పన్ను చెల్లించలేదని గ్యాస్‌ సిలిండర్‌ సీజ్‌ | Municipal Staff Seize Gas Cylinder Over Unpaid House Tax In Warangal, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించలేదని గ్యాస్‌ సిలిండర్‌ సీజ్‌

Mar 11 2026 11:36 AM | Updated on Mar 11 2026 11:48 AM

Municipal Staff Seize Gas Cylinder Over Unpaid House Tax Warangal

వరంగల్‌: ఇంటి పన్ను చెల్లించలేదంటూ మున్సిపల్‌ సిబ్బంది వంట గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకెళ్లి సీజ్‌ చేశారు. వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై ఇంటి యజమాని సుజాత కథనం ప్రకారం.. సుజాత అనే మహిళ రూ.6 వేల వరకు ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో మున్సిపల్‌ సిబ్బంది ఇంటికి వచ్చి పన్ను చెల్లించాలని కోరారు. ఇదేఇంటిలో అద్దెకు ఉంటున్న వారు వంట చేస్తుండగా.. వారి గ్యాస్‌ సిలిండర్‌ బయటికి తీసుకొచ్చి సీజ్‌ చేశారు. 

సిబ్బంది రాగానే తమ దగ్గర డబ్బులు ఉంటాయా?, కొన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ సుజాత బతిమిలాడినా వినిపించుకోలేదు. చివరకు పక్క ఇంటి నుంచి డబ్బులు చేబదులు తీసుకుని వచ్చి ఇంటి పన్ను చెల్లించిన తర్వాతే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారు. అలాగే, పోచమ్మమైదాన్‌ ఏరియాలో కూడా పన్ను చెల్లించలేదని ఓ ఇంటి నుంచి గ్యాస్‌ సిలిండర్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బడా వ్యక్తులు పన్నులు చెల్లించకున్నా మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోరని విమర్శలు వస్తున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement