హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి.
జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.
మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి.
బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.


