సాక్షి హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్‌లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.


