప్పుకుంటారు?. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది’ అని మండిపడ్డారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది.
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల…— Revanth Reddy (@revanth_anumula) May 16, 2026


