breaking news
Nampally
-
ప్రమాదం ప్రభుత్వమే చేసిందా? కాలిబూడిదైన కీలక ఆధారాలు
-
నాంపల్లి ప్రమాదం.. 2015 కేసు ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. -
నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆదివారం ఉదయం ల్యాబ్‌ను సీజ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రానున్నారు. ల్యాబ్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.కాగా, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో నేడు మరోసారి క్లూస్ టీం ఎస్పీ తనిఖీలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరు ఉన్నారు? అనే దానిపై ఎస్పీ ఆరా తీయనున్నారు. అలాగే, కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించనున్నారు. మరోవైపు.. కార్యాలయంలో అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం. చేశారు. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం దాగి ఉందా అని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ గదిలోంచి ఉదయం 10.30 గంటలకు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆఫీస్‌బాయ్ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీ శ్వేతారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘కేసు సంబంధిత ఆస్తి, ఎఫ్ఎస్ఎల్కు చెందిన సామగ్రి సురక్షితంగానే ఉందని జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం’ అని శిఖా గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.ఎఫ్ఎస్ఎల్ ఎంతో కీలకం వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం. -
ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం 'కీలక ఆధారాలు ఆహుతి'?
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్‌డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షల కోసం ఉన్నట్లు తెలిసింది. ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్‌శాంపిల్స్, హార్డ్‌డిస్కులు, సెల్ఫోన్లు, ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ భద్రంగా ఉందా..? లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితోపాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్‌లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 10.20 గంటలకు... అగ్ని ప్రమాదం శనివారం నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్స్‌లో జరిగింది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ప్రయోగశాల మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్ బాయ్ క్రిష్ణ చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిఇచ్చారు. అప్పటికే ఆఫీసులో ఉన్న ముగ్గురు సిబ్బందితో కలిసి దట్టంగా వ్యాపించిన మంటలను ఆరి్పవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పొగధాటికి తట్టుకోలేక క్రిష్ణ అస్వస్థతకు గురికాగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఐదు ఫైరింజన్లు, ఒక రోబో, రెండు వాటర్ ట్యాంకులతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నార్త్ జోన్ డీఐజీ శ్వేతా, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పగటి పూట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సంభవించిన భవనం పక్కనే నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రి ఉంది. మరొకవైపు అపార్ట్మెంట్లు ఉన్నాయి. రాత్రి వేళలో జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ అధికారుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తోనే జరిగిందా..? లేక ఇంకా ఏదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు స్పష్టం చేస్తేనే... ప్రమాదంలో హార్డ్ డిస్కులు, కేసుల ఫైల్స్, కంప్యూటర్లు, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, శాంపిల్స్‌కు సంబంధించిన రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అయితే, కాలిపోయిన వస్తువుల్లో ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఫోన్‌ట్యాపింగ్ కేసులకు సంబంధించి మొత్తం సమాచారం ఎఫ్ఎస్ఎల్లోనే ఉందా? అవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయా..? లేదా ఎఫ్ఎస్ఎల్లో ఉన్నవి కేవలం నమూనా కాపీలా..? అన్నది అధికారులు స్పష్టం చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ఒకరు మాత్రం ఈ ప్రధాన కేసుల ఆధారాలు ఇక్కడ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపే ఏ రకమైన ఆధారాలైనా.. విశ్లేషించి నివేదిక రూపొందించిన తర్వాత వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా ఎక్కడి నుంచి విశ్లేషణ కోసం పంపారో ఆయా యూనిట్లకు పంపుతారని తెలిపారు. కొన్ని కేసుల్లో కోర్టులు సైతం ఎఫ్ఎస్ఎల్కు ఆధారాలు పంపుతాయని, అలాంటి కేసుల్లో విశ్లేషణ తర్వాత సదరు వస్తువులు, ఆధారాలను తిరిగి కోర్టులకే అప్పగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆధారాల విశ్లేషణ తర్వాత రూపొందించే నివేదికలకు సంబంధించిన కాపీలను మాత్రం ఎఫ్ఎస్ఎల్లో రికార్డు కోసం భద్రపరుస్తారని పేర్కొన్నారు. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో బహుశా అలాంటి నివేదికలకు సంబంధించిన ప్రతులు కాలిపోయే అవకాశం ఉండొచ్చని వివరించారు. ఈ ల్యాబ్‌లో ఏం చేస్తారంటే.. రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. షార్ట్సర్క్యూతోనే...: డీసీపీ శిల్పవల్లి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఆధారాలు, సాక్ష్యాలకు కేంద్రంగా ప్రయోగశాల పనిచేస్తుందన్నారు. మంటల్లో కీలకమైన ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని చెప్పారు. ఆ సమయంపైనే అనుమానాలు ప్రభుత్వ కార్యాలయాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. అప్పడే ఒక్కొక్కరు లోనికి వస్తుంటారు. ఉద్యోగులు వచ్చే సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం తలుపులు తెరుచున్న సమయంలోనే ఇతరులు ఎవరైనా లోనికి ప్రవేశించారా? ప్రవేశిస్తే ఆ సమయంలో పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడున్నారు? అదే సమయంలోనే షార్ట్‌సర్క్యూట్ జరిగిందా లేక అంతకు ముందే జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. హార్డ్ డిస్క్‌లు కాలిపోయాయి: అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై మాకు ఉదయం 10.20 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయి. సమీపంలోని మరో రెండు ఫైర్ టెండర్లు రప్పించాం. మొదటి అంతస్తులో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఉంది, హార్డ్ డిసు్కలు, కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. సెకండ్ ఫ్లోర్‌లోని కెమికల్ ల్యాబ్‌కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానిస్తున్నాం. ఎమ్‌సీబీ వద్ద కేబుల్స్ సేకరించి పరీక్షిస్తున్నాం. ఓటుకు నోటు ఆధారాలు మాయం చేసేందుకే..: కేటీఆర్ ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓటుకు నోటు కేసులో వాయిస్ రికార్డింగ్‌లు తొలగించడంతోపాటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల కొరతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంతో ఏ కేసులో ఆధారాలు చెరిపేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు రేవంత్‌రెడ్డి అంటూ బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పైవిధంగా స్పందించారు. కిషన్‌రెడ్డి అనుమానాలు ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కీలకమైన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక ఆధారాలు అగ్నికి ఆహుతయ్యాయా? లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
అగ్నిప్రమాదం అనుమానాస్పదం: కిషన్ రెడ్డి
సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. -
నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.I am guessing the voice recordings of the famous “Vote for Note” case And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj— KTR (@KTRBRS) February 7, 2026ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారంనేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందిఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదుషార్ట్ సర్క్యూట్… https://t.co/4w0yY1tB17 pic.twitter.com/TrUmEPqY4Z— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
Nampally : ప్రమాదానికి ప్రధాన కారణం అదే! మంటల్లో కీలక డ్యాక్యుమెంట్స్
-
నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం
-
నాంపల్లి: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీ గదిలోని కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ధృవీకరించారు.శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్‌మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ ల్యాబ్‌లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ప్రమాదం జరిగింది. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చాం. ఫైర్ సిబ్బంది శ్రమతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 కంప్యూటర్లు కాలిపోయాయి. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తులో ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది’’ అని తెలిపారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైంది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం సీజ్డ్ గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
దారిలేదు.. ముగ్గురం చనిపోయేట్టు ఉన్నాం!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: ‘హలో... అన్నా, అన్నా.. మర్జాతే అన్నా. జగా నహీహై అన్నా’ నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని సాయి బిశ్వాస్ చాంబర్స్‌లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో గత శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన ఆ షాపు ఆటో డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ మాటలు ఇవి. సెల్లార్లో ఉన్న చిన్నారుల్ని రక్షించడానికి వెళ్లి, తప్పించుకునే దారిలేక, చిక్కుకుపోయిన అతడు అక్కడి నుంచే అదే దుకాణంలో పనిచేసే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఈ కాల్లో అతడు మాట్లాడుతుండగా..వెనుక చిన్నారుల అరుపులు, ఏడుపులు సైతం వినిపించాయి. సదరు స్నేహితుడి ఫోన్లో రికార్డు అయిన ఈ కాల్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అనేక మందిని కన్నీరు పెట్టించింది. ఈ ఫోన్ సంభాషణను పరిశీలిస్తే ఆ దుకాణంలోని సెల్లార్, సబ్ సెల్లార్ సరుకుతో నిండిపోయి ఉండటం, ఎటూ కదలడానికి ఖాళీ లేకపోవడం, తలుపులు, గ్రిల్స్‌కు తాళాలు వేసి ఉండటం తదితర పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. మంటలు చుట్టుముడుతుండటం ఇంతియాజ్, చిన్నారులు భయంతో, పొగ నిండిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక వారు పడిన ఇబ్బంది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది అనేక సిటీజనుల హృదయాలను కలచివేసింది. ఈ కాల్లో మాట్లాడింది దుకాణ యజమానే అని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించట్లేదు. ఇదీ జరిగింది... ఈ దుకాణం సెల్లార్లో రెండు చిన్న గదులు ఉన్నాయి. ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న బేబీ, తన కుమారుడు సమీర్‌తో కలిసి మరో గదిలో వాచ్‌మన్ తోకల యాదయ్య, తన భార్య లక్షి్మ, కుమారులు ప్రణీత్, అఖిల్‌లతో కలిసి ఉన్నారు. సుభాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ , శాస్త్రీపురం వాసి హబీబ్ బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పని చేసేవారు. వినియోగదారులకు సంబంధించిన సరుకు డెలివరీ వీరి బాధ్యత. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న ఇంతియాజ్, హబీబ్ అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతో పాటు ప్రణీత్, అఖిల్‌లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగి్వషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. ఈ ఐదుగురూ అక్కడే అసువులు బాశారు.ఇంతియాజ్, స్నేహితుడి మధ్య ఉర్దూలో జరిగిన సంభాషణ తెలుగులో...ఇంతియాజ్: హలో అన్న.. అన్న.. చనిపోతాం అన్న. ఎక్కడా దారి లేదు అన్న. స్నేహితుడు: అరె ఇటు ఎందుకు వచ్చావు? అటు నుంచి వెనుక వైపు నుంచి రా ఇం: ఎక్కడా స్థలం లేదు అన్న. చనిపోతాం అన్న. తలుపు మూసి ఉంది స్నే: ఏ తలుపు మూసి ఉంది? ఇం: వెనుకాల ఉన్న తలుపు మూసి ఉంది స్నే: అదెలా మూసి ఉంది ఇం: నాతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు... ముగ్గురం చనిపోతాం అన్న స్నే: ఇంతియాజ్ ముందు నా మాట విను. ఇటు నుంచి రా బయటకు ఇం: ఎటు నుంచీ అవకాశం లేదు అన్నా అన్నీ మూసి ఉన్నాయి స్నే: అక్కడ గ్రిల్ గేట్ ఉంది కదా... దాని నుంచి బయటకు రా ఇం: అంతా చూశాను ఎక్కడ నుంచీ బయటకు రావడానికి ఆస్కారం లేదు స్నే: గ్రిల్ గేట్... గ్రిల్ గేట్.. సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో ఇం: ఏదీ తెరుచుకోవట్లేదు అన్న స్నే: తెరుచుకోవట్లేదా..? సెకండ్ సెల్లార్లోకి వెళ్లు ఇం: ఇక్కడ ఏం చేయలేను అన్న స్నే: ఏదో ఒకటి చేసి సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇంతియాజ్.. లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇం: లేదు అన్న.. ఏం కనిపించట్లేదు స్నే: అక్కడ ఉన్న వస్తువులు పక్కకు పడేృయ్ (ఈ సమయంలో ఇంతియాజ్, చిన్నారులు ఊపిరి అందక ఆయాస పడటంతోపాటు దగ్గుతున్నట్లు రికార్డు అయింది) ఇం: నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతకీ కనిపించట్లేదు స్నే: అదే చెబుతున్నా... ఇంతియాజ్ సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: వెనుక ఉన్న తలుపు తీయమని చెప్పు అన్న స్నే: ఇంతియాజ్ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. కిందకు వెళ్లే పరిస్థితి లేదు ఇం: అన్న నేనేం చేయలేను.. కనిపించట్లేదు.. సమీర్ని వాళ్ల రూమ్ తలుపు తీయమని చెప్పు (ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన బేబీ కుమారుడే సమీర్) స్నే: మంటలు ఎక్కువగా ఉన్నాయి అక్కడకు వెళ్లడం కుదరదు. సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: ఎక్కడా స్థలం లేదు... నేను బయటకు రాలేను స్నే: పిల్లల్ని తీసుకొని సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో... ఇం: అన్నా... నేను వెళ్లలేను... అంతా చీకటి, ఏం కనిపించట్లేదు స్నే: టార్చ్ వేసుకో... ఏదో ఒకటి వేసుకో... సమీర్ గది తలుపు దగ్గరే మంట అంటుకుంది ఇం: వెళ్లలేం అన్న స్నే: ఎవరెవరు ఉన్నారు కింద ఇం: ముగ్గురం ఉన్నాం స్నే: ఆగు నేను పంపిస్తాను -
Nampally : నన్ను కాపాడండి ప్లీజ్..!
-
నీ తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదనిపిస్తుంది: సజ్జనార్
హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెండు రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి చూపించిన తెగువను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. నేటి సమాజంలో ఈ తరహా మనుషులతో మానవత్వం ఇంకా చనిపోలేదనే విషయం అర్థమవుతుందని సజ్జనార్ కొనియాడారు.. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు సజ్జనార్‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదు.తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కేవలం దినేష్ మాత్రమే కాదు.. ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసింది. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కష్టం వస్తే 'మేమంతా ఒక్కటే' అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారు. వారందరికీ సెల్యూట్!!‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది.ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క… pic.twitter.com/MMNt5HjERv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 26, 2026 -
ఐదుగురూ ఆహుతి!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని సాయి బిశ్వాస్ చాంబర్స్‌లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంమీద బచ్చాస్ ఫర్నిచర్ సంస్థ 18 గంటల పాటు మండింది. సెల్లార్లో మొదలైన మంటలు సాయి బిశ్వాస్ చాంబర్స్ సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతోపాటు నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. దీని గ్రౌండ్ ఫ్లోర్లో బచ్చాస్ దుకాణం ఎంట్రన్స్‌తోపాటు మరో ఫర్నిచర్ దుకాణం ఉంది. బచ్చాస్ ఫర్నిచర్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉండగా... సబ్–సెల్లార్, సెల్లార్లతోపాటు భవనం కుడి వైపు ఉండాల్సిన సెట్ బ్యాక్‌కు రేకులు వేసి గోదాములుగా వాడుతున్నారు. రెండు రోజుల క్రితం చైనా నుంచి భారీగా సరుకు వచ్చింది. వీటిని దుకాణంతోపాటు గోదాముల్లోనూ భద్రపరిచారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బచ్చాస్ దుకాణం సెల్లార్ వెనుక వైపు మంటలు అంటుకున్నాయి. ఇవి గ్రౌండ్‌తోపాటు మొదటి అంతస్తుకు పాకాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులతో పాటు సబ్–సెల్లార్లోకి పొగ విస్తరించింది. సబ్–సెల్లార్లో ఉన్న సరుకు మాత్రం యథాతథంగా ఉంది.కెమికల్స్ కూడా ఉండటంతో... ఈ భవనం సెల్లార్లో బచ్చాస్ ఫర్నిచర్‌కు సంబంధించిన సరుకుతోపాటు పెయింట్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటి వల్లే మంటల ధాటి ఎక్కువై ప్రమాద తీవ్రత పెరిగింది. సెల్లార్లో వెనుక వైపు కుడి పక్కగా రెండు చిన్న గదులు ఉన్నాయి. మెట్లకు సమీపంలో రేకులతో పార్టిషన్ చేసి వీటిని నిర్మించారు. ఈ మెట్లతోపాటు మిగిలిన చోట్ల ఉన్న గ్రిల్స్‌కు యజమానులు తాళాలు వేశారు. చిన్న గదుల్లోని ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న బేబి (46), మరో గదిలో వాచ్‌మన్ తోకల యాదయ్య, తన భార్య లక్ష్మి, కుమారులు ప్రణీత్ (11), అఖిల్ (8) ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదయ్య, లక్ష్మి బయటకు వెళ్లగా... 1.10 గంటలకు సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి అక్కడ ఉన్న సరుకుతోపాటు కెమికల్స్ కారణంగా వేగంగా విస్తరించాయి. కాపాడటానికి వెళ్లి...: సుభాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28), శాస్త్రీపురం వాసి హబీబ్ (35) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అర్టిప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న వీరిద్దరూ మంటల్ని చూసి అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతోపాటు ప్రణీత్, అఖిల్‌లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. దీనికి ఎడమ చివరన ఎంట్రన్స్ ఉండగా, కుడి చివరన వీరు ఉన్న గదులు ఉన్నాయి. అక్కడ వరకు వెళ్లిన ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. బేబీని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిన హబీబ్‌కు బయటపడే మార్గం కనిపించలేదు. మంటల ధాటి పెరిగిపోవడంతో తాను లోపలకు ప్రవేశించిన మార్గం వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం, గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వెళ్లే మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాళం వేసి ఉండటంతో అక్కడే బేబీతో సహా పడిపోయాడు. మంటలతో ఇద్దరు... ఊపిరాడక ముగ్గురు ! కిందపడినపోయిన హబీబ్, బేబీ మంటలు అంటుకొని చనిపోయారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ఇంతియాజ్ వారు ఉన్న గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం పొగ నిండిపోవడం, అది ప్లాస్టిక్, ఫైబర్‌తో పాటు కెమికల్స్ వల్ల వచి్చంది కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ గదిలోనే ఊపిరి ఆడక ఇందియాజ్ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయి ఉండారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయినా పొగ తగ్గకపోవడం, సెల్లార్, సబ్–సెల్లార్ సామాన్లతో నిండిపోవడంతో లోపలకు ప్రవేశించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమించాల్సి వచి్చంది. మొత్తమ్మీద ఆదివారం ఉదయం 9.10 గంటలకు సెల్లార్లోకి ప్రవేశించిన బృందాలు 9.15 గంటలకు హబీబ్, బేబీల మృతదేహాలు గుర్తించారు. 9.45 గంటల సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. బేబీ కుమారులు లాల్‌ఖాన్, సమీర్ ఖాన్లు బచ్చాస్లోనే పని చేస్తున్నారు. వీరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. చిన్నారులతోపాటు ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వీరంతా ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు తెలుస్తాయి. బిశ్వాస్ చాంబర్స్‌ను జేఎనీ్టయూకు చెందిన నిపుణుల బృందం ఆదివారం ఉదయం పరిశీలించింది. ప్రొఫెసర్ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని టీమ్ వివిధ కోణాల్లో పరిశీలించింది. వీరు అందించే నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లేనని అనుమానిస్తున్నాందుకాణ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దుకాణ యజమాని సతీశ్ బచ్చాను అరెస్టు చేశాం. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్‌నకు మరమ్మతు జరిగింది , అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చు.సెల్లార్లో ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. – అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి పొంగులేటిబచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి కార్యాలయ వ ర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతి విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాపు యజమాని అరెస్ట్
సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో నిన్న అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు( ఆదివారం) ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచానిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.కాగా నిన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అఖిల్ (7), ప్రణిత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) చనిపోయినట్లు ఫైర్ డిజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బాధితులు బయిటకి రావడం కష్టమైందని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. -
నాంపల్లి: అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం
సాక్షి హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
ఐదుగురూ చనిపోయారు.. ఆ తప్పే ప్రమాదానికి కారణం
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
నాంపల్లి ప్రమాదంలో దొరకని ఐదుగురి ఆచూకీ.. ఎందుకింత ఆలస్యం?
-
మన వాళ్ళని విదేశాలకు పంపండి.. నాంపల్లి ప్రమాదంపై రాజాసింగ్
-
రెస్క్యూ ఆపరేషన్.. ఐదుగురు మృతులు వీరే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. తాజాగా ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అగ్నిప్రమాదంలో 90 శాతం వరకూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తియ్యిందని తెలుస్తోంది. 200 మంది సిబ్బంది 22 గంటలకుపైగా ఈ రెస్క్యూ ఆపరేషన్లోపాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం చేసుకుంది.అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నించారు.. ఇందుకోసం వారు ఆక్సిజన్ సిలిండర్‌తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా వెళ్లారు.తొలుత ఒక ఒక డెడ్ బాడీ లభ్యమయ్యింది. అది గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డిఎన్ఎ టెస్ట్‌కు అధికారులు తరలించారు. మరో డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపై మరో మూడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారు ఫైర్ డీజీప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇది జరిగిందన్నారు. -
నిప్పు.. ఎప్పుడు కనువిప్పు?
సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/అబిడ్స్: గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగి్నకి ఆహుతి చేస్తోంది. నిబంధనలను మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులిచ్చేస్తోంది. ఫలితంగా అభమూ శుభమూ తెలియని అభాగ్యులు కాలిబూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరామామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్బ్యాక్లు అధికారులకు గుర్తుకొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫరి్నచర్ దుకాణాలు, గోడౌన్లు, స్క్రాప్ నిల్వల భవనాలు మంటల్లో మాడిమసి అవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నివాస భవనాల్లో గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగి్నకీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో ఐదుగురు చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. వాణిజ్య భవనాల్లో.. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత నాలుగేళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగిప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూమ్‌లు, పబ్‌లు ఇలా.. అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికీ నిబంధనల కనుగుణంగా సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లుండవు. కాగా వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. 835 ప్రమాదాలు.. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగి్నప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తినష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్‌లో శాలిబండ ఎల్రక్టానిక్స్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. డిసెంబర్లో కాచిగూడ సుందర్‌నగర్‌లో జరిగిన అగి్నప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు రూ.32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. గుండెల్ని పిండేసే దుర్ఘటనలెన్నో.. నిరుడు గుల్జార్‌హౌస్ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. గత ఏడాది టాటానగర్ ప్లాస్టిక్గోడౌన్లో, కూకట్పల్లి గ్యాస్ దుకాణం తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు. మూడేళ్ల క్రితం బజార్‌ఘాట్‌లో నివాస భవనంలోని కెమికల్ గోడౌన్లో సంభవించిన అగి్నప్రమాదంలో 9 మంది అసువులు బాశారు. నాలుగేళ్ల క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. గత సంవత్సరం అఫ్జల్‌గంజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అగ్నికీలల్లో ఐదుగురు
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు.వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందీ ప్రచార సభ పక్కన ఉన్న ఐదంతస్తుల సాయి విశ్వాస్ చాంబర్లో బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ పేరుతో వివిధ రకాల ఫర్నిచర్ వ్యాపారాలను సతీశ్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అకస్మాత్తుగా ఈ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. దీనిపై వెంటనే యజమాని సతీశ్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భవనంలో మంటలు, దట్టమైన పొగలు వస్తున్నాయని పోలీసులకు తెలపడంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని ముందుగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. నాంపల్లి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని రహదారులను మూసివేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పించారు. అగ్నికీలలు, దట్టమైన పొగ క్షణ క్షణానికి పెరుగుతుండడంతో రాత్రి వరకు అందులో ఉన్న వారిని బయటకు తీసుకురాలేక పోయారు. కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు ఫర్నిచర్ దుకాణం భవనంలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. సెల్లార్ వాచ్మెన్ యాదయ్య, లక్ష్మి దంపతుల పిల్లలు ప్రణీత్, అఖిల్‌తో పాటు ఆటో డ్రైవర్ హబీబ్, ఇంతియాజ్, స్వీపర్ బీబీలు చిక్కుకున్నవారిలో ఉన్నారు. అయితే అఖిల్ (7), ప్రణీత్ (11)గన్¸ûండ్రీలోని ప్రభుత్వ ఆలియా పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లకపోవడంతో ఇద్దరు పిల్లలను సెల్లార్‌లోని ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు ఇద్దరు బయట ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ ఇద్దరు పిల్లలను తీసుకువచ్చేందుకు ఫర్నిచర్ షాపులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు సెల్లార్లోకి వెళ్లారు. ఈ ఇద్దరితోపాటు అందులో పని చేసే మరో ఇద్దరు సెల్లార్లో చిక్కుకున్నట్లు తోటి వర్కర్లు వెల్లడించారు. వీరిలో ఒకరు తప్పించుకొని బయటపడ్డాడు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఫైర్ పోలీసు, ఇతర శాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెల్లార్లో ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు, దట్టమైన పొగలు ఆర్పడంతో సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయింది. ఐదుగురు వ్యక్తులను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోబోను పంపించినా... అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులతో పాటు హైడ్రా, డిజాస్టర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టాస్‌్కఫోర్స్ పోలీసులతో పాటు పలువురు అధికారులు అర్థరాత్రి వరకు శ్రమించారు. మంటలు అదుపులోకి వచి్చన్నప్పటికీ పొగ తీవ్రత ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లో ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్ ముడిపదార్థాలు ఉండడంతో ఆరు గంటలైనా భవనం నుంచి దట్టమైన పొగ తగ్గలేదు. ఫైర్ ఉన్నతాధికారులు రోబోను కూడా భవనంలోకి మంటలను, పొగలను నివారించేందుకు పంపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి వరకు దట్టమైన పొగలు అదుపులోకి రాలేదు.రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రామ్‌టో ఫైర్ మిషన్‌తో.. ఫైర్ అధికారులు బ్రామ్‌టో ఫైర్ మిషన్‌తో మంటలను, దట్టమైన పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయతి్నంచారు. అతి పెద్దదైన బ్రామ్‌టో మిషన్‌లో ఫైర్ సిబ్బంది ఉండి భవనం పరిసరాల 4, 5 వ అంతస్థుల అద్దాలను పగలగొట్టి మంటలను, పొగలను అదపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. నిమిషంలో తప్పించుకొని.. నాంపల్లి అగ్నిప్రమాదం నుంచి నిమిషం వ్యవధిలో తప్పించుకున్నాడు సంతోష్ అనే వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సంతోష్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఉన్నాడు. సెల్లార్లో మంటలు చెలరేగిన నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం వ్యాపించాయి. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన సంతోష్ నిమిషాలలో మెట్లపై నుంచి వేగంగా బయటికి వచ్చేశాడు. క్షణం ఆలస్యమైనా మంటల్లో చిక్కుకునేవాడనని సంతోష్ పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తెచ్చాం : రాష్ట్ర ఫైర్ విభాగం డీజీ విక్రమ్‌సింగ్ మాన్ ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురు చిక్కుకున్నారని తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. ఫైర్, ఇతర అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం కింద రెండు సెల్లార్లు ఉన్నాయన్నారు. మొదటి సెల్లార్లో ఫర్నిచర్‌కు సంబంధించిన మెటీరియల్స్, ఇతర ముడి పదార్థాలు ఉండడంతోనే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మంటలను అదుపులోకి తెచ్చామని, సెల్లార్లలో దట్టమైన పొగలు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకువచ్చి ఇందులో చిక్కుకున్న ఐదుగురిని బయటకు తెస్తామన్నారు. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు. సజ్జనర్, కలెక్టర్ హరిచందన సందర్శన సంఘటన స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సజ్జనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారన్నారు. అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తెచ్చేందుకు ఫైర్‌తో పాటు ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రోబో యంత్రాన్ని తొలిసారిగా వాడిన అగ్నిమాపక శాఖ నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్ని ప్రమాద సంఘటనలో పేలుళ్లను నిరోధించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక శాఖ రోబో ఫైర్ మిషన్‌ను హైదరాబాద్‌లో తొలిసారిగా ఉపయోగించింది. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ రోబో శకటాన్ని రంగంలోకి దింపింది. రోబో ఫైర్ మిషన్ అనేది అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు, అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి తయారు చేసిన సిస్టమ్. అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని పరిస్థితుల్లో ఈ రోబో ఫైర్ మిషన్ భవనం లోపలికి వెళ్లి మంటలను ఆర్పుతుంది. అలాగే సురక్షిత మార్గాన్ని అన్వేíÙంచి, బయట ఉన్న సిబ్బందికి మార్గాన్ని సూచిస్తుంది. -
నాంపల్లి ప్రమాదానికి కారణం అదే
-
Nampally: ఘోర అగ్నిప్రమాదం..రంగంలోకి దిగిన రోబో
-
భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)
-
Hyd: భారీ అగ్ని ప్రమాదం తగలబడుతున్న భవనం మంటల్లో చిక్కుకున్న పిల్లలు
-
Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్‌లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు. ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూనాంపల్లిలో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
-
నాంపల్లి స్టేషన్ పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత ప్రణాళిక సిద్ధం
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకు భద్రతను కల్పించే క్రమంలో సురక్షితమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడానికి , హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌లోని బేగంపేట వైపు ఉన్న పాత పాదచారుల వంతెనను కూల్చివేయాలని ప్రణాళిక సిద్దం చేసింది.ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి రెడ్ హిల్స్ ప్రాంతాన్ని పబ్లిక్ గార్డెన్తో కలుపుతుంది మరియు స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దేనికీ అనుసంధానించబడలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఐదు దశాబ్దాలకు పూర్వం జరిగినది, ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన స్టేషన్ లోనున్న రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండడంవలన , రైల్వే కార్యకలాపాలకు మరియు ప్రజలకు ప్రాణ ప్రమాదాన్నికలిగించే అవకాశముంది.ఊహించని ప్రమాదాన్ని నివారించడానికి, మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 20-12-2025 మరియు 23-12-2025 మధ్య తొలగిస్తారు. ఈ కాలంలో, అవసరమైన భద్రతా ఏర్పాట్లు అమలులో ఉంటాయి మరియు అవసరమైన విధంగా రైలు కార్యకలాపాలు నియంత్రించబడతాయి.కూల్చివేత పనులు కఠినమైన భద్రతా జాగ్రత్తలతో మరియు సంబంధిత రైల్వే విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయి. ఈ సంధర్భంగా రైల్వేలు ప్రజల సహకారం కోరుతూ తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తుంది. -
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీసు కస్టడీ
సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని పోలీసులు కోరగా కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే చేశారు.అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
జై జగన్ అంటూ..జగన్ కాన్వాయి వెంట..!
-
Advocate: ఇక కోర్టుకు రావాల్సిన పనిలేదు
-
నాది తెలంగాణ .. జగన్ కారణజన్ముడు క్రేజ్ కి బిత్తరపోయిన పెద్దాయన
-
నాంపల్లి కోర్టు వద్ద 3 కి.మీ ట్రాఫిక్ జామ్
-
కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్ కు YS జగన్
-
Watch Live: CBI కోర్టుకు YS జగన్
-
హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్‌పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.అసలు ఈ కేసు వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. -
భాగ్యనగరంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
శరన్నవరాత్రుల సందర్భంగా పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సోమవారం(సెప్టెంబర్ 29, 2025) నుంచి మూడు రోజుల పాటు నవరాత్రి హోమాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు స్వామి సూర్యపాద, స్వామి శ్రద్ధానందల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 28వ తేదీ ఆదివారం ఉదయం గం. 8.30 ల నుంచి శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, వాస్తుహోమం అనంతరం ప్రసాద వితరణ తదితరాలను ఘనంగా జరిగాయి. కాగా, ఈ రోజు సాయంత్రం 5గం.ల నుంచి స్వామి సూర్యపాద గారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయి. అలాగే ఈ వేడుకులో పాల్గొనదలిచని భక్తులందరికీ ఉచితప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. (చదవండి: చిత్తూ చిత్తుల బొమ్మ..శివుని ముద్దుల గుమ్మ) -
వానొస్తే ప్రాణాలు గల్లంతే!
హైదరాబాద్: నగరంలో వానొస్తే ప్రాణాలు గల్లంతే అనే దుస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం గంటసేపు వర్షం దంచికొట్టడంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్‌తో పాటు తట్టి అన్నారంలో 12.8 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంలో నాంపల్లి పరిధి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌లో ఇద్దరు, ముషీరాబాద్‌లో మరొకరు కొట్టుకుపోయారు. కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. Heavy Rains In Hyderabad Three People Missing After Falling Into A DrainageHeavy Rains In Hyderabad Three People Missing After Falling Into A Drainage -
తాళం వేసిన ఇంట్లో అస్థిపంజరం
నాంపల్లి: తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం లభ్యమైన సంఘటన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చాంశనీయంగా మారింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా బాల్ తాళం వేసి ఉన్న ఇంట్లో పడింది. దీంతో ఓ యువకుడు బాల్ తీసుకువచ్చేందుకు ఇంటి వెనుకవైపు ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన అతడికి రిఫ్రిజిరేటర్ ఎదుట అస్థి పంజరం కనిపించిది. అస్థి పంజరం చుట్టూ ఉన్న వస్తువులకు బూజు పట్టి ఉన్నాయి.ఈ దృశ్యాన్ని అతను సెల్ఫోన్లో రికార్డు చేయడమేగాక సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. దీనిపై సమాచారం అందడంతో ఆసిఫ్‌నగర్ ఏసీపీ బి.కిరణ్‌కుమార్, హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ టి.పురుషోత్తమ్ రావు తదితరులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. అస్థిపంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొన్నేళ్ల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చున భాస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సదరు ఇంటికి సంబంధించిన వ్యక్తులను ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్‌కు రప్పించే ప్రయత్నంలో చేశారు. కుటుంబ సభ్యుల లెక్క తేలితేనే.. సదరు ఇంట్లో మునీర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. ఆయనకు పది మంది సంతానం. వీరిలో ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెలు. కరోనా కంటే ముందు అందరూ కలిసే ఉన్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడంతో వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముర్గీ మార్కెట్లోని సదరు ఇంట్లో పెళ్లికాని సోదరుడు అమీర్ ఉన్నట్లుగా పోలీసులు చెబున్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మాటలు లేకపోవడంతో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని నెలకొంది. ఆ తర్వాత ఏవరూ నాంపల్లికి వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కేసును చేధించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులందరినీ స్టేషన్‌కు రప్పించే ప్రయత్నం చేయగా కేవలం ఇద్దరు మాత్రమే పీఎస్‌కు వచ్చారు. మిగతా వారందరూ పోలీసులకు సహకరించడం లేదని తెలిసింది. మరికొరందరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రావడం లేదు. దీంతో అస్థి పంజరం ఎవరనేది తేల్చడం పోలీసులకు కష్టంగా మారింది. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటాడని స్థానికులు చెబుతుండగా..పాత బస్తీలోనే ఉన్నారంటూ బంధువులు, పోలీసులు చెబుతున్నారు. పెళ్లి, ఆస్తి కోసం గొడవ పడిన అమీర్ ఖాన్‌ను ఎవరైనా హత్య చేసి తాళం వేశారా? లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మునీర్ కుటుంబ సభ్యులందరూ ఒకే చోటకు వస్తే కానీ ఈ కేసు చిక్కు ముడి వీడేలా లేదు. -
లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు
నాంపల్లి: ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోయి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన ఘటన నాంపల్లి పరిధిలోని మాసబ్‌ట్యాంక్ శాంతినగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కుమారుడు అరుణవ్ (6) ఉన్నాడు. శాంతినగర్ కాలనీ మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తన అత్తమ్మ ఆయేషా ఇంటికి తాతయ్యతో కలిసి అరుణవ్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వచ్చాడు. అపార్ట్మెంట్ మూడో అంతస్తుకు వెళ్లేందుకు తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట అరుణవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు. అంతలోనే అరుణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ అరుణవ్ లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అరుణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు. గ్యాస్ కట్టర్లతో తొలగించి.. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు గ్యాస్ కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పరికరాలతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేశారు. రెండు గంటల పాటు శ్రమించి స్లాబ్ గోడను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ యజ్ఞనారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.దత్తు తమ బృందాలతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. బాలుడిని ప్రాణాలతో బయటికి తీసి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో బాలుడు.. నిలోఫర్ ఆస్పత్రి ఐసీయూలో అరుణవ్‌ను వెంటిలేటర్ మీద ఉంచి ఆక్సిజన్, ప్లూయిడ్, గ్లూకోజ్‌ను అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ తెలిపారు. బాధిత బాలుడిని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరామర్శించారు. లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
HYD: లిఫ్టు ప్రమాదం విషాదాంతం.. బాలుడు అర్ణవ్ మృతి
సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రమాదం ఇలా జరిగింది..నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.అంతలోనే అర్ణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు.రెండు గంటల పోరాటం..మొదట గ్యాస్కటర్తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని.. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వీడియో విడదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్, నల్గొండలో కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాపత్రినిధుల కోర్టుకు రేవంత్‌రెడ్డి వెళ్లారు. తదుపరి విచారణను కోర్టు.. ఈ నెల 23కి వాయిదా వేసింది. -
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
చర్లపల్లి తరహాలో మరిన్ని స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్‌కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్‌ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.పెద్ద స్టేషన్లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్‌ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.14 స్టేషన్లకు ఆధునిక హంగులుఅమృత్భారత్లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్‌కు చెందినవే కావటం విశేషం. అమృత్‌భారత్‌లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్‌పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే.. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్‌పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్‌నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
Nampally: పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
-
నాంపల్లిలో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి.. జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అనంతరం, మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.వివరాల ప్రకారం..నాంపల్లిలోని రెడ్‌హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద గురువారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడపడంలో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం, మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
HYD: ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్‌ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్‌లో రుచిచూశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz— KTR (@KTRBRS) October 24, 2024Iske peene se tabiyat mei ravani aaeBRS Leader KTR Enjoys Irani Chai aT Nampally Restaurant pic.twitter.com/jVfS6Hq3mH— Shakeel Yasar Ullah (@yasarullah) October 23, 2024 -
కేటీఆర్ 30 నిమిషాల స్టేట్ మెంట్.. కొండా సురేఖకు చురకలు..
-
నాంపల్లి కోర్టులో.. పరువు - ప్రతిష్ఠ
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్.. విచారణ 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్‌తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ ప్రారంభం
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. -
కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
'హైదరాబాద్ కోహినూర్': ఆమెలా మరెవ్వరూ చనిపోకూడదని..!
కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు పట్టుకుపోయారని కథకథలుగా విన్నాం. కానీ మన హైదరాబాద్ కోహినూర్‌గా పిలిచుకునే మన నిజాం మహారాణి గురించి వినిలేదు కదా..!. ఆ రోజుల్లోనే ష్యాషన్‌కి ఐకాన్‌గా ఉండేది. ఆమె అందానికి తగ్గట్టు గొప్ప గొప్పదాతృత్వ సేవలకు కూడా పేరుగాంచింది. మన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నిర్మించడానికి కారణమే ఆమె. ఎవరీమె..? ఎలా మన హైదబాద్ నిజాం కుటుంబానికి కోడలయ్యింది తదితరాలు గురించి చూద్దాం.!మార్చి 3, 1924న టర్కీ పార్లమెంట్ ఖలిఫాను రద్దు చేసింది. ఖలీఫా అంటే వారసత్వం. దీని కారణంగా 101వ ఖలీఫా అబ్దుల్మెసిడి II కుటుంబం సామ్రాజ్యం నుంచి బహిష్కిరించబడింది. దీంతో వారిలో చాలామంది ఫ్రెంచ్ నగరాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన నీలూఫర్ హన్‌సుల్తాన్ కూడా ఒకరు. ఆమె తండ్రి మరణంతో తల్లి అడిలే సుల్తాన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో ఉండేవారు. అయితే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నకుమారుడు మోజమ్ తన అన్నయ్యతో కలిసి ఫ్రాన్స్‌కి వచ్చాడు. మోజమ్ అన్నయ ఆజం జా నీలూఫర్ బంధువైన డుర్రూషెహ్వార్ సుల్తాన్‌ను వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇక అతడి తమ్ముడు మోజామ్ ఒట్టోమన్ యువరాణి మహ్పేకర్ హన్‌సుల్తాన్‌తో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే మోజామ్ నిలూఫర్‌ని చూసి ఆమె అందానికి మంత్రముగ్దుడై వెంటనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ నీలోఫర్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆమెను వివాహం అనంతరం నీలూఫర్ ఖానుమ్ సుల్తాన్ బేగం సాహిబా అని పిలిచేవారు. అలా నీలోఫర్ నిజాంకి చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు అయ్యింది. ఆమె నిజాం కోటలో ఆధునికత యుగానికి నాంది పలికింది. నిజాంను పాపా అని సంభోదించగలిగేది కూడా నీలూఫర్‌నే. అతడి కుమార్తెలు సైతం అతడిని సర్కార్ అని పిలిచేవారు. ఇక నీలోఫర్ తన బంధువు డుర్రోషెహ్వార్‌తో కలిసి మహిళల విముక్తి కోసం పనిచేసింది. మహిళలను ముసుగులు తొలిగించి స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించేవారు. ఇక నీలూఫర్ అందచందాలకు భర్త దాసోహం అన్నట్లుగా ఉండేవాడు. అందులోనూ ఆమె ఫ్యాషన్ శైలి ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ధరించే చీరలు, ఆభరణలు నిజాం పాలనలో మంచి ట్రెండ్ సెట్ చేసేవి. అప్పట్లోనే ఆమె చీరలను ముంబైకి చెందిన డిజైనర్ మాధవదాస్ డిజైన్ చేసేవారు. ఆమె ఒట్టోమన్ మూలాలు నిజామీ సంస్కృతితో అందంగా కలిసిపోయాయి. అంతేగాదు ఆమె చీరలు ఎంతో ప్రజాధరణ పొందేవి. అవి ఇప్పటికీ న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీలో ప్రదర్శనగా ఉన్నాయి. అంతేగాదు ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచింది. పైగా ఆమెను ముద్దుగా 'హైదరాబాద్ కోహినూర్' అని పిలుచుకునేవారు కూడా. ఇక ఆమె బంధువు డుర్రూషెహ్వార్ ఒక కొడుకుకి జన్మనివ్వగా, నీలూఫర్ గర్భం దాల్చలేకపోయింది. అందుకోసం యూరప్‌లోని నిపుణులెందరినో కలిసింది. ఆ టైంలో వైద్య సదుపాయాలు బాగా కొరతగా ఉండేవి. దీని కారణంగానే ఆమె పనిమనిషి ప్రసవ సమయంలో మరణించింది. ఇది ఆమెను బాగా కుంగదీయడమే గాక మహిళల కోసం ఆస్పత్రిని నిర్మించేందుకు దారితీసింది. తన పనిమినిషిలా ఎంతమంది రఫాత్‌లు మరణిస్తారంటూ ప్రసూతి ఆస్పత్రిని నిర్మించింది. అదే నేడు నాంపల్లిలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి చరిత్ర గురించి నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నజాఫ్ అలీఖాన్ చెబుతుంటారు.కాగా, నీలూఫర్ గర్భందాల్చకపోవడంతో ఆమె భర్త రెండోవ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె తన తల్లితో జీవించడానికి తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె సామాజికి సేవలో ఎక్కువ సమయం గడుపుతుండేది. అలా 1963లో పారిస్‌లోని దౌత్యవేత్త, వ్యాపారవేత్త ఎడ్వర్డ్ జూలియాస్ పోప్‌ను వివాహం చేసుకుంది. ఇక శేషజీవితాన్ని పారిస్‌లోనే గడుపుతూ.. 1989లో మరణించింది. (చదవండి: దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!) -
ఇద్దరు అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ
-
హైదరాబాద్ నాంపల్లి పోలీసుల కాల్పుల కలకలం
-
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటనలు మరువకముందే నగరంలో మరో చోట పోలీసు కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు.దీంతో తప్పించుకునే యత్నంలో పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా, మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గత నెలలో సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.మరో ఘటనలో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్‌పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు)
-
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
ఉత్తర ద్వారం తెరిచిన ‘బీజేపీ’.. మార్పు కలిసొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా, అదే రోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసి గతంలో ఉపయోగించిన ఉత్తరం వైపు తలుపును తెరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తే పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు రావొచ్చునని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వాస్తు మార్పు చేసి, ఉత్తరం వైపు ద్వారాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాక తూర్పువైపు ప్రధాన ద్వారాన్నే చాలా కాలం ఉపయోగించారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని వాస్తుపరమైన మార్పులు చేశారు. ఇందులో భాగంగా తూర్పువైపు ద్వారం మూసేసి, ఉత్తరం వైపు తలుపులు తెరిచి రాకపోకలకు ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే సందర్భంగా వాస్తుపరంగా ఉత్తర ద్వారాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం. పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ సరళిని బట్టి చూస్తే సానుకూల పరిణామాలే కనిపించాయని, గతం కంటే ఎక్కువ ఓటింగ్శాతమే నమోదు అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మరి నిజంగానే ప్రధాన ద్వారం మార్పు అనేది పార్టీ అధిక సీట్లను గెలిపిస్తుందా అనేది తేలాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే మరి. -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాదం కేసులో దర్యప్తు ముమ్మరం
-
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం
-
Nampally Fire Accident : హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన చేసింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేదని పేర్కొన్న ఫైర్‌శాఖ.. కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ‘‘అగ్నిప్రమాదం నవంబర్ 13 సోమవారం ఉదయం 9గం.30 నిమిషాలకు జరిగింది. ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాదం నుంచి 21 మందిని రక్షించగలిగాం. అక్రమంగా సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం అని అగ్నిమాపక శాఖ ప్రకటించింది. #WATCH | Daring rescue of a child and woman amid massive fire in a storage godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad pic.twitter.com/Z2F1JAL8wa — ANI (@ANI) November 13, 2023 స్థానికుల మౌనం సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు తేలింది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్మెంట్ సెల్లార్లో వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. అయితే ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారులకు తెలిసింది. దీంతో స్థానికుల్ని ప్రశ్నించారు వాళ్లు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్మెంట్ వాసులను అడిగారు అగ్నిమాపక శాఖ అధికారులు. అయితే స్థానికులు ఆ ప్రశ్నకు మౌనం వహించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్ఎంసీ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాంపల్లిలో ఘోరం.. ఆ ఒక్క తప్పుతో బూడిదైన బతుకులు
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి.. నాంపల్లి ప్రమాద బాధితుల హెల్త్ కండిషన్
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదంపై కేటీఆర్, తలసాని
-
అగ్నిప్రమాద స్పాట్లో కేటీఆర్, వీహెచ్..
-
అగ్నిప్రమాదంపై ఫిరోజ్ ఖాన్ మాటల్లో..!
-
8 మంది సజీవదహనం, మరో 8 మంది పరిస్థితి విషమం
-
డీజిల్ డ్రమ్స్ పేలడంతో వ్యాపించిన మంటలు
-
చనిపోయిన వారిలో చిన్నారి ఉన్నట్టు గుర్తింపు
-
నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. సర్కార్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బజార్‌ఘాట్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు. కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం
-
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు
Updates.. ఘటనపై పోలీస్ కేసు నమోదు బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది. క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286(పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం.. అలాగే.. ఇండియన్ ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. వరుస ప్రమాదాలు.. అయినా నిర్లక్ష్యమే!: అజారుద్దీన్ వరుస ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వీడడం లేదని కాంగ్రెస్ నేత అజారుద్దీన్ అన్నారు. నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నివాస ప్రాంతాల్లో గోదాములు ఉన్నాయని తెలిసినా చర్యలు తీసుకో లేదు. డెక్కన్‌మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదాల తర్వాత కూడా అలర్ట్ కాలేదు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగానే జీహెచ్ఎంసీ వ్యవహరిస్తోంది అని మండిపడ్డారాయన. రూ.5 లక్షలా?.. ఏమైనా భిక్షం వేస్తున్నారా?: సీపీఐ నారాయణ నాంపల్లి ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీపీఐ నారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ కేవలం ఐదు లలక్షల మాత్రమే ప్రకటించారు. బాధితులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా?’’ అని నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమూ ఇప్పించాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ‘రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ డబ్బాల ఉంచితే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి?.. కాబట్టి నాంపల్లి ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారాయన. నాంపల్లి ఘటన.. జనసేన చీఫ్ పవన్ స్పందన నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కెమికల్స్ వల్లే ప్రమాదం జరిగిందని తెలిసిందని, నివాస ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ అధికారుల్ని కోరారాయన. నాంపల్లి అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/lb8SkVP5ix — JanaSena Party (@JanaSenaParty) November 13, 2023 ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఐ తమ్మినేని నాంపల్లి కెమికల్ గోడౌన్ అగ్ని ప్రమాదంపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పేరు మీద ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ‘‘తొమ్మిది మంది కార్మికుల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మృతి చెందినవారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రు.20 లక్షలు అందించాలని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ..హైదరాబాదులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కెమికల్ గోడౌన్లను ఉంచకుండా శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది’’. అగ్ని ప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం బాధాకరం. ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి. ►అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి ►మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ►అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి ►ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన ఫిరోజ్ ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాను. ►మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి ►నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. ►అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కేటీఆర్ ఆదేశం. ►షార్ట్ సర్య్కూట్ లేదా టపాసుల వల్ల మంటలు వ్యాప్తించాయి. ►ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా. ►బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. ►అపార్ట్మెంట్లో కెమికల్స్ వాడటం ప్రమాదకరం. ►కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. ►రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. ►అగ్ని ప్రమాదంలో తన వారిని కోల్పోయి కన్నీరు పెట్టుకున్న బాధితుడు. నాంపల్లిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్ ►ఘటనా స్థలంలో ఫిరోజ్ ఖాన్‌ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు ►వీరి మధ్య వాగ్వాదం ►పోలీసులు వారించినా పట్టించుకోని నేతలు ►పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫిరోజ్ ఖాన్ ►నాంపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ►ఈ క్రమంలో ఆయనను స్థానిక నేతలు అడ్డుకున్నారు. ►దీంతో, ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎంఐఎం నేతలపై ఫిరోజ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ►మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ►తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ►తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ► నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి యాజమాని రమేష్ జైశ్వాల్‌గా గుర్తించారు. రమేష్ జైశ్వాల్‌కు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు గుర్తింపు. రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు. 30 కెమికల్ డబ్బాలు గుర్తింపు, కాలిపోకుండా ఉన్నవి మరో 100 డబ్బాలను గుర్తించారు. నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ►అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ►హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ►అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. ►అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. ►రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ►ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ►ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. ►వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. అగ్ని ప్రమాద స్థలికి కిషన్ రెడ్డి.. ►ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే.. తూభ(5) తరూభ(12) మహ్మాద్ ఆజమ్ (54), రెహమాన్, రెహానా సుల్తానా(50) డాక్టర్ తహుర ఫర్హీన్(38), ఫైజా సమీన్(25) సెలవుల కారణంగా పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన డాక్టర్ ఫరీన్. మూడవ అంతస్తులో : (1) జకీర్ హుస్సేన్ (2) నిక్కత్ సుల్తానా ►హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ►వివరాల ప్రకారం.. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. ►ఇక, అపార్ట్మెంట్లో కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్య్కూ సిబ్బంది ఇప్పటికి 21 మందిని కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ►ఈ ప్రమాద ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి మంటలు వ్యాపించాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ సెల్లార్లో మెకానిక్ షెడ్ ఉంది. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్ డ్రమ్స్ పేలడంతో మంటలు వ్యాపించాయి. -
ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. నాంపల్లి ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నాంపల్లిలో 45 వేలకు పైగా బోగస్ ఓట్లున్నాయని.. మరణించిన, ఇళ్లు మారిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్ ఖాన్ కోరారు. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ధర్మాసనం.. అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ ఖాన్‌కు సూచించింది. చదవండి: TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్ -
తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది: సీఎం కేసీఆర్
Updates.. ► నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగుతున్న జాతీయ సమైక్యతా వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పోరాడిన వీరులందరికీ నా వందనాలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉంది. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. గాంధీ, నెహ్రు, పటేల్ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైంది. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. ► తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చగా మారింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశాం. తెలంగాణ సాగునీటి చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయనం. 6 జిల్లాల్లో 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెక్ డ్యామ్‌ల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్‌కు త్వరలోనే సాగునీరు అందిస్తాం. కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తాం. ► వైద్యవిద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించాం. ప్రతీ ఏటా 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 44లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. పెన్షన్ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించాం. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం. ప్రపంంలోనే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి.దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ► తెలంగాణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్. ► పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ ► గన్ పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు. ► పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ► సచివాలంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు వేడుకలు. ► జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎస్ శాంతి కుమారి ► నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం. అధికార బీఆర్ఎస్ పార్టీ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. -
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేపప్రసాదం పంపిణీ
-
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్‌ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్‌ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్‌లో త్వరలో స్లీపర్ బెర్తులు -
HYD: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన. అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది. -
నందకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
-
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
Hyderabad: కలెక్టరేట్‌కు వీడని గ్రహణం.. శిథిలావస్ధలో పాత భవనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కలెక్టరేట్‌కు గ్రహణం వీడటంలేదు. కొత్త భవన నిర్మాణానికే కాదు.. కనీసం తరలింపునకు కూడా అడ్డగింపులు తప్పడం లేదు. తాజాగా కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం పూర్తయ్యింది. కొత్త భవన సముదాయంలోకి మారనుంది. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉన్న లక్డీకాపూల్‌లోని కాంప్లెక్స్‌లోకి హైదరాబాద్ కలెక్టరేట్ తరలించాలనే పాత ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అన్ని విభాగాల హెచ్ఓడీ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టరేట్ పక్కనే ఉన్న భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోకి కలెక్టరేట్‌ను షిఫ్ట్ చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. తరలించాలని ఉన్నా.. హైదరాబాద్ కలెక్టరేట్‌ను లక్డీకాపూల్‌కు తరలించాలనే ప్రతిపాదన 2016లోనే వచ్చింది. కొంగరకలాన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తరలింపుతో ఖాళీ అయ్యే భవనాన్ని హైదరాబాద్ కలెక్టరేట్‌కు ఉయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త కాంప్లెక్స్‌లోకి షిఫ్ట్ అయ్యేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. లక్డీకాపూల్ మార్గం నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండడం.. ధర్నాలు, ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడికి హైదరాబాద్ కలెక్టరేట్‌ను తరలించేందుకు పోలీసుశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. పదహారేళ్ల క్రితం.. పదహారేళ్ల క్రితం నగరంలోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించారు. నాంపల్లి– అబిడ్స్ రోడ్డులోని కలెక్టరేట్లో పాత భవన సముదాయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో నిర్మించిన నాలుగు అంతస్తులతో ఒకే ఒక కొత్త భవనంలో కలెక్టరేట్ విభాగాలు కొనసాగుతున్నాయి. వివిథ శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగా ఉండటం.. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో ఇతర ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని అప్పట్లో భావించారు. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? కొత్త కాంప్లెక్స్ కోసం ఏప్రిల్ 2007 లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. సుమారు 10 అంతస్తులతో కాంప్లెక్స్‌కు ఆర్అండ్బీ శాఖ, ప్రైవేట్ కన్సల్టెంట్‌తో కలిసి డిజైన్లు సిద్ధం చేసింది. కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. అంతలోనే 2008 మార్చిలో బడ్జెట్ గడువు ముగియడంతో ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ మరో ఆర్కిటెక్ట్ ద్వారా ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 1.80.000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో సవరించి డిజైన్ చేశారు. సవరించిన ప్రణాళికలు, అంచనాలను తిరిగి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ భూవేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్‌కు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించడంతో నిర్మాణం పెండింగ్‌లో పడింది. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలింపు
-
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలు ఇవిగో..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి, తదితర రూట్లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. పలు రైళ్లు రద్దు.. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా) -
తెలుగు వర్సిటీలో 20 కొత్త కోర్సులు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాలను అందజేసింది. గురువారం తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధాన సభలో పది మంది ఉత్తమ గ్రంథ రచయితలకు రూ.20,116 నగదు పారితోషికంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ... తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడానికి విశ్వవిద్యాలయం ఎంతో గర్వపడుతోందన్నారు. అందుకు సహకరించిన పురస్కారాల నిర్ణాయక సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో 20 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... సామాజిక మనుగడకు ఆయా ప్రాంతాల సాహిత్య, సంస్కృతి ప్రధాన భూమిక వహిస్తుందని, ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు. -
అయ్యో టీచరమ్మ! స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్‌నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్‌తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్‌దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
లింగంపల్లి–కాకినాడ, నాంపల్లి–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ నేపథ్యంలో లింగంపల్లి–కాకినాడ, హైదరాబాద్–జైపూర్ మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి–కాకినాడ మధ్య (07296) జూలై 2 నుంచి అక్టోబరు 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. కాకినాడ–లింగంపల్లి మధ్య జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో (07295).. హైదరాబాద్–జైపూర్ మధ్య జూలై 1 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం (07115).. జైపూర్–హైదరాబాద్ మధ్య జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి ఆదివారం (07116) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరనుండగా, జైపూర్ రైళ్లు నాంపల్లిలో రాత్రి 8.20కి బయల్దేరుతాయి. డబ్లింగ్ పనులతో పలు రైళ్ల రద్దు.. సెంట్రల్ రైల్వే పరిధిలోని మన్మాడ్ సెక్షన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. జూన్ 23 నుంచి 28 వరకు ఈ రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. విశాఖ–షిర్డీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్ 23 తిరుగుప్రయాణం కాగా, 24న రద్దు కానున్నాయి. సీఎస్టీ ముంబై–జాల్నా ఎక్స్‌ప్రెస్ 25 నుంచి 28 వరకు, తిరుగుప్రయాణంలో 29 వరకు, ఆదిలాబాద్–ముంబై ఎక్స్‌ప్రెస్ 26 నుంచి 27 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 27, 28 తేదీల్లో, కాజీపేట–దాదర్ 25, తిరుగుప్రయాణంలో మరుసటిరోజు, పుణే–కాజీపేట 24న, కాజీపేట–పుణే 26న రద్దయ్యాయి. కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ 25, 27లలో, తిరుగుప్రయాణంలో 26, 28లలో, సికింద్రాబాద్–షిర్డీ ఎక్స్‌ప్రెస్ 24, 26లలో తిరుగుప్రయాణంలో 25, 27లలో నాగర్సోల్–షిర్డీ మధ్య రద్దయ్యాయి. సికింద్రాబాద్–మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ 24 నుంచి 27 వరకు, తిరుగుప్రయాణంలో 25 నుంచి 25 వరకు నాగర్సోల్–మన్మాడ్ మధ్య రద్దయ్యాయి. (క్లిక్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్) -
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. #15JUNE 7:45PM⚠️ Massive Rains Ahead Tonight in Entire #Telangana⛈️🥳 👉South #Hyderabad already Seeing Good Rains&More Rains Ahead in coming Hours 🌧️#HyderabadRains pic.twitter.com/ygx5SEoTru — Hyderabad Rains (@Hyderabadrains) June 15, 2022 -
రథాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శ్రీసీతారామచంద్ర స్వామి రథం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథాన్ని ఆలయం నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు ఏప్రిల్ 10న ముగిశాయి. అయితే రథం ఆలయ ఆవరణలోనే ఉండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రథం తడుస్తుండడంతో దానిని తయారు చేయించిన దాత దయానందరెడ్డి రథాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు శనివా రం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురిని గుట్టపైకి తీసుకెళ్లారు. అందులో 8 మంది తాళ్ల సహాయంతో.. మరో నలుగురు దానిని పట్టు కుని లాగుతుండగా ఇనుముతో చేసి న రథం కరెంటు తీగలకు తగలడంతో దానిని పట్టుకుని లాగుతున్న రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36) దాసరి ఆంజనేయులు (26) విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాజబో యిన వెంకటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: ‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’ -
10 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించనున్న నాంపల్లి కోర్టు
-
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పై విచారణ
-
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్‌కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్‌గా.. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్‌నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్‌పోర్ట్, రెండు నకిలీ పాస్‌పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్‌కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం దుర్మార్గం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : రాష్ట్రంలో ఉద్యోగ నోటి ఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండి పడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. షర్మిల మాట్లాడుతూ యువత, విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే 1.90 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఆమెను బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నాంపల్లిలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నాంపల్లి లోని ఎఫ్‌టీసీసీఐ ( ఫ్యాప్సి ) దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోనూ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్ వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ మూసివేత
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది. -
ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి
నాంపల్లి: ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారి చేసింది. బోయినాపల్లి మాదక ద్రవ్యాల కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కెల్విన్‌ను అరెస్టు చేసి ఎల్ఎస్డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2016లో మళ్లీ ఎక్సైజ్‌శాఖ కెల్విన్ కేసు మరోసారి అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్ వ్యవహరం బయట పడింది. ఈ నేపథ్యంలో సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టు ఆ ఛార్జ్‌సీట్‌ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్‌లనూ చేర్చింది. అక్టోబర్ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్‌జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు. ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్‌కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
-
సీఎం కేసీఆర్‌కు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి లేఖ
-
సీఎం కేసీఆర్‌కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు నేపథ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ రాశారు. రెండేళ్ల క్రితమే ఎగ్జిబిషన్ సొసైటీ లీజ్ ముగిసినా అక్రమంగా కార్యకలాపాలు సాగించినట్లు లేఖలో పేర్కొన్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా 62 మందికి మెంబర్‌షిప్‌లు ఇచ్చారన్నారు. గత మూడేళ్లలో కొత్తగా మెంబర్షిప్ పొందినవారిని సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆడిట్ సక్రమంగా జరగలేదని తెలిపారు. కాలేజీ నిధులను సైతం మళ్లించారని.. ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ లేఖలో రవీంద్రసేన పేర్కొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరేళ్లు పనిచేశారు. ఆయన ప్రెసిడెండట్‌గా ఉన్న సమయంలో సొసైటీలో మెంబర్‌షిప్‌లు ఇస్టానుసారంగా ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో సొసైటీ ఆడిట్ సెక్షన్లో రెండు రోజు దనిఖీల్లో భాగంగా ఏసీబీ రికార్డులను పరిశీలిస్తున్నారు. -
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ మాట్లాడుతూ.. 80సంవత్సరాల నుండి ఎగ్జిబిషన్ నడిపిస్తున్నామని, అకస్మాత్తుగా ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ పైన విచారణ చేస్తామని ఏసీబీ సిబ్బంది వచ్చారన్నారు. ఏసీబీ వాళ్లకు ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పి తనీఖీలు చేస్తున్నారుని, అయినా మా సొసైటీ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన అన్నారు. సొసైటీ కార్యకలాపాలు అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అకౌంట్స్ అన్ని ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తామని, సొసైటీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కాగా మొట్టమొదటి సారిగా సొసైటీ మీద ఏసీబీ సోదాలు చేస్తున్నారని చెప్పారు. చదవండి: Work From Home Survey: ఆఫీసుకు వెళ్తేనే అసలు మజా! -
నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి
-
నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. కమ్యూనిటీ హల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో బ్యాండ్ ఆపకపోవడంతో 10 మంది యువకులు గొడవ చేశారు. బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధితులు నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
జమ్మికుంట సీఐపై హెచ్చార్సీలో ఫిర్యాదు
సాక్షి, నాంపల్లి: భూ తగాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తూ మానసికంగా వేధిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముచ్యంతల సమ్మిరెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో (హెచ్చార్సీ) ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజిరెడ్డి పేరిట 2.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన తమ్ముడు సదాశివరెడ్డి జమ్మికుంట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సృజన్‌రెడ్డి 17 జూలై 2019న అన్నదమ్ములిద్దరిని పిలిపించి రాజీ కుదిర్చినట్లు వివరించారు. ఇరువురి సమక్షంలో తనకు 1–07 ఎకరాలు, తన తమ్ముడు సదాశివరెడ్డికి 1–01 ఎకరాల భూమిని పంచి ఒప్పందం కుదిర్చారని తెలిపారు. అనంతరం అట్టి భూమిని తన తండ్రి సమక్షంలో అన్నదమ్ములిద్దరి పేరిట విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అయితే తనకు 3 గుంటల భూమిని ఎక్కువగా ఇప్పించినందుకు గాను సీఐ సృజన్‌రెడ్డి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో సీఐ తన తమ్ముడితో కుమ్మక్కై అసభ్య పదజాలంతో దూషిస్తూ, కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనపై మూడు తప్పుడు కేసులు బనాయించి బైండోవర్ చేశాడన్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, సీఐ సృజన్‌రెడ్డి, తన తమ్ముడు సదాశివరెడ్డి తదితరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
139 అత్యాచారం: డాలర్ బాయ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన యువతి కేసులో విచారణను వేగవంతం చేశారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మందిని ఇదివరకే విచారించారు. అనంతరం ప్రధాన నిందిడుడైన రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతన్ని శుక్రవారం సీసీఎస్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని.. నగరంలోని నాంపల్లి కోర్టుకు తరలించారు. డాలర్ బాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడుపై 376, 184, 185,509, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. యువతి వాంగ్మూలం ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని వివరాల కోసం అతన్ని రిమాండ్‌లోకి తరలించే అవకాశం. కాగా యువతి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
రేపే ఫలితం : మొక్కు చెల్లించిన కవిత
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం రేపు (సోమవారం) విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తన మొక్కు తీర్చుకున్నారు. నాంపల్లిలోని యూసీఫీయన్ దర్గాను సందర్శించిన కవిత చాదర్ సమర్పించారు. ప్రతి ఎన్నికల ఫలితాల ముందు దర్గాను సందర్శించిన కవితకు ఆనవాయితీ. దీనిలో భాగంగానే రేపటి ఫలితాల నేపథ్యంలో యూసీఫీయన్ దర్గాకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీమ్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కవితకు స్వాగతం పలికారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
2వ రోజు కొనసాగుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెండవ రోజు విచారిస్తున్నారు. నిన్న(సోమవారం) ఏసీపీని అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీలోని సర్వే నెంబర్ 64లో 2 వేల గజాల భూ వివాదంపై ఇవాళ(మంగళవారం) నర్సింహారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: రియల్ ఎస్టేట్ పేరిట కోట్లు గడించిన ఏసీపీ) అయితే ఏసీపీ పలువురు రియల్టర్లతో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్ బిజినెస్‌లో 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు విచారణలో తెలిసింది. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులను కూడా విచారించిన ఏసీబీ అధికారులు హైటెక్ సిటీలోని రెండు గజాల ప్రభుత్వ భూ వివాదంలో పలు రెవెన్యూ అధికారులను కూడా విచారించనున్నారు. -
ఏసీపీ నర్పింహారెడ్డి అక్రమాస్తుల గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగింది. నర్సింహారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాకలు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఏసీపీ పదవిని అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ రిమాండ్ నివేదికలో వెల్లడించింది. ఈ కేసులో ఎ2 నుంచి ఎ13 నిందితులంతా ఉద్దేశపూర్వకంగానే ఆయనకు సహకరించారని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64 లోని 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నిందితులు కబ్జా చేసి 2 వేల గజాల భూమిని 490 గజాల చొప్పున విభజించి.. నాలుగు డాక్యుమెంట్లు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు మొదట తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. తర్వాత కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్‌గా మార్చారని, గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. నర్సింహారెడ్డి 2 వేల గజాల భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా తెల్చినట్లు ఏసీబీ పేర్కొంది. అయితే ఈ భూమిపై ఎలాంటి హక్కు లేనప్పటికి నిందితులు ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు భారీ స్థాయిలో ఏసీపీ బీనామీ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లో నాలుగు నివాస గృహాలు, అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూములు నర్సింహారెడ్డి బీనామీల పేరిట ఉన్న ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డితో పాటు మరో 13 మందిని నిందితులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ఎ1 నిందితుడు ఏసీపీ నర్సింహారెడ్డి, ఎ2-గోపగాని రాజలింగం, ఎ3-గోపగాని సజ్జన్ గౌడ్, ఎ4- పోరేటి వెంకట్‌రెడ్డి, ఎ5-పోరేటి తిరపతి రెడ్డి, ఎ6- ఎర్ర శంకయ్య, ఎ7- ఎర్ర చంద్రశేఖర్, ఎ8- అర్జుల గాలిరెడ్డి, ఎ9-అర్జుల జైపాల్‌రెడ్డి, ఎ10-మధుకర్ శ్రీరామ్, ఎ11- చంద్రారెడ్డి, ఎ12- బత్తిని రమేష్, ఎ13- అలుగువెళ్లి శ్రీనివాస్‌రెడ్డిగా అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశామని మరో ఇద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
కీసర తహశీల్దార్ కేసులో కొనసాగుతున్న విచారణ
-
కీసర తహశీల్దార్ కేసులో కొనసాగుతున్న విచారణ
సాక్షి, హైదరాబాద్ : కీసర తహశీల్దార్ అవినీతి కేసులో విచారణ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఏసీబీ అధికారులు పీపీఈ కిట్ ధరించి నిందితులను విచారిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులను వేర్వేరు గదుల్లో ఉంచి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులకు ఎమ్మార్వో నాగరాజు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (చదవండి :కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!) బ్యాంకు లాకర్లపై ఇప్పటిరవరకు నాగరాజు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. కోటి 10 లక్షల రూపాయలపై నిందితులను నుండి అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. చంచల్ గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులు నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజులను కస్టడీ నిమిత్తం ఏసీబీ కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ 27 వరకు కొనసాగే ఏసీబీ కస్టడీ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వారిని బుధవారం కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి : కీసర : నలుగురు నిందితుల కస్టడీకి అనుమతి) -
నాంపల్లి ACB ఆఫీస్‌లో కొనసాగుతున్న విచారణ
-
నేడు ఉగ్రవాది తుండా కేసులో తీర్పు
-
కరీం తుండా పై నేడు తుది తీర్పు
-
యువతకు స్ఫూర్తిప్రదాత నేతాజీ
నాంపల్లి: యువతరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’ముగింపు వేడుకలు, యువజన అవార్డుల ప్రదానోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాట్లాడుతూ...నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో పనిచేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్ప మహనీయుడు నేతాజీ అని కీర్తించారు. యువజన అవార్డులు గెలుపొందిన వారికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశా రు. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా ఫ్రెండ్స్ యూత్ క్లబ్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రూ.1లక్ష చెక్కుతో పాటుగా రాష్ట్రస్థాయి యువజన పురస్కారాన్ని అందజేశారు. -
ఎగ్జిబిషన్‌కు ఎన్వోసీలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ప్రతి ఏటా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నిరభ్యంతర సర్టిఫికెట్ల (ఎన్వోసీ)పై హైకోర్టు మండిపడింది. మొత్తం స్థలంలో 40 శాతం పార్కింగ్‌కు కేటాయించాలన్న నిబంధనను ఏవిధంగా అమలు చేశా రని ప్రశ్నించింది. గగన్‌విహార్, చంద్రవిహార్, ఆదాయపన్ను తదితర శాఖల భవనాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పడం కాదని, ఆయా శాఖల నుంచి అందుకు అనుమతులు పొందిందీ లేనిదీ చెప్పాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఆయా శాఖలు తనిఖీలు చేసిన తర్వాతే ఎన్వోసీలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏకపక్షంగా ఎన్వోసీలు ఇస్తే ఈ ఏడాది ఎగ్జిబిషన్ నిర్వహణకు కూడా అనుమతి ఇవ్వ బోమని తెలిపింది. ఆయా శాఖల తనిఖీ నివేదికలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ సంఖ్యలో ఎగ్జిబిషన్ సందర్శనకు వస్తారని, అలాంటి చోట్ల ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటేనే అనుమతి ఇస్తామని పేర్కొంది. అన్ని వివరాలు మంగళవారం తమకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందలేదని, అప్పుడు జరిగిన అగ్నిప్రమాదానికి ఎగ్జిబిషన్ సొసైటీనే కారణమని, సొసైటీ నిర్వహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. జనవరి 1 నుంచి ప్రారంభం కాబోయే ఎగ్జిబిషన్‌కు అనుమతిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్వోసీ ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖలు ఏ కారణాలతో నిరభ్యంతర పత్రాలు జారీ చేశారో స్పష్టం చేయకపోతే అనుమతి మంజూరు ఉండదని తేల్చి చెప్పింది. అనుమతులు పొందాల్సిన బాధ్యత ఎగ్జిబిషన్ సొసైటీ, ఆయాశాఖలదేనని చెప్పింది. ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్ పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎగ్జిబిషన్ నిర్వహణ ఏరియాల్లో ఫుట్ పాత్ల ఆక్రమణలు తొలగించాలనే తమ ఆదేశాల్ని అమలు చేశారో లేదో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. ఎన్వోసీ ఇచ్చిన అధికారులు పరిహారం ఇస్తారా? ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ కల్పించుకుని ఎగ్జిబిషన్ సమీపంలో 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌లపై నివాసం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు వాళ్లను తొలగించ డం ప్రభుత్వానికి కష్టమేనని చెప్పారు. పైగా అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తుందని గట్టిగా చెప్పారు. ఎగ్జిబిషన్ మైదానంలో మాక్‌డ్రిల్ నిర్వహణ జరిగిందని, ప్రమాదం జరిగితే యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న 2 నీటి ట్యాంకులు ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాదం జరిగితే అక్కడికి తరలించేలా పైపులైన్లు వేశామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ అధికారులు కింది స్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయకుండా గదుల్లో కూర్చుని ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్వోసీ ఇచ్చినట్లుగా ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగితే ఎగ్జిబిషన్ సందర్శకులు ఎలా వెళ్లాలో ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. ఒక వేళ ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని అనుకుందాం.. (ఇలా జరగాలని అనుకోకూడదు) అప్పుడు ప్రభు త్వం ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాల్సి వస్తే.. ఎన్వోసీ ఇచ్చిన అధికారులు ఇస్తారా అని ధర్మాసనం నిలదీసింది. ఎగ్జిబిషన్ నిర్వహణను జోక్‌లా తీసుకోరాదని, హైకోర్టులోనే రెండు సార్లు షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని, జైపూర్‌లోని హైకోర్టు బెంచ్ వద్ద కూడా ప్రమాదం జరిగిందని, లండన్‌లో అయితే ఒక్క అగ్గిపుల్ల కారణంగా సగం నగరం అగ్నికి ఆహుతి అయిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్వోసీలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కుదరదని చెప్పింది. ఎన్వోసీ ఎలా ఇచ్చారో, ఏయే అంశాలపై సంతృప్తి చెందారో పూర్తి వివరాలతో మంగళవారం జరిగే విచారణ సమయంలో తమ ముందు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఒకేషనల్ విద్యార్థులకు ఉద్యోగ మేళ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వృత్తివిద్య అభ్యసించిన విద్యార్థుల కోసం ఈనెల 30న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. ఆటో మొబైల్( ఏఈటీ), మెకానికల్ టెక్నాలజీ(ఎంటీ) పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బాజహర్ఘాట్లో ఉన్న ప్రభుత్వ వృత్తి కళాశాలలో ఈ ఉద్యోగ మేళ జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాస్, ఫెయిల్ అయిన ఇతర గ్రూపుల విద్యార్థులు కూడా ఉద్యోగ మేళాకు హాజరుకావొచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం శనివారం ఘనంగా జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవ కవి సమ్మేళనం, పన్నెండు మంది కొత్తతరం కవుల కవిగానం, ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్వహించారు. పన్నెండు మంది కొత్త తరం కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం వైభవంగా జరిగింది. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీరామ్, ప్రొద్దుటూరి యెల్లారెడ్డిలు పద్యం, పాట, జానపదం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులు కలిసి మొత్తం 39మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న ఆటా తెలుగు ప్రజలకు వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షులు బువనేశ్ బుజాలా అన్నారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ఆటా అండగా ఉంటుందని ఆయన అన్నారు. సుప్రసిద్ద రచనా కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు అదే నమ్మకంతో కొనసాగాలని తెలిపారు. 'నలుగురితో చర్చలు జరుగితే ఆలోచనలు వికసిస్తాయి. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదద్దుతాయని' వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్, ఓల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, కె.ఎన్.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్, పూడూరు రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, తదపరి ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణా రెడ్డి అలా, ఆటా 2020 కన్వీనర్ నర్సింహారెడ్డి ద్యాసానితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది
-
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
-
ఎం.జే మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం
-
నాంపల్లి ఎం.జే మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని యం.జే మార్కెట్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ భవనంలో పివిసికి చెందిన పైపులను నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. -
నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
-
తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
హైదరాబాద్: నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం అందజేసే వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్ర శిల్పకళ, జానపద కళలు, విజ్ఞానం, భాషా శాస్త్రం, వ్యాకరణం, సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్ర, జ్యోతిషం వంటి కోర్సు ల్లో చేరవచ్చని తెలిపారు. హైదరాబాదు ప్రాంగణంలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్‌లో బ్యాచిలర్ కోర్సుతో పాటుగా ఎంఏ (తెలుగు), ఎంఏ (అనువర్తిత భాషా శాస్త్రం), ఎంఏ (కర్ణాటక సంగీతం), ఎంపీఏ (కూచిపూడి/ఆంధ్రనాట్యం), ఎంపీఏ (జానపద కళలు),ఎంపీఏ (రంగస్థల కళలు), ఎంఏ (జర్నలిజం) సాయంకాలం కోర్సుగా ఎంఏ (జ్యోతిషం) వంటి పోస్ట్రుగాడ్యుయేషన్ కోర్సులు, వివిధ లలిత కళా రంగాలలో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, కళా ప్రవేశిక, ప్రాథమిక ప్రవీణ కోర్సులున్నట్లు పేర్కొన్నారు. రాజమండ్రి నన్నయ ప్రాంగణంలో ఎంఏ (తెలుగు), శ్రీశైలం పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ఎంఏ (చరిత్ర పురావస్తు శాస్త్రం), కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ఎంపీఏ (కూచిపూడి నృత్యం) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, రాణి రుద్రమదేవి పేరిణి కేంద్రం ద్వారా రెండేళ్ల కాల వ్యవధితో పేరిణి నృత్య విశారద కోర్సును అందజేస్తున్నట్లు వివరించారు. హైదరాబాదు, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్ కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రాంగణాల్లోని కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు తెలుగు వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా రూ.350 చెల్లించి జూన్ 22లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో జూన్ 29లోగా చెల్లించాల్సి ఉంటుంది. -
కోదండరాం అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సోమ వారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకో వాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల ముఖ్య నేతల గృహనిర్బంధం, విద్యార్థి, ప్రజాసంఘాల వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు, ఇంటర్ బోర్డు వద్ద నిరసనలకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీసు స్టేష న్లకు తరలించారు. తార్నాకలోని నివాసంలో కోదండరాంను ఉదయం నుంచి గృహ నిర్బంధంలోనే ఉంచడంతో టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటి ఆవరణలోనే పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. పోరాటాలతోనే జన సమితి ఆవిర్భవించిందని, పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్బంధాల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం టీజేఎస్ పోరాటాలు చేసిందని, ప్రజల భావవ్యక్తీకరణకు అనుగుణంగా పార్టీ ప్రయాణం సాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాటాలు చేస్తామన్నారు. టీజేఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని కార్యాల యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురించి తెలియజేయడంతో అక్కడకు వెళ్లేందుకు కోదండరాంను పోలీసులు అనుమతించారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన్ను, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం కోదండరాంను, ఇతర పార్టీల నేతలను రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేశారు. బాధితులకు న్యాయమేదీ... ఇంటర్ ఫలితాల విషయంలో తప్పు జరిగిందని అం గీకరించాక, సమస్య పరిష్కారానికి చర్యలతోపాటు బాధితులకు న్యాయం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాల్సిన ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదని కోదండరాం విమర్శించారు. విడుదలయ్యాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫలితాల గందరగోళానికి కారణమైన కంపెనీకి సామర్థ్యం లేకపో యినా బాధ్యతలు అప్పగించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడం, విద్యార్థుల పరీక్షాపత్రాల మూ ల్యాంకనంపై సమీక్ష నిర్వహించపోవడం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారంపై కార్యాచరణను ప్రకటించకపోవడం ప్రభుత్వ తప్పిదమన్నారు. దీనిపై శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం అక్రమమన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించి ఇదే తమ నిర్ణయం అని పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రకటించినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు. -
‘నా బిడ్డకు టాబ్లెట్స్ ఇచ్చి చంపేశారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో గురువారం మహ్మద్ ఉమర్ అనే చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉమర్ తల్లి జెబనాజ్ స్పందించారు. కుమారుడి మృతిపై ఆమె ఆగ్రహం వ్యకం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును టాబ్లెట్లు ఇచ్చి చంపేశారని ఆరోపించారు. తాము ఎల్బీనగర్‌నుంచి హాస్పిటల్‌కు వెళ్లేంత వరకు బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపింది. హాస్పిటల్లో రెండుసార్లు బాబుకి టాబ్లెట్స్ వేశారని, టాబ్లెట్స్ వేసుకున్న కొద్దిసేపటి వరకు బాబు నిద్ర లేవలేదని వెల్లడించింది. తాను బాబు దగ్గరకు వెళ్లి చూసే సరికి బాబుకి స్పర్శ లేకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లానని తెలిపింది. వారు బాబు చనిపోయాడని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారంది. హాస్పిటల్లో బాబు చనిపోయాడని నిర్థారించి ఎక్కడి వారు అక్కడకి వెళ్లిపోయారని, తాము అడగడానికి కూడా అక్కడ ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఉమర్ చనిపోయాడని తెలిపింది. తన బాబు చావుకు కారణం అయిన వారిని ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన శిక్ష పడేలా చూడాలని, తమ బాబుకి జరిగిన విధంగా ఎవరి పిల్లలకు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
-
‘మందులు ఇచ్చిన నర్సులను విచారిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఇచ్చిన వ్యాక్సిన్ వికటించడంతో.. ఓ చిన్నారి మృతి చెందటం.. మరికొంతమంది చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. టీకాల అనంతరం ఇవ్వాల్సిన మందులు కాకుండా వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు మందులు ఇచ్చిన నర్సులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సునీత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చాము. సాయంత్రం నుంచి టీకాలు తీసుకున్న చిన్నారుల్లో కొంతమంది అసౌకర్యంగా ఉన్నారంటూ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వెంటనే డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాము. టీకాలు తీసుకున్న పిల్లలందర్నీ మళ్లీ పిలిపించి అందరికీ వైద్య పరీక్షలు చేసి నిలోఫర్ ఆసుపత్రికి పంపించాము. డాక్టర్ రుబీనా, ఫార్మసిస్ట్ మోహన్, నర్స్ మెహ్రాలు పిల్లలకు టీకాలు ఇచ్చారు. పిల్లలకు టీకాల అనంతరం శాంతాబాయి, గీతా, కౌసర్, కవితాలుగా గుర్తించాము. ప్రస్తుతం వీరందరిని కోఠిలోని డీఎమ్హెచ్ఓలో అధికారులు విచారిస్తున్నార’ని తెలిపారు. చదవండి : వికటించిన వ్యాక్సిన్.. 15 మందికి అస్వస్థత నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం చోటుచేసకుంది. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ వికటించడంతో ఫైజల్ అనే చిన్నారి మృతి చెందారు. మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వైద్యులు 70 మందికి పైగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తర్వాత ఇచ్చే ట్యాబ్లెట్స్ మారడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నగరంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 15 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు అనుభవం లేని నర్సులు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. -
నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదుల ధర్నా


