breaking news
Announces
-
నాంపల్లి: అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం
సాక్షి హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
డాక్టర్ తంగరాజ్కు విజ్ఞానశ్రీ పురస్కారం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టర్. కె తంగరాజ్ విజ్ఞాన శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గానూ కేంద్రం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మానవ జన్యుశాస్త్రంతో పాటు తదితర అంశాలపై డా.తంగరాజ్ విశేష పరిశోధనలు జరిపారు.డాక్టర్. తంగరాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్- అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన భారత జనాభాలోని జన్యు వైవిధ్యం అనే అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. వాటితో పాటు భారత ఉపఖండానికి సంబంధించిన పూర్వీకుల మూలాలు, వలసలు గురించి శాస్త్రీయంగా సమాకూర్చారు.అండమాన్ గిరిజన తెగలపై ఈయన చేసిన అధ్యయనాలు మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. వీటితో పాటు డాక్టర్ తంగరాజ్ దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే జన్యు వ్యాధులు గురించి పరిశోధనలు జరిపి వాటి నిర్ధారణ పద్ధతులు తదితర అంశాలపై కృషిచేశారు. దీంతో ఈయన సేవలకు మెచ్చిన కేంద్రప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ విజ్ఞాన శ్రీ పురస్కారానికి ఈయనను ఎంపిక చేసింది.విజ్ఞాన్ శ్రీ పురస్కారంవిజ్ఞాన్ శ్రీ పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం 2024లో ప్రవేశ పెట్టింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచేవారి గౌరవార్థం ఈ వార్డును అందజేస్తారు. దీనిని నాలుగు విభాగాలుగా అందజేస్తారు.విజ్ఞాన రత్న- అత్యున్నత గౌరవం జీవిత కాల కృషికి విజ్ఞాన్ శ్రీ- మధ్యస్థాయి శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ యువ- యువ శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ బృందం- శాస్త్రవేత్తల బృందానికి ఇలా నాలుగు విభాగాలలో ఈ అవార్డుని అందజేస్తారు. ఈ పురస్కార ప్రధానం రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. గతంలో ఈ అవార్డును శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుతో ప్రధానం చేసేవారు. -
బంగ్లాలో ఎన్నికలు.. హసీనా పార్టీ లేకుండానే?
కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి, అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్ త్వరలో ప్రజస్వామ్య వేడుకకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ దేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హసినా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుపుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ నసిరుద్దీన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దయచేసి ప్రజలెవరూ ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాలలో ఉన్న దేశీయులు ఓటుకోసం డిసెంబర్12 నుంచి 25వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అయితే వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలుశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల్లో హాసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత్‌ను అభ్యర్థిస్తుంది. అయితే బంగ్లాదేశ్ వెళ్లే నిర్ణయం స్వయంగా షేక్ హసీనానే తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.షేక్ హసీనా తొలిసారిగా 1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకూ వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హాసీనాకు చెందిన పార్టీ ఆవామీ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనానే కాకుండా ఆమె పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు (ఫొటోలు)
-
మేము ఇప్పుడు నలుగురం: ప్రకటించిన రోహిత్ శర్మ, రితికా సజ్దే (ఫొటోలు)
-
Mahathalli Jahnavi Dasetty: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన 'మహాతల్లి' (ఫొటోలు)


