యుద్ధ భయం.. లిక్విడ్‌ క్యాష్‌ దాచుకోవాలా?? | War Rumors Spark Experts Clarify Truth About Liquid Cash Hoarding | Sakshi
Sakshi News home page

యుద్ధ భయం.. లిక్విడ్‌ క్యాష్‌ దాచుకోవాలా??

Mar 11 2026 8:19 PM | Updated on Mar 11 2026 9:15 PM

War Rumors Spark Experts Clarify Truth About Liquid Cash Hoarding

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎన్నెన్నో వదంతులు వ్యాపిస్తున్నాయి. గ్యాస్‌ అయిపోతుందంటూ.. సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలంటూ యుద్ధం మొదలైన తొలినాళ్లలో వచ్చిన వదంతులు ఇప్పుడు నిజమవుతున్నాయి. 

అదేవిధంగా లిక్విడ్‌ క్యాష్‌ దాచుకోవాలని, ఇంట్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని సోషల్‌ మీడియాలో ఎలాంటి నిర్ధారణ లేని వార్తలు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది నిజం? ఏది రూమర్‌? అనే అంశంపై వాస్తవాలను పాఠకుల ముందు పెట్టేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. 

ఈ క్రమంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత సీతారాంబాబును ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలను ఆయన వెలుగులోకి తీసుకువచ్చారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) విడుదల చేసిన లిక్విడ్‌ క్యాష్‌లో దాదాపు రూ.40 లక్షల కోట్లు ఇప్పటికీ బయటే ఉన్నాయని, ఆ మొత్తాన్ని ఎవరూ కూడా ఏ బ్యాంకులోనూ జమ చేయడం లేదని వివరించారు. ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Advertisement
 
Advertisement
Advertisement