16వ వసంతంలోకి వైఎస్సార్సీపీ | Greetings on YSRCP Formation Day | Sakshi
Sakshi News home page

16వ వసంతంలోకి వైఎస్సార్సీపీ

Mar 11 2026 6:52 PM | Updated on Mar 11 2026 8:37 PM

Greetings on YSRCP Formation Day

సాక్షి తాడేపల్లి: రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్.0 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైఎస్సార్సీపీ. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో అనేక పోరాటాలు, విజయాల మధ్య ప్రజల ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ పార్టీ ఎంతో గొప్పగా ఎదిగింది. ఎన్నో సంఘర్షణలు, ఆటుపోట్లు ఎదుర్కొని విజయవంతంగా 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపింది.     

 

 

Advertisement
 
Advertisement
Advertisement