breaking news
Fire Accident
-
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
వర్తమానంలో లాభార్జన కోసం భవిష్యత్తును బలిపెట్టే నయా ఉదారవాద విధానాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్తున్నాయి. దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల్ని పట్టించుకుని పర్యావరణ అనుకూల విధానాలు పాటించని ఫలితంగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 37 కోట్ల ఎకరాల్లోని అడవులు, పొదలు తగలబడ్డాయని ఒక అంచనా. ఇలా కార్చిచ్చులో చిక్కుకున్న ప్రాంతం మంగోలియా దేశ విస్తీర్ణానికి సమానమని చెబుతున్నారు.స్పెయిన్, ఫ్రాన్స్ అటవీప్రాంతాల్లో, కెనడా, రష్యాల్లో గత వారం రోజు లుగా వ్యాపిస్తున్న మంటల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్ కార్చిచ్చులైతే ఊహించశక్యం కానంత స్థాయిలో ఉన్నాయి. వాటిని అదుపు చేయగలిగా మని ఆ రెండు దేశాలూ చెబుతున్నా జనంలో భయాందోళనలు ఉపశమించలేదు. నైరుతి ఫ్రాన్స్‌లో పారిస్‌కు నాలుగు రెట్లు పెద్దదైన విస్తీర్ణంలోని అడవి తగలబడటంవల్లగిరోండ్ ప్రాంతంలోని జనావాసాలనుంచి రెండున్నర లక్షలమంది పౌరుల్ని ఆదరా బాదరాగా తరలించాల్సివచ్చింది.ముఖ్యంగా బోర్డావ్ నగరంవైపు ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు జనాన్ని హడలెత్తించింది. అటు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ లక్షమందిని తరలించారు. దాని శివారు ప్రాంతాల్లో పలు జనావాసాలు తగలబడిపోయాయి. ఆ రెండూ యుద్ధ రంగాన్ని తలపింపజేస్తున్నాయని మీడియా కథనం. జరగాల్సిన నష్టం జరిగాక మంటల్ని ఏదోమేరకు అదుపు చేయటం సాధ్యమే. కానీ వాటివల్ల వ్యాపించే పొగవల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సూక్ష్మ ధూళి కణాలు పీల్చేగాలిలో వ్యాపించి ఊపిరి తిత్తులు, గుండెసంబంధ వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తుంది. అరుదైన వృక్షసంపద, జీవవైవిధ్యం బుగ్గిపాలవుతుంది. దాని కారణంగా వడగాడ్పులు చెలరేగి జనంఅల్లాడిపోతారు. ఈ ఖండాల్లో ఏటా కార్చిచ్చులవల్ల 3,40,000 అకాల మరణాలుసంభ విస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. 2023లో ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కెనడా కార్చిచ్చుల వాటా 23 శాతమని అంచనా వేశారు. యూరప్ ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని యూరోపియన్ యూనియన్(ఈయూ) పర్యవేక్షణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్రాన్స్ కార్చిచ్చువల్ల ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల్లోని పలు ప్రాంతాల్లో పొగ, ధూళితో కూడిన నీటియావిరి వ్యాపించి, అది మేఘాలుగా మారి, ప్రమాదకరమైన పెనుగాలులు, పిడుగుపాట్లు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు మానవతప్పిదాలతోనే మొదలవుతాయి. కానీ వాతావరణ మార్పుల పర్యవసానంగా అవి వేగంగా విస్తరిస్తాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు స్థూలంగా అంగీకారానికొచ్చినా, తమ నమూనాలు అందుకోలేనంత స్థాయిలో ఇవి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తీవ్రతను పసిగట్టడానికి కొత్త ఉపకరణాలు అవసరం కావొచ్చన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్సుల్లో మంటలు వ్యాపించిన అడవుల్లో పిక్నిక్లు, క్యాంప్ ఫైర్లు ఎక్కువ. అజాగ్రత్తగా ఉండే మనుషులవల్ల నిప్పు రాజుకోవటం, గాలిలో తేమ శాతం తక్కువుండే రాత్రివేళ మోడువారిన చెట్లు, ఎండుటాకులు అంటుకుని మంటలు వేగంగా వ్యాపించడం రివాజు. గత కొన్నేళ్లుగా ఈ కార్చిచ్చులవల్ల ఉత్పత్తయ్యే వేడి, పొగ ఆధారంగా పైరోక్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షరహిత పెనుగాలులతో కూడిన తుపానులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఆ వేడిగాలుల కారణంగా ఎక్కడెక్కడో పడే పిడుగులు మరిన్ని అగ్నిప్రమాదాలకూ, కార్చిచ్చులకూ దారితీస్తున్నాయి. విషపూరిత పొగ, బొగ్గు రేణువులతో ఉండే ఈ మేఘాలు అణు విస్ఫోటంలో వచ్చే పొగ మాదిరే దీర్ఘకాలం వాతావరణంలో అలుముకుని సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. 2019–20లో ఆస్ట్రేలియా ఇలాంటి వాతావరణాన్ని చవిచూసింది. దానికి ‘బ్లాక్ సమ్మర్’ అని పేరుపెట్టారు. ఇకనైనా వాతావరణంతో ఆటలాడటం ప్రమాదకరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గుప్పెడు కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసం వాతావరణాన్ని బలిపెడితే ఊహకందని ఉత్పాతాలు కాటేస్తాయి. పర్యావరణం ధ్వంసమై మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుంది. తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. -
చెర్వుగట్టులో షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానం వద్ద ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అయి 17 వస్తు విక్రయ దుకాణాలు ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయం వద్ద భక్తులకు విక్రయించేందుకు బొమ్మలు, వివిధ ప్లాస్టిక్ వస్తువుల దుకాణాలున్నాయి.ఆ షాపుల ముందు ఏర్పాటు చేసిన రేకులకు స్తంభం నుంచి వచ్చే వైర్ ద్వారా ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక షాపులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వరుసగా ఉన్న 17 షాపులు, తోపుడు బండ్లకు ఒకదాని వెంట మరోదానికి అంటుకుని కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సురేశ్, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లగొండ, రామన్నపేట, నకిరేకల్ నుంచి అగ్నిమాపక వాహనాల ద్వారా ఉదయం 5.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బాధితులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటన స్థలానికి విచ్చేసి బాధితులకు తక్షణ సాయంగా రూ.20 వేల చొప్పున అందజేశారు. నష్టం జరిగిన దుకాణదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు త్వరలో తగిన న్యాయం చేస్తామన్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పరామర్శించారు. -
చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం
-
బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 8మంది మృతి
అహ్మాదాబాద్ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీగా పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ఫోస్టర్ కేర్ హోమ్ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే వ్యవస్థ. దేశ పౌర రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో మరో 19 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగా మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేశారు.అధికారులు ఈ అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. మరణించినవారి, గాయపడినవారి వయసుల గురించి తమ ప్రకటనలో ప్రస్తావించలేదు. పౌర రక్షణ శాఖ 10 అగ్నిమాపక వాహనాలు, 16 అంబులెన్సులను ఘటన స్థలానికి పంపించింది. అల్జీరియాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి.వారం వ్యవధిలో దాదాపు 1,000 అగ్నిప్రమాదాలు నమోదైనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అల్జీరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి సిఫీ ఘ్రియెబ్ గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు అల్జీర్స్‌లోని రెండు ఆసుపత్రులకు వెళ్లారు. అగ్నిప్రమాదం వేళ ఐదుగురు వికలాంగులను సంరక్షణలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. -
50 ఫ్యామిలీలు ఉండే భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
నోయిడాలో 50 కుటుంబాలు ఉండే ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. పలు కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్‌లో చెలరేగిన మంటల వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.నోయిడా సెక్టార్ 66లో జరిగిన భవన అగ్నిప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని పాలన యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గౌతమ్ బుద్ధ నగర్ సంయుక్త కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. “సెక్టార్ 66 పరిధిలోని ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధి మమూరా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది. అగ్నిమాపక సేవల సిబ్బంది వెంటనే స్పందించి అత్యంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక చర్యలు, రక్షణ చర్యల కోసం హైడ్రాలిక్ ప్లాట్‌ఫార్ములు, రెస్క్యూ వాహనాలు, 7 అగ్నిమాపక వాహనాలను వినియోగించారు. మంటలు చెలరేగిన భవనం జీ ప్లస్ 4 నిర్మాణం. అందులో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. నివాసితులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే పొగ పీల్చడం వల్ల ఇద్దరికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భవనం కింది స్థలంలో పార్కింగ్ సౌకర్యం ఉంది. బేస్మెంట్ లేదు. పార్కింగ్ ప్రాంతం నుంచి పై అంతస్తులకు పొగ వ్యాపించి లోపల ఉన్న వారిపై ప్రభావం చూపింది.పొగ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిన ఇద్దరిని వెంటనే అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ఇస్తాం. వారిని ఇప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రతి అంతస్తులో దాదాపు 5 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 12 గదులు రెండు గదుల ఫ్లాట్లుగా ఏర్పాటు చేశారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రక్షణ చర్యలు చేపట్టాం” అని తెలిపారు. VIDEO | Fire breaks out in a residential building in Mamura village in Noida. Rescue operations underway. More details are awaited. (Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/SpfsoCaow7— Press Trust of India (@PTI_News) July 15, 2026VIDEO | Noida, Uttar Pradesh: Fire breaks out in a residential building in Mamura village. Rajeev Narain, Joint Commissioner, Gautam Buddha Nagar, says, "Information was received about a fire in Mamura village, which falls under Sector 66 and the Phase-3 police station limits.… pic.twitter.com/Q9E04f5faw— Press Trust of India (@PTI_News) July 15, 2026 -
బ్యాంకాక్ బార్లో అగ్నిప్రమాదం.. 27 మంది సజీవదహనం
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక బార్లో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్పటివరకూ పార్టీలో ఎంజాయి చేస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఈ ఘోర ప్రమాదంలో 27 మంది మరణించగా, 63 మంది గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.దీంతో వెంటనే వివరాలు తెలుసుకున్న అగ్మిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయత్నం చేసింది. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే భవనంలో అధిక భాగం కాలిపోయిందని పేర్కొన్నారు.అయితే ప్రమాదసమయంలో అక్కడే ఉన్న ఓ సంగీతకారుడు మాట్లాడుతూ" కరెంట్ పోవడానికి కొద్దిసేపటి ముందు, వేదిక దగ్గర ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుండి పొగ రావడం సంభవించింది. ఆ వెంటనే పెద్ద పేలుడు సంభవించడంతో, పబ్ మొత్తం ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. దీంతో చాలా మంది భవనం వెనుక ఉన్న మరుగుదొడ్డిలోకి పారిపోయారు. అక్కడ కొంతమంది అక్కడ ఊపిరాడక మరణించారు అని చెప్పారు.అయితే పొగరావడం గమనించిన వెంటనే స్పందించిఉంటే ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం సంభివించి ఉండేది కాదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని థాయ్ ప్రధానమంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. حريق ضخم بملهى ليلى فى بانكوك يؤدي الى مقتل ٢٧ شخص شوفوا المقطع pic.twitter.com/6PKxjTmy9q— ابن المرقاب (@abnalmerqab) July 14, 2026 -
మంటల్లో కారు.. ఢిల్లీ టన్నెల్లో టెక్నాలజీతో తప్పిన ముప్పు!
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం!
-
బ్యాంకాక్ పబ్ లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
-
కానూరు ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ/పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా ఇండ్రస్టియల్ ఎస్టేట్ (కొత్త ఆటోనగర్)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి. పెనమలూరు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.శేఖర్ అనే వ్యక్తి కానూరు ఆటోనగర్‌లో బస్సుల మరమ్మతుల షెడ్డును నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆ షెడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రైవేట్ బస్సులు మరమ్మతుల కోసం వచ్చాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు షెడ్డులో కార్మీకులు పని చేస్తారు.అయితే, షెడ్డు యజమాని శేఖర్ తన కార్మీకులకు గుంటూరు జిల్లా మోరంపూడిలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో అందరూ వెళ్లారు. ఆదివారం షెడ్డు మూసి ఉంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు షెడ్డు గ్యారేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాచ్మెన్ వెంటనే సమీపంలో ఉన్న కార్మీకులకు చెప్పడంతో కొందరు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.అదే సమయంలో షెడ్డు యజమాని బంధువు తన సెల్ఫోన్లో సీసీ కెమెరా లింకు ద్వారా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మూడు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. అప్పటికే ఐదు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. మరో రెండు పాక్షికంగా దగ్ధమయ్యాయి. సీసీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే... ఈ ప్రమాదంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. పాక్షికంగా కాలిన బస్సుల నంబర్ల ఆధారంగా పరిశీలన చేయగా, వాటికి ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణంగా ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని, గ్యారేజీ యజమాని వచ్చాక సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తేలుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి వరకు షెడ్డు యజమాని అందుబాటులోకి రాలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం వరకు వేచి చూస్తామని, అప్పటికి ఆయన అందుబాటులోకి రాకపోతే తామే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తామని తెలిపారు. -
బ్యాంకాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక ప్రముఖ పబ్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించి 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బ్యాంకాక్ చటుచాక్ జిల్లాలోని ‘రోంగ్ బీర్ నా లాడ్‌ప్రాయో’ పబ్‌లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ఉక్కిరిబిక్కిరి చేసిన దట్టమైన పొగఅధికారుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పబ్ ప్రవేశ ద్వారం వద్ద మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న కస్టమర్లు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పలువురు కస్టమర్లు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మృతదేహాలు పబ్‌లోని రెస్ట్‌రూమ్‌లలో లభ్యమవడం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.ఘటనా స్థలానికి చేరుకున్న ప్రధానిప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు స్టేషన్ల నుండి వాహనాలతో తరలివచ్చి దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో 27 మంది మరణించినట్లు ఆయన అధికారికంగా ధ్రువీకరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పబ్‌లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.గతాన్ని గుర్తుచేస్తున్న విషాదంఈ ప్రమాదం థాయ్‌లాండ్‌లో గతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదాలను గుర్తుకు తెస్తోంది. 2022లో తూర్పు థాయ్‌లాండ్‌లోని ఒక మ్యూజిక్ పబ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. అంతకుముందు 2009లో బ్యాంకాక్‌లోని శాంతికా నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 🚨 SENSITIVE FOOTAGE: Distressing footage shows survivors scrambling to escape a deadly fire at a restaurant in Bangkok’s Chatuchak district.Reports say 27 people have died and many others were injured as authorities investigate.#Bangkok #Thailand #Fire #BreakingNews #Emergency https://t.co/jR3BdURx96 pic.twitter.com/iuM3Z9rQX2— Rosa News Official (@Mirha1206) July 12, 2026 -
రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే క్యారేజ్ రిపేర్ షాపులో భారీగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం సంభవించింది. అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ మెకానికల్ షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల ధాటికి పలు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా, ప్రమాదానికి గత కారణాలు తెలియాల్సి ఉంది. -
స్పెయిన్‌లో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
దక్షిణ స్పెయిన్‌లోని అల్మేరియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో ఆరుగురి మృతదేహాలు లభించడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.కాగా దీనివల్ల జరిగిన ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదుకాగా "లోస్ గల్లార్డోస్" ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటివల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. . -
జనగామ కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, జనగామ: పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ లాకర్ రూమ్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనతో బ్యాంకు ఆవరణ మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.మంటలు ప్రారంభమైన వెంటనే బ్యాంకు సిబ్బంది ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫోమ్‌తో పాటు నీటిని ఉపయోగించి వాటిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగను పూర్తిగా తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కొన్ని మైనర్ డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు సమాచారం. -
టోల్‌గేట్‌పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి)లోడ్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగు చూడటంతో వైరల్‌గా మారింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అకస్మాత్తుగా అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.మంటలను అదుపులోకి తీసుకు రావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.Remember the horrific fire at Sihori Toll Plaza on 26 June 2026?Four people lost their lives. Many others were left critically injured and are still battling for recovery.The CCTV footage now confirms the LPG tanker slammed into the divider, overturned, and only then… pic.twitter.com/m9ens5h2xx— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) July 3, 2026 ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీఈ ఘటనలో ధర్మేంద్ర దుబే (40) డ్రైవర్, అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాలోని పలువురు ఇతర కార్మికులు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి కొద్దిసేపు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఒక టెక్నికల్ టీంను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 16 పత్రాలిచ్చినా; సిటిజెన్‌షిప్‌పై గౌహతి కోర్టు సంచలన తీర్పు -
ఆర్టీసీని వణికించిన చైనా బ్యాటరీ
సాక్షి, హైదరాబాద్: చైనా బ్యాటరీ ఆర్టీసీని వణికిస్తోంది. దాదాపు వేయి ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్న ఆర్టీసీకి ఇప్పుడు వాటిల్లో చైనా తయారీ బ్యాటరీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఆ బ్యాటరీల నుంచి వచ్చే మంటలు బస్సులను దహించేస్తున్నాయి. దీంతో ప్రయాణికులున్న సమయంలో బస్సులు మండితే ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉండటమే దీనికి కారణం. మూడునాలుగు రోజుల తర్జనభర్జన తర్వాత, గత రెండు ప్రమాదాలకు గురైన జేబీఎం కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రమాదాలకు కారణాలేంటి, భవిష్యత్‌లో మళ్లీ ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలేమిటి అన్న విషయంలో, ఆ బస్సులను అద్దెకిచ్చిన జేబీఎం కంపెనీ నుంచి సంతృప్తికర స్పందన వచ్చేవరకు ఆ బస్సులను డిపోలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంపెనీకి చెందిన 500 ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి. బ్యాటరీలతోనే... నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన బస్సుల్లో, ఢిల్లీ ఫరీదాబాద్‌లోని జేబీఎం కంపెనీకి 500 బస్సుల సరఫరా టెండర్ దక్కింది. తన సొంత తయారీ బస్సులను ఆ సంస్థ ఏడాదిన్నర క్రితం ఆర్టీసీకి సరఫరా చేసింది. గ్రాస్‌కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ సంస్థ అద్దె ప్రాతిపదికన ఆ బస్సులను వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్‌లో తిప్పుతోంది. ఇటీవల ఆ బస్సుల్లో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ బస్సుకు నిప్పంటుకోగా, గత నెల 21న మరో బస్సు బుగ్గయింది. ఈ ప్రమాదానికి సంబంధించి నివేదిక అందేలోపే మూడు రోజుల క్రితం మరో బస్సు డిపోలో ఉండగా దగ్ధమైంది. వెంటవెంటనే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవటం, రెండింటిలోనూ బ్యాటరీ నుంచే నిప్పు రావటంతో బ్యాటరీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆర్టీసీ నిర్ధారణకు వచ్చింది. వెంటనే విషయాన్ని జేబీఎం సంస్థకు తెలిపి, కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆ కంపెనీ సాంకేతిక సిబ్బందితోపాటు బ్యాటరీ తయారు చేసిన చైనా కంపెనీ సిబ్బంది కూడా తెలంగాణకు వచ్చి బస్సులను పరిశీలించారు. కంపెనీకి షరతులు అద్దె ప్రాతిపదికపై తిప్పుతున్నందున, ఆ బస్సులను సురక్షితమైనవని నివేదిక ఇచ్చేంతవరకు డిపోలకే పరిమితం చేస్తామని ఆర్టీసీ ఆ సంస్థకు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. » ప్రస్తుతం సమస్యకు కారణమేమిటో స్పష్టంగా తెలపాలి. శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు వివరించాలి. » హైదరాబాద్ బస్‌భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ బస్సుల పనితీరును స్వయంగా పరిశీలించాలి. » చైనా తయారీ బ్యాటరీ సురక్షితమని నమ్మకం కలిగించాలి. ఇక బస్సులు తిరిగి తిప్పేందుకు అన్ని విధాలా సురక్షితం, సిద్ధమని లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలి. కంపెనీ నమ్మకమైందే.. చైనా బ్యాటరీలతోనే సమస్యలు ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన జై భారత్ మారుతీ ఆటో లిమిటెడ్ కంపెనీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా 3,500 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ ఆర్టీసీల్లో అద్దె ప్రాతిపదికన తిప్పుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులను విమానాల వద్దకు చేర్చే ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఈ సంస్థ తిప్పుతోంది. బస్సుల తయారీలో ఈ సంస్థకు మంచి పేరే ఉంది. కానీ, బ్యాటరీలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకేసారి 500 బస్సులను నిలిపేయటంతో ఆయా రూట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పేర్‌లో ఉన్న 300 సాధారణ డీజిల్ బస్సులను ఆయా రూట్లలో ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో లగ్జరీ బస్సులను ఆయా రూట్లలోనికి మళ్లిస్తున్నారు. కానీ, మరిన్ని బస్సులు వస్తేనే సర్వీసులను పునరుద్ధరించే వీలుంటుంది. -
బెల్జియం అపార్ట్మెంట్లో మంటలు
ఆంట్వెర్ప్: బెల్జియంలోని ఆంట్వెర్ప్ నగర శివారులోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెల్డర్ నది సమీపంలోని లింకెరోవర్ జిల్లా పరిధిలోని ఈ పది అంతస్తుల భవంతి గ్రౌండ్ ఫ్లోర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఎనిమిదో అంతస్తులో అనూహ్యంగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ భవంతిలోని 80 ఫ్లాట్లలో 200 మందికిపైగా నివసిస్తున్నారు.ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టంగా అలుముకున్న పొగతో భవనంలో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భవంతిలోని పై అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా పదో అంతస్తు దారుణంగా కాలిపోయింది. విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అగ్నికీలలను ఆర్పే ప్రయత్నంచేశారు.అత్యంత ఎత్తులో మంటలు చెలరేగుతుండటంతో అగ్నికీలలను ఆర్పడం ఫైర్ విభాగ సిబ్బందికి సమస్యగా మారింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎనిమిదో అంతస్తులో దట్టంగా కమ్ముకున్న పొగ మధ్యలోంచి ఒకతను బయటకు వేలాడుతూ రక్షించండి అని అరుస్తున్న వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్ఫూర్తితో ఆయన నెమ్మదిగా పక్కకు జరిగి వేరే కిటికీ ద్వారా బయటపడ్డారు. -
బెల్జియాన్ని వణికించిన భారీ అగ్నిప్రమాదం!
-
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక పలువురు దుర్మరణం
బ్రస్సెల్స్: యూరప్ దేశమైన బెల్జియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 200 మంది నివాసముంటున్న ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బెల్జియం మీడియా కథనాలు ప్రకారం.. బెల్జియం ఉత్తర ప్రాంతంలోని ప్రముఖ నగరమైన యాంట్వెర్స్లోని లింకెరూవర్ అనే నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం (జూలై 1) ఉదయం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 9:53 గంటలకు అగ్నిప్రమాదంపై ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. 10 అంతస్తుల భవనంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. అపార్ట్మెంట్ లోని 8వ అంతస్తులో మొదట భయంకరమైన మంటలు ప్రారంభమయ్యాయి. అది క్షణాల్లోనే పై అంతస్తులకు కూడా వ్యాపించింది. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ కారిడార్లలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దాంతో మెట్ల గుండా కిందకు రాలేక, లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక కొందరు మరణించారు. ప్రాణభయంతో కొందరు నివాసితులు కిటికీలు, బాల్కనీల నుండి బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేశారు. తీవ్ర భయాందోళనల మధ్య కొందరు అపార్ట్‌మెంట్‌పై నుండి కిందికి దూకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు పక్క రూముల బాల్కనీల ద్వారా తప్పించుకున్నారు.సమాచారం అందిన వెంటనే వేర్వేరు జిల్లాల నుండి భారీగా ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పెషల్ లాడర్స్ సాయంతో బాల్కనీల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్థానిక ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. బెల్జియం ప్రభుత్వం అక్కడ 'మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్' యాక్టివేట్ చేసింది. బిల్డింగ్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని వెతకడానికి ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లతో పాటు స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్లను కూడా రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకోవడంతో, స్థానిక ప్రజలెవ్వరూ కిటికీలు, తలుపులు తెరవద్దని, వెంటిలేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. -
కరీంనగర్లో మరో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. 15 రోజుల క్రితం అలుగునూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. మంగళవారం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదే జిల్లాలో జూన్ 21న అలుగునూర్ శివారులో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించడంతో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బ్యాటరీ బాక్స్ నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మూడు ఫైర్ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.తాజాగా మరోసారి అదే జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, బ్యాటరీల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజా ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో వణికిన ప్రాంతం!
-
పశ్చిమ బెంగాల్: రిఫైనరీలో లీకేజీ.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా ఆయిల్ రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా రవాణా చేసే ప్రధాన పైప్‌లైన్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. VIDEO | West Bengal: A massive fire broke out suddenly in naphtha-carrying pipeline at the Haldia Refinery between 4.00-4.30 AM on Tuesday. Several workers were reportedly injured in the incident. More details are awaited.#Haldia #Fire(Full video available on PTI Videos -… pic.twitter.com/Nz7uHdlIgS— Press Trust of India (@PTI_News) June 30, 2026తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్ నుంచి మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పలువురు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. రిఫైనరీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో హల్దియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.ఇది కూడా చదవండి: ‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం -
22వ అంతస్తులో పేలిన ఏసీ!.. భారీ అగ్నిప్రమాదం
మరో భారీ అగ్నిప్రమాదంతో దేశ రాజధాని రీజియన్ ఉలిక్కి పడింది. నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ యూనిట్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.నోయిడా సెక్టార్-119లో ఉన్న అరణ్య సొసైటీలో సోమవారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలికి గౌతమ్‌బుద్ధ్‌నగర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO), స్థానిక పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అపార్ట్మెంట్లోని ఇతర నివాసితులను అప్రమత్తం చేస్తూ, మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.Fire breaks out in a high rise in sector 119, #Noida pic.twitter.com/82ZkYvGNFl— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 29, 2026ప్రస్తుతం వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.. ఇదిలా ఉండగా ఢిల్లీలో మాత్రం ఉష్ణోగ్రతలతో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. పగటి పూటే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి మించి నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీలు వాడాల్సి వస్తుండగా.. షార్ట్ సర్క్యూట్‌తోనే నోయిడా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కూలర్లు, ఏసీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పౌరులకు సూచిస్తున్నారు. -
భారీ అగ్నిప్రమాదం.. 30 షాపులు దగ్ధం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 30 షాపులు దగ్ధమయ్యాయి. షాపుల్లో ఉన్న కూరగాయలు, సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. -
ఆ ఉద్యోగమే నా భర్త ప్రాణం తీసింది..!
సాక్షి, అనకాపల్లి: ‘గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడకపోయి ఉంటే.. నా భర్త నా బతికుండేవాడు’ అంటూ పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు వేపాడ వెంకటేష్ భార్య కోమలి కన్నీరుమున్నీరైంది. తన భర్త గతంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడని, ఆ ఫ్యాక్టరీ మూతపడడంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పింది. కుటుంబ పోషణకు మరో దారి లేక మూడు నెలల క్రితమే పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా సంస్థలో చేరాడని తెలిపింది. ఆ ఉద్యోగమే తన భర్త ప్రాణాలను బలిగొంటుందని ఊహించలేకపోయానని కన్నీటిపర్యంతమైంది. తనతో పాటు ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ గుండెలవిసేలా కోమలి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ఇంత ప్రమాదం జరిగి, తన భర్త చనిపోయి నా..కంపెనీ యాజమాన్యం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆమె వాపో యింది. ఎప్పటిలాగే ఈరోజూ ఉదయం 6 గంటలకు తన భర్త క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేశానని, కానీ ఎంతసేపటికీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పింది. చాలాసార్లు ప్రయతి్నంచగా, చివరికి ఒక కానిస్టేబుల్ ఫోన్ ఎత్తి, కంపెనీలో ప్రమాదం జరిగిందని చెప్పి ఫోన్ పెట్టేశాడని ఆమె వాపోయింది. అప్పటికే వెంకటేష్ చనిపోయినా ఆ విషయాన్ని యాజమాన్యం కానీ, అక్కడి వారు కానీ చెప్పకుండా దాచారని తెలిపింది. తమకు సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. వెంకటేష్ కోమలి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాపకు ఆరేళ్లు, రెండో పాపకు మూడేళ్లు, చిన్న పాపకు ఏడాదిన్నర మాత్రమే.నాన్న ప్రేమను పూర్తిగా చవిచూడని పసి వయసు వారిది. వెంకటేష్ మృతితో ఆ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారిందని కోమలి ఆవేదన వ్యక్తం చేసింది. -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యోగ్ భవన్ సమీపంలోని స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ఘటనాస్థలికి 20 ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ ప్యానల్లో మంటలు చెలరేగి, అక్కడి నుంచి సమీపంలోని గుడిసెలకు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. #WATCH | Delhi | Fire fighting operations underway in the slums near Udyog Bhawan area. 20 fire fighting units present at the scene. Further details awaited. pic.twitter.com/jS18iArG7L— ANI (@ANI) June 23, 2026 VIDEO | Delhi: Fire breaks out in temporary shelter for workers near Udyog Bhawan. Firefighting operations underway. More details are awaited.#DelhiNews #Fire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/wD9u9ewCeL— Press Trust of India (@PTI_News) June 24, 2026 -
మళ్లీ మరో విషాదం!
దేశంలో మూడు వారాలలోపే మరో ఘోరం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్ మంటల్లో చిక్కుకోవటంతో నలుగురు బాలికలతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు 25 యేళ్ల లోపువారే. మృతుల్లో దాదాపు అందరూ కాలిన గాయాలతోకాక, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక మరణించిన వారే కావటం గమనించదగ్గది. నివాసగృహ సముదాయాలైనా, వాణిజ్యభవనాలైనా నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. భవన నిర్మాణ సమయంలోనే నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం దరఖాస్తు చేసుకోవటం, అధికారుల తనిఖీలు నిబంధనల ప్రకారం జరిగితీరాలి. ఒకసారి కాదు... భవనం పూర్తయ్యేలోగా రెండు మూడు సార్లు ఈ తనిఖీలుండాలి. అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా లేదా... అను కోని విపత్తు ముంచుకొచ్చినప్పుడు తప్పించుకోవటానికి అత్యవసర మార్గాలు ఏర్పాటు చేసుకున్నారా లేదా అనే అంశాలు వీటిల్లో తప్పనిసరి. ఎన్ఓసీకి చెల్లుబాటయ్యే కాలం పూర్తయినాక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ అన్ని తనిఖీలూ ఉంటాయి. ఇవన్నీ కాగితాల్లో పొందుపరిచినంతగా ఆచరణలో కనబడవు. సమస్య మూలం అక్కడేవుంది.లక్నోకూ, ఢిల్లీకీ మధ్య ఏమంత దూరం లేదు. ఢిల్లీలో ఈ నెల మొదట్లో జరిగిన రెండు విషాద ఘటనల్లో 30 మంది వరకూ మరణించారు. అనేకులు గాయపడ్డారు. మొదటి ఉదంతంలో అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. రెండో ఘటన ఒక హోటల్ మంటల్లో చిక్కుకోవటానికి సంబంధించింది. ఇవి రెండూ మూడు రోజుల వ్యవధిలో జరిగాయి. కానీ ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. ‘విషాదం చోటుచేసుకున్నది ఎక్కడో కదా... మనకేమిటి సంబంధమ’ని భావించే ధోరణి అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయిన పర్యవసానంగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి తప్పడం లేదు. లక్నోలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆవాసానికే అనుమతు లున్నచోట వాణిజ్య కార్యకలాపాలు సాగుతుంటే అధికారుల్లో ఏ ఒక్కరికీ పట్టలేదు. లక్నో అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు దీన్ని కూల్చటానికి 2016లో నోటీసు లిచ్చినా రెండు నెలల తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలియదు! ఇలా ఏదో ఒక విభాగానికి సర్వాధికారాలూ ఇవ్వటం సమస్యలకు కారణ మవుతున్నది. స్థానిక పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, భవన నిర్మాణ నిపుణులు వగైరాలతో కమిటీ ఏర్పరిచి, నిర్దిష్ట వ్యవధిలో అది తప్పని సరిగా సమావేశమయ్యేలా... అనుమతులకూ, నిరాకరణలకూ స్పష్టమైన కారణాలు నమోదు చేసేలా ఉంటే ఇలా లోపాయికారీ వ్యవహారాలు సాగవు. కానీ మన ప్రభు త్వాలు ఆ పని చేయవు. ఘటన జరగ్గానే రావటం, సానుభూతులూ, సంతాపాలూ, ఎక్స్‌గ్రేషియా ప్రకటనలు మాత్రం రివాజు.అగ్నిప్రమాదం గురించి తెలిశాక ఏకంగా 19 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కానీ చాలాసేపటివరకూ ప్రమాదంలో చిక్కుకున్న భవంతిలోకి వెళ్లటం శక్యం కాలేదు. ఆ భవంతికి ఇరుకైన మెట్ల దారి మినహా మరేం లేకపోవటంతో పక్క భవనాలనుంచి అప్పటికప్పుడు నిచ్చెనలు వేసి ఆ భవనంపైకి చేరుకుని పనిచేయాల్సివచ్చింది. బయటపడే మార్గం లేక వాష్‌రూంలో చేరి నలుగురు పిల్లలు కాపాడమంటూ ఫోన్లలో తమ తల్లిదండ్రులను వేడుకున్నారు. బయటకు వినపడేలా ఆర్తనాదాలు చేశారు. కానీ ఈలోగానే మృత్యుధూమం వారిని కాటేసింది.అవి నివాస భవనాలైనా, వాణిజ్య సముదాయాలైనా తొలినాళ్ల అంచనాకు మించి విద్యుత్ వినియోగం ఉంటుంది. అధిక శక్తిగల విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగటం, వాటికి అనుగుణమైన వైరింగ్ లేకపోవటంవల్ల లోడ్ ఎక్కువై షార్ట్ సర్క్యూట్ జరిగిమంటలంటుకుంటాయి. నిర్మాణానికి వాడేవన్నీ మండే స్వభావంగలవి కావటంతో మంటలు పెనువేగంతో వ్యాపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఢిల్లీలోనే ఆసుపత్రుల్లో 78 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నివాసప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రమాదాలు సంభవించాయి. లక్నో విషాదమైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించకపోతే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. -
పరవాడ ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వైఎస్ జగన్ కోరారు. -
లక్నో అగ్నిప్రమాదం: మరణంలోనూ వీడని స్నేహబంధం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆలీగంజ్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం 15 మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో కాన్పూర్‌కు చెందిన ఇద్దరు ప్రాణస్నేహితులు, యానిమేషన్ స్టూడియో సహోద్యోగులు అయిన సంయమ్ విజ్ (28), సూరజ్‌భన్ సింగ్ (25) కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.నాన్నమ్మ అంత్యక్రియలకు రావాల్సిన వాడు..కాన్పూర్‌లోని గోవింద్ నగర్ బ్లాక్-11 నివాసి అయిన సంయమ్ విజ్ కుటుంబం ఇప్పటికే శోకంలో మునిగి ఉంది. ఇటీవలే సంయమ్ నానమ్మ మరణించగా, మంగళవారం రోజున ఆమె 13వ రోజు ఆబ్ధికం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంయమ్ లక్నో నుంచి ఇంటికి రావాల్సి ఉండగా, అంతలోనే అతను మరణించాడనే వార్త కుటుంబ సభ్యులను కుదిపేసింది. కొన్ని సంవత్సరాల క్రితమే తండ్రి పుష్పరాజ్ విజ్ మరణించడంతో, సంయమ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు.తల్లికి తెలియని కొడుకు మరణవార్తమరో మృతుడు కాన్పూర్ బర్రా-7 నివాసి అయిన సూరజ్‌భన్ సింగ్ కథ కూడా గుండెల్ని పిండేసేలా ఉంది. తండ్రి లేని ఆ కుటుంబంలో తల్లి మీరా దేవి, తమ్ముడు సామ్రాట్లకు సూరజ్భనే ప్రధాన ఆధారం. ప్రతి వారాంతంలో ఇంటికి వచ్చే సూరజ్‌భన్, ఆదివారమే తిరిగి లక్నోలో విధులకు హాజరయ్యాడు. అదే తన చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కొడుకు మరణవార్త వింటే ఎక్కడ గుండె పగిలిపోతుందోనని, ఆమె అనారోగ్యానికి గురవుతుందనే భయంతో బంధువులు ఇప్పటివరకు ఆ తల్లికి ఈ చేదు నిజం చెప్పలేదు.మరణంలోనూ విడిపోని స్నేహంసంయమ్, సూరజ్‌భన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఒకే యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగంలో చేరారు. చివరకు మరణంలోనూ కలిసేవున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నిపుణులు ఇలా అకాల మరణం చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల గురించి చర్చించుకోవాల్సిన ఇళ్లలో ఇప్పుడు అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు! -
లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!
అలీగంజ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘోర విషాదం వెనుక నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నివాస గృహంగా అనుమతి పొందిన ఒక భవనాన్ని, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేయడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.అనుమతి నివాసానికే.. వ్యాపారం మాత్రం కోట్లలోలక్నో డెవలప్మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం.. ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఈ అంతస్తుల భవనానికి 2014లో కేవలం ‘నివాస భవనం’గానే అనుమతి లభించింది. రామేశ్వరం గ్రూప్‌నకు చెందిన వీరేంద్ర ప్రసాద్ శుక్లా, సురేంద్ర ప్రతాప్ శుక్లా, ధీరేంద్ర ప్రతాప్ శుక్లాల పేరిట ఈ ప్లాన్ ఆమోదం పొందింది. ఆ తర్వాత కాలంలో ఈ ఆస్తి చేతులు మారింది. కాగితాల్లో ఇది నివాస ప్రాంతంగానే ఉన్నప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి ఇందులో ఆఫీసులు, యానిమేషన్ శిక్షణ కేంద్రాలు వంటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎలాంటి కమర్షియల్ అనుమతులు గానీ, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ (అగ్నిమాపక శాఖ అనుమతి) గానీ తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.బయోమెట్రిక్ లాక్ మృత్యుపాశంఈ భవనంలో కనీస అత్యవసర నిష్క్రమణ మార్గం లేకపోవడం, పైకప్పు కు వెళ్లే దారిని మూసివేయడం పెద్ద తప్పిదాలని అధికారులు పేర్కొన్నారు. అన్నింటికంటే దారుణంగా, ఈ కోచింగ్ సెంటర్ ఎంట్రీ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ మెకానిజం, ప్రమాదం జరిగిన సమయంలో కరెంట్ పోవడంతో పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక, దట్టమైన పొగలో ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినప్పటికీ, ఈ లోపభూయిష్టమైన భవన నిర్మాణం వల్ల సహాయక చర్యలు అత్యంత కఠినంగా మారాయి.మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంఈ దందాలో స్థానిక మున్సిపల్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 2022 నుండి ఈ భవనం నుండి ‘కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్’ వసూలు చేస్తోంది. అంటే, ఇక్కడ నివాస భవనంలో వ్యాపారం సాగుతోందనే విషయం అధికారులకు ముందే తెలుసు. అయినా వారు కళ్లు మూసుకున్నారు. ఈ ఘోరానికి కారణమైన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ల్యాండ్ యూజ్ మార్పిడిని పట్టించుకోని మాజీ ఎల్డీఏ సిబ్బంది, ఇంజనీర్లతో సహా మొత్తం 16 మంది అధికారుల జాబితాను సిద్ధం చేసి, వారిపై కఠిన చర్యలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.ఇది కూడా చదవండి: కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి -
అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
యూపీ: లక్నోలోని కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.ప్రమాదం ఎలా జరిగింది?ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 22, 2026 -
కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకే ప్రమాదంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం మరింత కలచివేసింది.సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుండి దూకే క్రమంలో తొక్కిసలాటలో మరణించారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్‌ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న వెంటనే లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో 14 అగ్నిమాపక వాహనాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఐదారు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతుల సంఖ్య 14కి చేరింది.ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
తిమ్మాపూర్/విద్యానగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (టీజీ 02టి1138) ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఉదయం 8.20 గంటలకు అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ దాటాక బ్యాటరీలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే బస్సును రోడ్డు పక్క ఆపేశాడు.బస్సు తలుపులు, ఎమర్జెన్సీ తలుపులు తెరిచి ప్రయాణికులను బయటకు పంపించాడు. బస్సులోని అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు తప్పాయి. ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.వెంకన్న, కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్, కరీంనగర్ ఆర్ఎం బి.రాజు, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ రవీందర్ పరిశీలించారు. డ్రైవర్ ప్రశాంత్ సమయస్ఫూర్తిని అభినందించి రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎల్ఎండీ సీఐ రమేశ్, ఎస్ఐ అన్వర్ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
గాజువాకలో భారీ అగ్నిప్రమాదం పరుగులు తీసిన జనం
-
రెయిన్బో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల ఆందోళన
సాక్షి, విజయవాడ: విజయవాడ రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ వార్డులో అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో పిల్లలు, రోగులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, ప్రమాదంలో అంతా సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. లోపలు పొగలు, మంటలు వ్యాపించడంతో ఆందోళన చెందారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంపై సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.అనంతరం, విజయవాడ రెయిన్బో అగ్ని ప్రమాదంపై ఏపీ ఫైర్ డైరెక్టర్ మురళీ మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఇదే ఘటన రాత్రి జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ప్రమాదం సమయంలో మొత్తం ఆసుపత్రిలో 12 పిల్లలు ఉన్నారు. 10 రోజుల క్రితమే ఈ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ చేశాం. ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉండటంతో సకాలంలో మంటలు అదుపులోకి వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాణాలు పాటించడం వల్ల అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పేషెంట్లను పక్కనే ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు. -
మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం తీవ్రతతో ఎగిసిపడుతున్న మంటలకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో ప్రమాద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. -
కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.తుగ్లకాబాద్‌లోని టీకేడీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.నిప్పు ఎందుకు అంటించింది? దర్యాప్తు సమయంలో గోవింద్‌పురిలోని నవజీవన్ క్యాంప్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్‌పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.“5వ అంతస్తులో నివసించే దీపక్‌కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్‌కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్కాజీ-గోవింద్ పురి ఫ్లైఓవర్ సమీపంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి ఆరు ఫైర్ టెండర్లను తరలించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.రెస్టారెంట్ పైఅంతస్తులో అగ్నికీలలుసౌత్ ఢిల్లీలోని దేశ్‌బంధు గుప్తా కాలేజీ సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ కమ్ బ్యాంకెట్ హాల్లోని పై అంతస్తులో నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో ఈ మంటలు ప్రారంభమైనట్లు ఎస్డీఎం వేద్ ప్రకాష్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు, అయితే అసలు కారణాలపై పూర్తి విచారణ జరుపుతున్నారు.సురక్షితంగా బయటపడ్డ జనంఅగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి తృటిలో పెద్ద ప్రమాదాన్ని నివారించారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో రెస్టారెంట్ పక్కనే ఉన్న భవనం నుండి ఒక వృద్ధురాలిని సిబ్బంది రక్షించారు. అలాగే పక్క భవనాల్లో ఉన్న మిగతా నివాసితులందరినీ వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న 10-12 మంది సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలుకొద్దిరోజుల క్రితమే దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కల్కాజీ వద్ద మరో ప్రమాదం జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అగ్నిమాపక బృందాలు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తూ, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపడుతున్నాయి. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య
-
4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి
కోల్‌కతా: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఇది బహుళ అంతస్తుల భవనం. ఇందులో ఎన్నికల సంబంధిత విభాగాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. శుక్రవారం ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయోగించిన 4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని బెంగాల్ ఫైర్ సర్వీసుల శాఖ మంత్రి కౌశిక్ చౌదరి చెప్పారు. మొదట కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా 8, 9 అంతస్తులకు వ్యాపించాయి. ఈ రెండు అంతస్తుల్లోనే ఎన్నికల విభాగాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నష్టం తీవ్రతను అంచనా వేసే బాధ్యతను సిట్‌కు అప్పగించారు. అగ్ని ప్రమాదంలో ఈవీఎంలు పూర్తిగా కాలిపోవడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘అగ్నిప్రమాదంలో అంతుచిక్కని రీతిలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. 4,000 కంట్రోల్ యూనిట్లు, 4,000 బ్యాలెట్ యూనిట్లు 4,000 వీవీప్యాట్లు బూడిదగా మారిపోయాయి’’అని పేర్కొంది. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్‌లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్‌లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
మూడవసారి.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం..
-
డేటా సెంటర్లో అగ్నిప్రమాదం
భారతదేశంలో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని ఒక ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్లో హఠాత్తుగా సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా.. దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ నెట్వర్క్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ‘గూగుల్ క్లౌడ్’ అధికారికంగా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సాంకేతిక సిబ్బంది నెట్వర్కింగ్ పరికరాలను అత్యవసరంగా మూసివేయడం (Emergency Shutdown) వల్ల ఈ అంతరాయం తలెత్తినట్లు కంపెనీ వెల్లడించింది.మెట్రో నగరాలపై ప్రభావండేటా సెంటర్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సదుపాయంలో అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల ఢిల్లీలోని ‘లోకల్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఫలితంగా సదరు మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా నెట్వర్క్ సామర్థ్యం ఒక్కసారిగా పడిపోయింది. ఈ సాంకేతిక లోపం కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన కొన్ని నగరాల్లో నెట్వర్క్ ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడిందని కంపెనీ తన స్టేటస్ పేజీలో స్పష్టం చేసింది. ఢిల్లీ (ఎన్సీఆర్ ప్రాంతం), ముంబై, చెన్నై, వాటి సమీప ప్రాంతాలు దీనివల్ల ప్రభావితమైనట్లు తెలిపింది.అయితే, ఈ అగ్నిప్రమాదం అసలు ఎప్పుడు సంభవించింది? దీనివల్ల ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? లేదా ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలను గూగుల్ క్లౌడ్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.వ్యాపార రంగంపై ప్రభావంప్రస్తుత డిజిటల్ యుగంలో క్లౌడ్ సేవలపైనే మెజారిటీ కార్పొరేట్ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ నెట్వర్క్ నిలిచిపోవడంతో దీని ప్రభావం గొలుసుకట్టు తరహాలో వ్యాపారాలు, వినియోగదారులపై పడింది. దేశంలోని పలు ప్రముఖ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, కంపెనీల అంతర్గత సర్వర్ వ్యవస్థలు మందగించాయి.క్లౌడ్ మార్కెట్లో గూగుల్ ప్రాధాన్యతప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ సేవల అందించే కంపెనీల్లో గూగుల్ క్లౌడ్ ప్రధానమైంది. అంతర్జాతీయంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలతో గూగుల్ క్లౌడ్ పోటీపడుతోంది. ముఖ్యంగా భారీ డేటా వాల్యూమ్లను ప్రాసెస్ చేయడానికి, అధునాతన కృత్రిమ మేధ పరికరాలను రన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు గూగుల్ క్లౌడ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఐటీ రంగాన్ని కాసేపు కుదిపేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
లోకేష్ కు చుక్కలు చూపించిన కార్మికులు దెబ్బకు అనిత ఉక్కిరిబిక్కిరి
-
కొంచమైనా సిగ్గు లేదా..లోకేష్ కు ఇచ్చిపడేసిన అమర్నాథ్
-
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కారుమూరి సంచలన నిజాలు
-
లోకేష్ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం
-
కన్నీరు పెట్టిస్తున్న చివరి ఆడియో క్లిప్
-
ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్‌లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్‌లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానేఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్‌కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. -
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
-
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?
-
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్రేషియా ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ఘటనపై కేఏ రియాక్షన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి అసలు కారణం ఇదే..
-
విశాఖలో విషాదం.. పవన్ కు కాపు జాతి షాక్
-
1,600 C వేడిలో కోడి కాలినట్టు కాలిపోయారు
-
శవాలతో బాబు బేరాలు.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
-
నిన్నటివరకు సెలవులో.. నేడు మృత్యు ఒడికి..
విశాఖపట్నం : వారం రోజుల సెలవు తరువాత విధులకు వచ్చిన ఆ ఉద్యోగి మృత్యు ఒడికి చేరడంతో ఓ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్‌కు 2018లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం ఒక కుమారుడు పుట్టాడు. ఈ నేపథ్యంలో భానుకుమార్ వారం రోజులపాటు పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు. ఆదివారం వరకు సెలవులో ఉన్న అతడు సోమవారం మధ్యాహ్నం బీ షిఫ్ట్‌కు వచ్చాడు. డ్యూటీకి వచ్చిన రెండున్నర గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అతడు సీ షిఫ్ట్‌కు రావాల్సి ఉంది. కొలీగ్ ఒకరు కోరడంతో తన డ్యూటీని బీ షిఫ్ట్‌కు మార్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి మృతి వార్తతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఏ దేవుడో కాపాడాడు..
గాజువాక: స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న హృదయ విదారక ప్రమాదంలో ఒక ఉద్యోగి తృటిలో తప్పించుకొని స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వడ్లపూడికి చెందిన గుడివాడ అర్జున అప్పారావు బీ షిఫ్ట్ విధులకు వెళ్లారు. డిపార్ట్మెంట్లో 20 అడుగుల ఎత్తులో పని చేస్తున్న ఆయన మూత్ర విసర్జనకని కిందకు దిగి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొని లాడిల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన లిక్విడ్ ఐరన్ అతడి పిరుదులపై కొద్దిగా పడటంతో స్వల్ప గాయంతో బయటపడ్డాడు. తనను ఏ దేవుడో రక్షించాడంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడని పుకారు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, అతనికి ఏమీ కాలేదని, స్వల్ప గాయం మాత్రమే అయిందనే విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం
ఒకప్పుడు అది కేవలం కల.. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ లక్షల గొంతులు మార్మోగాయి. ఆ కలను నిజం చేసేందుకు 32 మంది అమరులయ్యారు. వారి రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత వేలాది కుటుంబాలకు అన్నం పెట్టిన ఆ ఉక్కు కర్మాగారం, కాలక్రమంలో ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. 2012లో ఆక్సిజన్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం దేశంలోని ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే ఉక్కు కర్మాగారం రోదిస్తోంది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్‌లో సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే ఎనిమిది మంది కార్మికులు అగ్నిజ్వాలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ ఆరుగురు కేవలం కార్మికులు కాదు.. ఎవరికో తండ్రి.. ఎవరికో భర్త.. ఎవరికో కొడుకు.. ఎవరికో అన్న.. ఉదయం ఇంటి నుంచి ‘సాయంత్రానికి వస్తా’ అని వెళ్లిన వారు, తిరిగి శవపేటికల్లో చేరుకోవడం ఎంతటి విషాదమో కదా.. ఉక్కు తయారవ్వాలంటే ఇనుము కరిగాలి. కానీ ప్రతిసారీ మనుషుల ప్రాణాలే కరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం గేట్లను చూస్తే ఇవాళ అవి ఇనుముతో చేసిన ద్వారాల్లా కాకుండా, కన్నీటి బిందువులతో తడిసిన చరిత్ర పుటల్లా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్యమ అమరుల త్యాగాలు, మరోవైపు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కారి్మకుల జ్ఞాపకాలు.. ఈ రెండింటి మధ్య నిలబడి ఉక్కు కర్మాగారం మౌనంగా విలపిస్తోంది. ‘నన్ను నిర్మించడానికి ప్రాణాలు ఇచ్చారు.. నన్ను నడపడానికి కూడా ప్రాణాలే పోతున్నాయి..’ అని ఉక్కే కన్నీరు కారుస్తోంది. నేడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎగసిపడుతున్న పొగల్లో కేవలం ద్రవ లోహం వేడి మాత్రమే కాదు.. ఎనిమిది కుటుంబాల కన్నీటి వేడి కూడా.. ఆ కన్నీరు ఆరిపోవచ్చు. కానీ ఈ విషాదం మిగిలి్చన గాయం మాత్రం చాలా కాలం వరకు మానదు. -
Vizag Steel Plant: కూడు పెట్టే ఉక్కు గూడు కూల్చిన నిప్పు
స్టీల్‌ప్లాంట్ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదంరెక్కలొచ్చిన ఆశలతో పొద్దునే కర్మాగారంలోకి అడుగుపెట్టిన పాదాలు.. సాయంత్రానికి కరిగిన ఉక్కులో కలిసిపోయాయి. దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించే శ్రామికుడి రక్తం.. 1600 డిగ్రీల అగి్నప్రళయంలో ఆవిరైపోయింది. ఒక్కటంటే ఒక్క క్షణం.. విశాఖ ఉక్కునగరాన్ని శోకసముద్రంగా మార్చేసింది. నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దగా మారిన వేళ.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబాల ఆక్రందనలతో ఉక్కునగరం అట్టుడుకుతోంది.సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కారి్మకుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్ని సమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్ని ప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది. 1600 డిగ్రీల అగి్నప్రళయం సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఎర్రగా కాగిన హాట్‌మెటల్‌ను భారీ లేడిల్లో ఎస్ఎంఎస్కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్–2 పై లేడల్ను ప్లేస్ చేసి, రొటేట్ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్ ఫ్లోర్‌పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఊహకే అందని నరకయాతన! 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం. కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది. బతుకులు.. బుగ్గయ్యాయి ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్ స్థాయి అధికారి గోల్డ్ కుమార్ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి. మార్చురీ వద్ద ఉద్రిక్తత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించాలని అధికారులు ప్రయతి్నంచగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనా? ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కారి్మక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్నెస్ పరీక్షించకపోవడం వల్లే లాడిల్ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కలి్పంచాలని డిమాండ్ చేశారు. అమ్మని బాగా చూసుకోరాకంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నీరుమున్నీరు ‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలిగాజువాక : స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్ఎస్, రిటైర్మెంట్వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్ ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్య వైఫల్యమే.. : కేకే రాజు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రివద్ద మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. ముఖ్యంగా 30, 40 మంది పని చేయాల్సిన చోట పది, పదిహేను మందితో పని చేయిస్తున్నారన్నారు. సీనియర్ కార్మికులను ఒత్తిడి పెట్టి నయానో, భయానో వీఆర్ఎస్ తీసుకొనేలా చేశారన్నారు. దశాబ్దాలుగా పని చేసిన కాంట్రాక్టు కార్మికులను నిర్ద్వందంగా తొలగించారన్నారు. ఇలాంటి నిర్ణయాలవల్ల ఈరోజు భారీ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, దీనికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు. కనకమహాలక్ష్మి నగర్లో విషాదం గోపాలపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో జీవీఎంసీ 90వ వార్డు కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన ఎం. కృష్ణ నాగు (55) మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇటీవలే సీఎంఎం విభాగం నుంచి ఎస్ఎంఎస్కు బదిలీ అయిన ఆయన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సరైన నిర్వహణ లేకే..డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని íసీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లాడిల్ పేలి 8 మంది కారి్మకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి మోదీ, బాబులదే బాధ్యత ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం, ప్రైవేటీకరణ విధానాలే కారణమని సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ఆరోపించారు. మృతి చెందిన కారి్మక కుటుంబాలకు రూ.కోటి,గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్డేట్స్.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారుమరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారుఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైందిగత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారుఅనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణంయాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారుకార్మిక సంఘాల డిమాండ్ ఇదేస్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలికాలం చెల్లిన యంత్రాలను తొలగించి కొత్త వాటిని నిర్మించాలికార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిమృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలిక్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలిపవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలుమృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిస్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిభాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావునక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుమృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులుబిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూపుబాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్న్నాథ్, కేకేప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం: బొత్సకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందిస్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ కుట్రలుస్టీల్ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేకార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్‌ప్లాంట్ వచ్చింది అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంఘోర ప్రమాదం జరిగిన స్పందించని సీఎం చంద్రబాబు, మంత్రులునిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతివిజయవాడలోనే ఉన్నా విశాఖపట్నం వెళ్లని సీఎం చంద్రబాబుఈరోజు ఉదయం వరకు ఒక్కరు కూడా వెళ్లని రాష్ట్ర మంత్రులుకేంద్రమంత్రి కుమారస్వామి వచ్చాక వచ్చిన రాష్ట్ర మంత్రులుఈరోజు ఉదయం వెళ్లిన మంత్రి నారా లోకేష్లోకేష్ తర్వాత వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కేంద్రమంత్రి వచ్చేవరకు సంఘటన వైపు కన్నెత్తి చూడని హోంమంత్రి అనితకనీసం పట్టించుకోని జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులుఈరోజు కూడా విశాఖకు వెళ్లని సీఎం చంద్రబాబువిజయవాడలోనే సమీక్షలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబురేపు విశాఖకు వైఎస్ జగన్స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్ఆసుపత్రులలో ఉన్న క్షతగాత్రులకు పరామర్శఏపీలో రెడ్‌బుక్ అరాచకం నడుస్తోంది: గుడివాడ అమర్నాథ్కార్మిక సంఘాలను లోకేష్ అవమానించాడులోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారుఎవరికీ సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్ మాట్లాడారుకార్మికులను బెదిరించే ధోరణిలో లోకేష్ మాట్లాడారుబాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలికార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందిస్టీల్ ప్లాంట్ వద్ద లోకేశ్‌కు చేదు అనుభవంవిశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు మంత్రి నారా లోకేశ్హోం మంత్రి అనితతో ప్లాంట్ వద్దకు వెళ్లిన లోకేశ్లోకేశ్ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలులోకేశ్ను నిలదీసిన కార్మిక సంఘాలునైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహంఎంపీ భరత్, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలుకార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహంప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్ అసహనంలోకేశ్ తీరుపై మండిపడ్డ కార్మికులు👉విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.👉గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ ఎమోషనల్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. 18 మంది ప్రాణాలు కాపాడిన టీ బ్రేక్
-
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
-
ప్రమాదాలతో ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టాలు
ఉక్కునగరం(విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత యాజమాన్య ప్రతినిధులు స్పందించారని ధ్వజమెత్తారు. తీరుబడిగా ఆస్పత్రికి వచ్చి ప్రమాదం దురదృష్టకరమని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్మీకులపై యాజమాన్యం పెనుపనిభారం మోపుతోందని, కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారంపై ఇప్పటికీ పెదవి విప్పడం లేదని, సీఎండీ వచ్చి న తర్వాత ప్రకటిస్తామని, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కార్మీకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు ఏమన్నారంటే.. ఏడాదిగా చెబుతూనే ఉన్నాం ఏడాదిగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్లే ఈ పెను ప్రమాదం సంభవించింది. 20 మంది ఉండాల్సిన పని ప్రదేశంలో కేవలం 12 మందితో పని చేయించడం దారుణం. పనికిరాని వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – డి.ఆదినారాయణ, ప్రధానకార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతపై దృష్టి సారించకుండా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా కార్మీకులపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తేగలం. తీవ్రమైన ఒత్తిడితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. – మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యదర్శి, ఐఎన్టీయూసీ నాణ్యత లేని రా మెటీరియల్ వాడడం వల్లే నాణ్యత లేని రా మెటీరియల్ వాడడంతో సరైన రసాయన చర్యలు జరగకపోవడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగింది. 20 మంది ఉండాల్సిన ప్రదేశంలో 12 మంది పని చేస్తున్నారు. భద్రతను గాలికి వదిలేశారు. కార్మీకుల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో మృతదేహాలు ఉండటం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. ఇకనైనా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలి. – జె. అయోధ్యరామ్, ప్రధానకార్యదర్శి, స్టీల్ సీఐటీయూ -
ఉక్కులో.. ఉప ‘ద్రవం’!.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం / ఉక్కునగరం: బతుకుదెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కుద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ఎనిమిది మందిని సజీవ దహనం చేసింది. నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లాడెల్ నుంచి విరజిమ్మిన ద్రవపు ఉక్కు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. స్టీల్ ప్లాంట్ల చరిత్రలో తొలిసారిగా..! దేశంలోని ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీకయి ప్రమాదాలు జరిగేవి. కానీ.. ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్‌మెటల్‌ను లాడెల్‌లో ఎస్ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బీ షిఫ్ట్‌లో సీసీడీ మిషన్–2 పై లాడెల్‌ను సిద్ధం చేశారు. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్–1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సీసీడీ సెక్షన్లో లాడెల్‌ను రొటేట్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది.సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానలంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకు పోయారు. తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తూ మంటల్లో నుంచి ఇద్దరు కార్మికులు అతి కష్టమ్మీద బయటకు వచ్చారు. అతి కష్టమ్మీద అదుపులోకి.. ఎక్కడ చూసినా సలసల కాగుతున్న ద్రవపు ఉక్కుతో ఎస్ఎంఎస్–1లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం మంటలను అతికష్టమ్మీద అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయిన వారిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్ప కోసం నగరంలోని పలు హాస్పిటల్స్‌కు తరలించారు.స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచిన మృతదేహాలను కేజిహెచ్‌కు తరలించకుండా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వెల్లడించాలని, దుర్ఘటనపై యాజమాన్యం వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో మృతదేహాలను జనరల్ హాస్పిటల్ వద్దే ఉంచారు. క్షతగాత్రులను సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించిన అధికారులు ఎమర్జెన్సీ గేట్ నుంచి కాకుండా వెనక వైపు నుంచి తీసుకెళ్లారు. ఫోటోలు, వీడియోలు తీయవద్దని కలెక్టర్ చెప్పారంటూ మీడియా ప్రతినిధులను ఆర్డీవో హెచ్చరించారు. రెండు నెలలుగా 27 సార్లు లీక్..! గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించిన టీ విరామం.. సాయంత్రం సమయంలో టీ విరామం కోసం చాలా మంది కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సాధారణంగా 60 నుంచి 70 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. కానీ ఆ సమయంలో టీ విరామానికి వెళ్లిపోవడంతో 15 నుంచి 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తగ్గిందని చెబుతున్నారు. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగులు.. ⇒ గోల్డ్ కుమార్, మెకానిక్ ఇన్చార్జ్–2 ⇒ గొందిన భానుకుమార్, టెక్నీíÙయన్ ⇒ ఎం.కృష్ణ నాగ్, టెక్నీíÙయన్ ⇒ కె. ప్రభాకర్, టెక్నీíÙయన్ ⇒ జీవీ అప్పారావు కాంట్రాక్ట్ కార్మికులు.. ⇒ నక్క వెంకటరమణ ⇒ త్రినాథ్ ⇒ ఎన్.అప్పలరాజుతీవ్రంగా గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులు... ⇒ సూరిబాబు(90 శాతం కాలిన గాయాలు), పైడిరాజు(30 శాతం కాలిన గాయాలు), పల్లెల శ్రీనివాసరావు (40 శాతం కాలిన గాయాలు)లను సెవెన్ హిల్స్‌కు తరలించారు. ⇒ రావూరి మల్లికార్జునరావు , జి.అర్జున్ అప్పారావు, సత్యానంద్ బాలువ (10 శాతం కాలిన గాయాలు)లను కిమ్స్‌లో చేర్పించారు. మృతుల కుటుంబాలవైపు కన్నెత్తి చూడని హోంమంత్రి పర్యటన ప్లాంట్‌కే పరిమితం సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదం గురించి తెలుసుకున్న హోం మంత్రి అనిత సోమవారం రాత్రి ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి ఎలా జరిగిందనే వివరాల్ని అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు. కానీ సమీపంలో ఉన్న ఉక్కు జనరల్ హాస్పిటల్ వైపు వెళ్లలేదు. అక్కడ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ఓదార్చేందుకు హోంమంత్రి గానీ, ఎంపీ భరత్ గానీ రాకపోవడంపై కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం అత్యంత విషాదకరం: మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్–2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ పేర్కొన్నారు.భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధాకరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మృతుల ఆత్మలకు శాంతి కలగాలి. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి తీవ్ర ఆవేదన చెందుతున్నా స్టీల్ ప్లాంట్ ప్రమాదం కలచివేసింది. పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి అత్యంత దిగ్భ్రాంతికరం విశాఖ స్టీల్‌ప్లాంట్ దుర్ఘటన అత్యంత దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేíÙయాను ప్రకటించాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మాటలు రావడం లేదు వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలిపేందుకు మాటలు రావడం లేదు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అత్యంత బాధాకరం దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి విషాదకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. – డాక్టర్ తనూజరాణి, అరకు ఎంపీ ప్రభుత్వం ఆదుకోవాలి స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ దురదృష్టకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం. విషాద ఘటన గురించి తెలియగానే ప్లాంట్‌కు చేరుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు స్టీల్ ప్లాంట్‌లో విషాద ఘటనలివీ..విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటివరకూ జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. 2012 జూన్‌లో జరిగిన దుర్ఘటన ప్లాంట్ చరిత్రలో అత్యంత విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్లాంట్‌లో విషాద ఘటనల వివరాలివీ... ⇒ 2012 మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్–3 లో పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ⇒ 2012 జూన్ 13న విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. స్టీల్ మెల్టింగ్ షాప్–2 వద్ద ఆక్సిజన్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అధిక పీడనం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ⇒ 2014 జూన్ 16న ఎస్ఎంఎస్–2 విస్తరణ పనుల్లో భాగంగా కంటైనర్ ల్యాబ్‌ని తనిఖీ చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ లీకై ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టు ఇంజనీర్లు మృతి చెందారు. ⇒ 2020 డిసెంబర్ 18న స్టీల్ మెల్టింగ్ షాప్–2(ఎస్ఎంఎస్–2)లో వేడి ద్రవపు ఉక్కుని తీసుకెళ్తున్న ల్యాడిల్ హుక్స్ ఊడిపోవడంతో ద్రవం కింద పడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. ⇒ 2021 నవంబర్ 16న బ్లాస్ట్ ఫర్నేస్–3లో పేరుకుపోయిన స్లాగ్(వ్యర్థం) తొలగిస్తుండగా వేడి ద్రవరూప లోహం ఒక్కసారిగా ఎర్త్ మూవర్ పైకి దూసుకొచి్చంది. ఈ ప్రమాదంలో ఆపరేటర్, సూపర్వైజర్, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ⇒ 2026 మే 11న ప్లాంట్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియాలో స్వల్ప స్థాయిలో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ (కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు) లీకై నలుగురు కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ⇒ 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో దాదాపు ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రమాదాలతో ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టాలుస్టీల్ ప్లాంట్‌లో ద్రవపు ఉక్కు ప్రమాదాలే అత్యధికంగా జరుగుతున్నాయి. మెల్టింగ్ షాపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆధునికీకరించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్– జూన్ మధ్య వరుసగా జరిగిన ప్రమాదాలు స్టీల్ ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టం కలిగించాయి. ⇒ 2011 ఏప్రిల్ 10న ఎస్ఎంఎస్లో ల్యాడిల్ నుంచి సుమారు 140 టన్నుల ద్రవపు ఉక్కు కిందపడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ప్లాంట్‌కు రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. ⇒ 2011 ఏప్రిల్ 14న ఎస్ఎంఎస్ కంటిన్యుయస్ కాస్టింగ్ విభాగంలో 140 టన్నుల హాట్‌మెటల్ లీకేజీ కావడంతో రూ.60 కోట్లు నష్టం సంభవించింది. రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2011 ఏప్రిల్ 17న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మూడు కన్వేయర్ బెల్ట్‌లు తెగిపోయి 48 గంటల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2012 ఫిబ్రవరి 6న ఎస్ఎంఎస్లో భారీ స్థాయిలో హాట్‌మెటల్ స్పిల్లేజ్ కారణంగా రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. ⇒ 2012 మే 22న కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడిసరుకు తీసుకెళ్తున్న కన్వేయర్ బెల్ట్ సింటర్ ప్లాంట్ వద్ద పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.కోటి నష్టం వాటిల్లింది. -
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.కాగా గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. -
ఢిల్లీలో మళ్లీ అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్స్
న్యూఢ్లిలీ: దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కార్కర్దూమా కోర్టు కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ 4 సమీపంలో ఉన్న రెండో అంతస్తులోని స్కానింగ్ రూమ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్కానింగ్ రూమ్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.మాలవీయ నగర్ విషాదం మరువకముందే..ఇటీవలే ఢిల్లీలోని మాలవీయ్ నగర్‌లోని ఉన్న ఒక హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. -
అమీర్‌పేట ప్రమాదం.. స్పాట్‌కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్‌పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్‌కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్‌పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ముగ్గురు మృతి
-
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ మెస్ వల్లే అగ్ని ప్రమాదం.. కుండ బద్దలు కొట్టిన ప్రత్యక్ష సాక్షి
-
అమీర్‌పేటలో పొగ.. మంటలతో బెంబేలు (ఫొటోలు)
-
‘‘హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు.. అయినా’’
హైదరాబాద్: అగ్ని ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు, కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తలసాని అన్నారు. అదే విధంగా అగ్నిమాపక శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అధికారులను ఆయన అభినందించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని తలసాని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్, ప్రవీణ్ రెడ్డి, సుమిత్ సింగ్, కట్టా బలరాం, సాయి, ప్రదీప్ గౌడ్, తదితరులు ఉన్నారు. -
రూల్స్ లేవ్.. ఢిల్లీలో ఇంతే: హోటల్ యజమాని
ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2022లో 60 ఏళ్ల లవ్‌కేశ్ బజాజ్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ఇరుకైన వీధుల్లో ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి, దాన్ని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీ అండ్ బీ) సంస్థగా మార్చాలని నిర్ణయించాడు.ఆ భవనానికి త్వరలోనే ఫ్లోరిష్ స్టేస్ బీ అండ్ బీ అనే కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత అది ఐదు అంతస్తులు, ఒక బేస్మెంట్లో 26 గదుల ప్రాంగణంగా మారింది. అయితే, కేవలం 6 గదులకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.బుధవారం అదే హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అతిథులు మరణించారు. వారిలో 12 మంది విదేశీయులు. అదే రాత్రి బజాజ్‌ను అరెస్టు చేశారు.పోలీసులు ప్రశ్నించగా.. వ్యాపారం మంచి లాభాలు తెస్తుండటంతో హోటల్లో గదుల సంఖ్య పెంచానని, అలాగే ‘ఢిల్లీ మేన్ సబ్ చల్తా హై (ఢిల్లీలో అన్నీ చెల్లుతాయి)’ అనే భావనతో అలా చేశానని బజాజ్ చెప్పినట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో నిబంధనలు, పరిమితులు, ఆంక్షలు ఏమీ ఉండవనేలా, ఏదైనా చేసుకోవచ్చనేలా ఆ హోటల్ యజమాని మాట్లాడారు. పూర్తి సమయం హోటల్ నిర్వహణ చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో, అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించుకున్నానని కూడా బజాజ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అంశాలపై బజాజ్ భార్యను కూడా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు గదులకే అనుమతి ఉంటే 26 గదులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. అంతేగాక, ఆ ప్రాంగణం అంతటా సులభంగా మంటలు అంటుకునే అలంకరణ సామగ్రి ఉన్నట్లు తేలింది.బుధవారం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధికారి మాట్లాడుతూ.. అలంకరణలో భాగంగా భవనం లోపల, బయట అనేక చెక్క, ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారని, దీంతో మంటలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని చెప్పారు.బజాజ్ ఆ ప్రాంతంలో మరో రెండు ప్రాపర్టీలను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతా, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఇప్పుడు వాటినీ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మొత్తం కాలిపోయింది.. గుండె పగిలేలా ఏడ్చిన తల్లి
-
ఘోర అగ్ని ప్రమాదం..! అసలు ఏం జరిగిందంటే?
-
ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అధికారుల అవినీతి, వ్యవస్థ విఫలమై ఇలాంటి ఘోర విషాదాలు సంభవించినప్పుడు, సామాన్య పౌరులే హీరోలుగా నిలుస్తారు. అసాధారణమైన ధైర్య సాహసాలతో బాధితులను మృత్యు ముఖం నుంచి బయటపడేస్తారు. ఢిల్లీ ఘటనలో కూడా స్థానిక యువకులే ఎంతోమంది ప్రాణాలును కాపాడారు.బుధవారం ఉదయం, దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో స్థానిక నివాసితులు ఎలాంటి రక్షణాలు కవచాలు లేకుండానే రంగంలోకి దూకి ప్రాణాలకు తెగించి మరీ ఎంతోమంది బాధితులను కాపాడారు.భవనాన్ని చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, నలుదిశలా కమ్మేస్తున్న పొగ, బాధితుల హాహాకరాలు, భయాందోళనలు ఇలాంటి నిస్సహాయ వాతావరణంలో, మంటల నుండి తప్పించుకోవడానికి కిటికీల నుండి దూకుతున్న అనేకమందితో సహా, లోపల చిక్కుకుపోయి వారిని రక్షించాలనే తపనతో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ఒకరు మహమ్మద్ అఫ్జల్, మౌ.షాహరూఖ్, మౌ.అనీష్, మౌ.అమీర్, మౌ.వసీం, రియాజవుద్దీన్ గద్దె వాలా, ఇంకా స్థానికులు ఉన్నారు. VIDEO | Delhi Malviya Nagar Hospital fire: Wasim Raja, one of the first rescuers, says, "As soon as we reached the scene at around 8:50 am, the entire building was already engulfed in flames. Right across from the building, there is a mattress and quilt shop owned by Riyazuddin,… pic.twitter.com/3XGJc3n4uJ— Press Trust of India (@PTI_News) June 4, 2026మహమ్మద్ అఫ్జల్సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఎలా తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారో వివరించారు. తాము అక్కడి చేరుకునేటప్పటికే భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనీ, వెంటనే ఎదురుగా ఉన్న అర్మాన్స్' దుకాణం నుండి తెచ్చిన పరుపులను కింద పరిచి, హోటల్ నుంచి వారిని కిందకు దూకమని కోరామని తెలిపారు. కొందరు విజయవంతంగా దూకగా, మరికొందరు దూకలేకపోయారని అఫ్జల్ చెప్పారు. వీరి మాటల ప్రకారం ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో మంటలు తీవ్రమవడంతో హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్‌కు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. చివరికి, అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాంతో వీరు భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.రూ. 2 లక్షల విలువైన పరుపులుఅగ్నిప్రమాదం నుండి బాధితులను కాపాడటానికి లక్షల విలువైన పరుపులను వినియోగించారు స్థానిక దుకాణ యజమాని. అతను అతని కుమారుడు లేకపోయి ఉంటే ఈ విషాదం మరింత ఘోరంగా ఉండేది. ఆ ఇద్దరూ దాదాపు రూ. 2 లక్షల విలువైన కొత్త పరుపులను త్యాగం చేసి, అనేక ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన ఒక తాత్కాలిక రక్షణ వలయాన్ని ఏర్పరిచారు.తన సరుకుకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా, పరుపుల యజమాని తమకు సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ పరికరాలేవి అందుబాటులోలేకపోవడంతో అతని షాపులోని దుప్పట్లతోనే బాధితులను పైఅంతస్తుల నుండి జాగ్రత్తగా కిందకు దించి, ఆసుపత్రిలకు తరలించామని అఫ్జల్ చెప్పారు.వసీం రాజామరో హీరో వసీం రాజా. అత్యవసర పరిస్థితిలో తన వృత్తిపరమైన శిక్షణ కీలకమని నిరూపించారు. మాక్స్ హాస్పిటల్లో పనిచేసే రాజా, పొగ పీల్చడం వల్ల బాధపడుతున్న బాధితులకు సహాయం చేయడానికి వెంటనే తన వైద్య శిక్షణను ఉపయోగించాడు. సామూహిక ప్రాణనష్టం జరగకుండా, సీపీఆర్ (CPR) చేసి కొంతమందికి ప్రాణభిక్ష పెట్టారు. నోటి ద్వారా శ్వాస అందించి కొంతమందిని కాపాడగిలిగాం కానీ, దురదృష్టవశాత్తు మరికొందరిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు -
హైదరాబాద్: మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం
-
అమీర్‌పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్‌పేట మెట్రో జంక్షన్‌కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్‌పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది.అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్‌పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్‌పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్‌కు సమీపంలో ఉండడం, పిల్లర్‌కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్‌లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్‌రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్‌కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్‌మెంట్‌తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
ఢిల్లీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
-
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్‌గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్‌గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్‌లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్‌లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్‌లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
ఢిల్లీలో ఘోరం
న్యూఢిల్లీ: నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఢిల్లీలోని ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మసిబొగ్గులా మారింది. తమ బంధువుల శస్త్రచికిత్సలు, వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చి ఆస్పత్రి సమీప ఈ హోటల్లో బసచేస్తున్న పలువురు విదేశీయులు ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది విదేశీయులు సహా మొత్తంగా 21 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో 9 మంది ఆఫ్రికా దేశస్తులుకాగా ఇద్దరు తుర్క్మెనిస్తాన్ దేశస్తులు. పది మంది భారతీయులూ ఈ ఘటనలో చనిపోయారు. ఉదయంకావడంతో కొందరు నిద్రలోనే శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. అగ్ని ప్రమాదం విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 35 మందిని కాపాడారు. వీరిలో 16 మందికి స్వల్ప గాయాలుకాగా 19 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. హోటల్లోని అతిథులు, పోలీసులు, స్థానికులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కలిపి మొత్తంగా 58 మంది ఈ ఘటనలో ప్రభావితమయ్యారు. ఘోర అగ్నిప్రమాదం వార్త తెలిసి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సెన్సర్‌తో పనిచేసే తలుపులు మూసుకుపోయి బయటకురాలేక, అగ్నికీలల వేడిమికి తాళలేక హోటల్లోని అతిథులు కాపాడండి అంటూ చేసిన ఆక్రందనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. హోటల్ జయమాని అరెస్టునిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్వహిస్తూ ఈ ఘటనలో పలువురి మృతికి కారణమయ్యాడంటూ హోటల్ యజమాని లోకేశ్ బజాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. పరారీలో ఉన్న అతన్ని పోలీసులు రాత్రి పొద్దుపోయాక అరెస్టు చేశారు. ప్రమాదం వార్త తెలిసి రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు తలో రూ.50,000 మంజూరుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అసలేం జరిగింది? దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని హౌజ్‌రాణి ప్రాంతంలో ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ ఒక ఐదంతస్తుల భవంతిలో నడుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకంలో భాగంగా ఈ నివాస భవంతిని పేయింగ్ గెస్ట్ మాదిరిగా నడుపుతున్నారు. ఈ హోటల్లో కేవలం ఆరు గదులకు అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా 25 గదుల్లో విదేశీయులకు వసతి కల్పించారు. లైబీరియా, మొజాంబిక్, నైజీరియా, బంగ్లాదేశ్‌లకు చెందిన వ్యక్తులు ఈ హోటల్ గదుల్లో దిగారు. కిక్కిరిసిన హోటల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు ఉదయం హోటల్ కిచెన్‌లో చెఫ్ ఒక ఎలక్ట్రిక్ వస్తువును స్విచ్ఛాఫ్ చేశాక ఎలక్ట్రిక్ ప్లగ్ నుంచి మంటలొచ్చాయి. ఆర్పేలోపే గది అంతా మంటలు వ్యాపించి చివరకు భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయని స్థానికుడు ఆసిఫ్ వెల్లడించాడు. క్షణాల్లో భవనం మొత్తాన్నీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. సీల్ వేసిన కిటికీలు, ప్రతి అంతస్తులో సెన్సార్‌తో పనిచేసే తలుపులు అగ్నికీలల ధాటికి తెరుచుకోకపోవడంతో హోటల్లోని వాళ్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. చెలరేగుతున్న మంటల్ని చూసిన స్థానికులు, పరుపులు అమ్మే దుకాణదారు అర్మాన్ వెంటనే హోటల్ ముందు పరుపులు, దుప్పట్లను పరిచారు. కొందరు సాహసించి పైనుంచి వాటిపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తు నుంచి ఒక చిన్నారితో మహిళ కిందకు దూకిన వీడియో వైరల్‌గా మారింది. నాలుగో అంతస్తు నుంచి ఒక విదేశీ జంట కిటికీ అద్దాలు బద్దలుకొట్టి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలపాలైన వీళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రిలో చేరి్పంచారు. పై నుంచి దూకిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దూకిన మొహమ్మద్ సాహిదుల్ ఇస్లాం, ఆరామిన్ జమాన్, రియానాలను ఆస్పత్రుల్లో చేరి్పంచారు. ప్రమాదం విషయం తెల్సి ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలువురిని కాపాడి క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేరి్పంచారు. మృతులు, క్షతగాత్రుల్లో చాలా మంది మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల రోగులు శస్త్ర చికిత్సలు, వైద్యం కోసం గతంలో సమీప ఆస్పత్రుల్లో చేరగా వాళ్ల బంధువులు ఈ ఫ్లోరిష్ బీ అండ్ బీ హోటల్లో దిగగా అనూహ్యంగా ఈ అగ్నిప్రమాదం బారిన పడ్డారు.ఆస్పత్రుల్లో విషాద దృశ్యాలు వైద్యం చేయించుకునేందుకు తాము వస్తే తమకు సాయపడేందుకు వెంట వచ్చిన బంధువులు విగతజీవులుగా మారారని తెల్సి సమీప మ్యాక్స్, సఫ్డర్‌జంగ్, ఎయిమ్స్, పండిత్ మదన్మోహన్ మాళవీయ ఆస్పత్రుల్లోని రోగులు కన్నీటిపర్యంతయ్యారు. తమ వాళ్లు అగ్నికీలలకు బలయ్యారని తెల్సి బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘నా అల్లుడు, కూతురు తరిణి అగర్వాల్(42), 17, 20 ఏళ్ల మనవరాళ్లు ఇదే హోటల్లో దిగారు. మంటల్లో అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు కుమార్తె, మనవరాళ్ల జాడ తెలీడం లేదు’’అని ఒకతను కన్నీటిపర్యంతయ్యాడు. అగ్నికీలలు అంటుకున్న గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదే హోటల్లో దిగిన మా బంధువులు ఆరుగురూ చనిపోయారు. నలుగురి మృతదేహాలను గుర్తుపట్టా. మిగతా ఇద్దరి మృతదేహాలు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పడం లేదు’’అని నమిత్ గోయల్ అని వ్యక్తి ఏడుస్తూ చెప్పారు.అడుగడుగునా నిబంధనలు బేఖాతరు హోటల్‌ను తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కని్పంచింది. ఇరుకైన దారిలో నిర్మించిన ఈ ఐదంతస్తుల భవనం లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి కేవలం ఒక్కటే ద్వారం ఉంది. ఏడేళ్ల క్రితం ఒక్కటే పై అంతస్తు ఉండగా ఇటీవలే అనుమతుల్లేకుండా మిగతావి కట్టేశారు. ధారాళంగా గాలి వెలుతురు రాకుండా గదుల కిటికీలను సీల్‌వేసి ఉన్నాయి. పై అంతస్తుల్లో సెన్సర్‌తో పనిచేసే తలుపులు బిగించారు. అగ్నికీలలకు విద్యుత్ వైర్లన్నీ కాలిపోవడంతో సెన్సార్లు పనిచేయక తలుపులు తెరచుకోలేదు. దీంతో లోపల ఉన్న వాళ్లు మంటలకు, దట్టమైన పొగకు చనిపోయారు. ఆరు గదులకు అనుమతి ఇస్తే పాతిక గదులను నిర్మించి హోటల్‌ను అతిథులతో నింపేశారు. భవంతికి ఎలాంటి అగ్నిమాపకశాఖ నిరభ్యంతర సరి్టఫికేట్(ఎన్ఓసీ) లేదు అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అఖిలాష్ మాలిక్ వెల్లడించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెస్టారెంట్ నడుపుతున్నారు. బేస్మెంట్ మొదలు పై అంతస్తు, టెర్రస్దాకా మొత్తం గదులతో నింపేశారని స్థానికుడు షేక్ అలీ వెల్లడించారు. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రధాన ద్వారం, కిటికీలను రాళ్లు, సుత్తితో పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. 17 అగ్నిమాపక బృందాలు ఘటనస్థలికి చేరుకుని ఎట్టకేలకు మంటల్ని ఆర్పేశాయి. అతిథులను కాపాడే క్రమంలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. వీళ్లను ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేరి్పంచారు. -
ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాదం జరిగిన ప్రతిసారీ పునరావృతమయ్యే విషాద గాథ ఇదే. అంతులేని నిర్లక్ష్యం, నిబంధనలను తుంగలో తొక్కే అధికారుల అవినీతి, అధికారిక పర్యవేక్షణ లోపం వెరసి అమాయక ప్రజల ప్రాణాలు. ఢిల్లీలోని ఒక హెటల్లో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఈ విషయాలనే మరోసారి తేటతెల్లం చేస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువమంది వైద్య కోసం వచ్చిన విదేశీయులు ఉండటం మరో విషాదం. అయితే ఈ హోటల్‌కు అనుమతికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్‌కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం, ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్మెంట్లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది.మరోవైపు ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ హోటల్‌కు ఎంట్రీ, ఎగ్జిట్‌కు ఒకే దారి ఉంది. ఈ హోటల్లో 25 గదులు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది అతిథులు బస చేస్తుండటం గమనిస్తే, ఇది మరో నిబంధనల ఉల్లంఘనే. హోటల్‌కు అవసరమైన అగ్నిమాపక భద్రతా అనుమతులున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడికాగా ఐదంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మికాసా ఇన్ హోటల్‌ను కూడా ప్రభావితం చేశాయి. దట్టమైన పొగ, మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో, డజన్ల కొద్దీ అతిథులు లోపల చిక్కుకుపోయారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాటర్ ఇంజన్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక క్విక్-రెస్పాన్స్ వాహనం, ఇతర అత్యవసర వనరులతో సహా పలు అగ్నిమాపక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, 40 మందికి పైగా ప్రజలను రక్షించారు. సంఘటన జరిగిన సమయంలో అందులో దాదాపు 40 మంది అతిథులు బస చేస్తున్నారని అధికారులు తెలిపారు. సమీపంలో మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది అతిథులు ఈ హోటల్‌నే ఎంచుకుంటారు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక 21 మంది మృతి
-
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్‌రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్‌రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్‌కు తరలించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,చెన్నై: తమిళనాడు కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యుందాయ్ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నికీలల్లో కార్లు,సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. పదుల సంఖ్యలో మొహరించిన ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. -
ఇంజిన్ వేడెక్కడంతో లారీ దగ్ధం
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– కుప్పం రహదారిలో బురిశెట్టిపల్లి క్రాస్ వద్ద ఓ లారీ శనివారం దగ్ధమైంది. లారీతోపాటు అందులోని స్టీల్ పౌడర్ పూర్తిగా కాలి బూడిదైంది. డ్రైవర్ కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. స్టీల్ పౌడర్‌తో లారీ తమిళనాడులోని తూత్తుకూడి నుంచి తాడిపత్రికి బయలుదేరింది.వి.కోట వద్ద కర్ణాటక పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకొని వస్తుండగా బురిశెట్టిపల్లి వద్ద లారీలోంచి వాసన రావడంతో డ్రైవర్ ఆపాడు. ఇంతలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా దగ్ధమైంది. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రూ.40 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆదినారాయణ తెలిపాడు. -
నల్లగొండ జిల్లాలో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు
-
క్షణాల్లో మంటలు.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు!
సాక్షి, నల్లగొండ: డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘనటలో బస్సు క్షణాల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రయాణికులందరినీ క్షణాల్లో బస్సు నుంచి బయటకు దించడంతో పెద్ద విషాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొద్ది సేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.ప్రయాణికుల కళ్లెదుటే ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఏ ట్రావెల్స్‌కు చెందింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. -
రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం
-
ఉండవల్లి కొండకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
-
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
-
తూప్రాన్ లో భారీ అగ్నిప్రమాదం.. కంటైనర్ తో పాటు 8 కొత్త కార్లు దగ్ధం
-
నాగర్ కర్నూల్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన షాపులు
-
మదీనాలో భారీ అగ్ని ప్రమాదం ఎగసిపడుతున్న మంటలు
-
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మదీనాలోని ఎస్‌వైజే వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన కాంప్లెక్స్‌లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. -
కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు దుర్మరణం!
కువైట్‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటల కారణంగా ఐదుగురు వ్యక్తులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కువైట్ అధికారిక అగ్నిమాపక సంస్థ 'జనరల్ ఫైర్ ఫోర్స్' ధృవీకరించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కువైట్ వార్తా సంస్థ (KUNA) ఓ ప్రకటనలో పేర్కొంది.అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో కువైట్‌లోని నివాస ప్రాంతాలలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.చదవండి: క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే? -
భారీ ఎండలకు ఇదే సాక్ష్యం క్షణాల్లో కాలి బూడిదైన బైక్
-
పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. -
ఫైర్‌పై బోర్ కొట్టకుండా!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.ఏ విషయమైనా బోర్ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్సైజ్ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.వెలుగు దీపాలు→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి → దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్ ఎలా వెలుగుతుంది? → ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్ చేయమనండి → అడవిలో మంటలు వస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి → కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.సేఫ్టీ హీరో రోల్అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్.. మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.నిప్పు కథలు→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం → హనుమంతుడు లంక దహనం కథ → చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది → సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు → నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. ‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.నిర్వహణ: నిర్మలారెడ్డి -
రైలులో ఒక్కసారిగా లేచిన మంటలు.. అంతటా ఆర్తనాదాలు
సాసారాం: నిద్రమత్తు వదలకముందే ఆ రైలు ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ప్రశాంతంగా సాగుతున్న వారి రైలు ప్రయాణం క్షణాల్లో భయానకంగా మారింది. బిహార్‌లోని సాసారాం జంక్షన్ సమీపంలో సోమవారం ఉదయం సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.ఉదయం 6 గంటలకు కలకలంసోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలు జంక్షన్ ఏరియా సమీపానికి చేరుకోగానే, రైలులోని ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. పొగతో పాటు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయడంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. Rohtas, Bihar: A fire broke out in the Sasaram-Patna passenger train at around 6AM due to a suspected short circuit Sasaram Junction. pic.twitter.com/HKaLPIIyzM— IANS (@ians_india) May 18, 2026షార్ట్ సర్క్యూటే కారణమా?ఈ అనుకోని అగ్నిప్రమాదానికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బోగీలో విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు.రంగంలోకి అత్యవసర బృందాలుప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రైల్వే సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాలేదని తెలుస్తోంది. -
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్‌షీట్‌లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్‌ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం
-
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది 68 మంది ప్రయాణికులతో ఉన్న కోచ్‌ను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రైల్వే అధికారుల ప్రకారం, తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 12431 నంబరు గల రైలులోని బి-1 కోచ్‌లో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని విక్రమ్‌గఢ్ ఆలోట్,లునిరిచా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పీఆర్ఓ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఉదయం 3.45 గంటల ప్రాంతంలో రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది.ఈ ఘటన ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది, కనీసం ఐదు నుంచి ఆరు రైళ్ల షెడ్యూళ్లకు అంతరాయం కలిగింది. ఈ ఘటన తర్వాత పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రమాదం, రైళ్ల రాకపోకల అంతరాయంపై ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు
-
‘రాజధాని’లో మంటలు.. గార్డు సమయస్ఫూర్తితో..
కోట: దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో ఒకటైన తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో (12431) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజస్థాన్ లోని కోట రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సిబ్బంది అప్రమత్తతతో అత్యవసర సహాయక చర్యలు సకాలంలో మొదలుకావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.తెల్లవారుజామున చెలరేగిన మంటలుఆదివారం ఉదయం సరిగ్గా 5:15 గంటల సమయంలో ఈ రైలు లూని రిచ్ఛా, విక్రమ్‌గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ల మధ్య వేగంగా వెళేతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా రైలులోని బీ1 (B1) ఏసీ కోచ్‌తో పాటు ఇంజిన్ విభాగంలో అగ్ని కీలలు వెలువడ్డాయి. క్షణాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు.అప్రమత్తమైన రైల్వే యంత్రాంగంఈ ప్రమాదం జరిగిన వెంటనే కోట రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోమేటిక్ హూటర్ భారీ శబ్దంతో మోగడంతో స్థానిక రైల్వే పరిపాలనా విభాగం వెంటనే అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే కోట రైల్వే డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు, అత్యవసర రెస్క్యూ, రిలీఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు.గార్డు సమయస్ఫూర్తితో..రైలులో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన వెంటనే ఆన్‌బోర్డ్ గార్డు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంటలంటుకున్న విషయాన్ని అధికారులకు తెలియజేసి, అత్యవసరంగా రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి, ప్రమాదానికి గురైన బీవన్ కోచ్‌లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సకాలంలో రైల్వే సిబ్బంది చేపట్టిన చర్యలతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.ఇది కూడా చదవండి: ‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా? -
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
-
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి లోథా అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పై అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్..ఏసీ కోచ్‌లో మంటలు (ఫొటోలు)
-
నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. -
కారు పార్కింగ్ స్థలంలో అగ్ని ప్రమాదం మంటల్లో కార్లు దగ్ధం
-
కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు, బస్సు దగ్ధం
-
యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే ఏసీ పేలడంతోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
నల్లగొండ ఎఫ్‌సీఐ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నల్లగొండ: పట్టణంలోని గొల్లగూడలో ఉన్న భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని రికార్డుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు రికార్డు రూమ్ అంతటా విస్తరించడంతో లోపల ఉన్న కీలక పత్రాలు, దస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి సుమారు రెండు గంటలుగా అధికారులు శ్రమిస్తున్నా ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్ పరిధిలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. ఊపిరి ఆడక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.వ్యక్తమవుతుఉన్న అనుమానాలుగోడౌన్లోని ఇతర విభాగాలకు కాకుండా, కేవలం కీలక సమాచారం ఉండే రికార్డు రూములోనే మంటలు చెలరేగడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ లావాదేవీలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కాలిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
పిల్లాడు కదా అని ఆఫీసుకి తీసుకెళ్తే, కొంప ముంచేశాడు!
చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్‌తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్‌ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాన్ని వెల్లడించలేదు.నెటిజన్ల స్పందనలుఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో బాగా గారాబం ఎక్కువై ఉంటుంది అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్
విజయవాడ: పటమట ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్ అయిన సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడ కూలింది. దీంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్‌లో ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. -
హైదరాబాద్ బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం
-
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్‌షిప్‌లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి
-
డేట్‌కు వెళ్లడానికి అమ్మాయిలేదని కోపంతో ప్రాంతానికి నిప్పు..?
2025లో లాస్ ఏంజిల్స్‌లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..జోనాథన్ రిండర్క్నెచ్ అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో ప్రయాణికులను దించాడు. అనంతరం కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్‌తో ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు. -
టీవీకే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికారం పీఠం దక్కించుకోబోతోందన్న వార్తల మధ్య . నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆఫీసుకు నిప్పు పెట్టారన్న వార్త సంచలనంగా మారింది. తిరుచిలోని టీవీకే కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని న్యూస్18 నివేదిక తెలిపింది. శ్రీరంగం నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఈ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయం పూర్తిగా కాలిపోయిందని, ఓటర్ల జాబితాలు, పత్రాలు, బ్యానర్లు, రోజువారీ ఎన్నికల కార్య కలాపాలకు ఉపయోగించే పరికరాలు వంటి కీలకమైన ప్రచార సామగ్రి నాశనమైనట్టు తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి రమేష్, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎన్నికల కార్యాలయానికి నిప్పు పెట్టారని, దీంతో కార్యాలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో తగిన భద్రత కల్పించాలని కోరారు.Tamil Nadu | An election office belonging to TVK candidate Ramesh was allegedly set on fire by unidentified persons earlier today in Pettavaythalai area under Andhanallur Union, Srirangam Assembly constituency. A formal complaint has been lodged at the local police station by…— ANI (@ANI) May 1, 2026 కాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. ఈ ఫలితాల్లో డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. -
హైదరాబాద్‌లోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు
హైదరాబాద్: నగరంలోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆటోకు కూడా మంటలు అంటుకుని అది దగ్ధమైంది. మంటలను సిబ్బంది అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు, పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో ఉన్న తాడ్‌బన్‌లోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. -
రైతు కంట కన్నీరు.. కళ్ల ముందే కష్టం బుగ్గిపాలు
నిర్మల్ జిల్లా: మండల కేంద్రం పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్ కుమార్, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కాలి బూడిదయ్యింది.విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్‌ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్ఐ శ్రావణ్ రెడ్డి, ఏఈవో నాగమణి, జీపీవో భాస్కర్ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు.మాలేగాంలో..కుభీర్: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు.స్పందించిన సీఎం..షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయి రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని.. ఆర్థిక సహాయం అందించాలని సీఎం.. సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు. -
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!
-
Hyd: అంబర్‌పేట కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్‌పేటలోని మహేంద్ర, రెనాల్ట్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కార్ల పార్క్ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలు పార్క్ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం!
సాక్షి, యాదాద్రి: చెన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో, ఒక్కసారిగా S-5 (ఎస్-5) కోచ్‌లో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు, దట్టమైన పొగను గమనించి భయంతో కేకలు వేస్తూ, గొలుసులాగి, కిందికి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేల్లాలోని షూ ఫ్యాక్టరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. ఐదు ఫైరింజన్లతో అగ్నికీలలను అదుపులోకి తెస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన రద్దు!
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ పర్యటన రద్దయింది. రాజస్తాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని చమురు శుద్ధి కర్మాగారంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మంగళవారం ఈ రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ అనూహ్య ప్రమాదం కారణంగా మోదీ రాజస్తాన్ పర్యటన రద్దు అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకనట విడుదల చేసింది. మంగళవారం రిఫైనరీ ప్రారంభోత్సవంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు సీఎం భజన్‌లాల్ శర్మ కార్యాలయం ధృవీకరించింది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం సాయంత్రం పచ్‌పద్ర వెళ్లాల్సిన సీఎం పర్యటన కూడా రద్దయ్యింది. కాగా ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు సోమవారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్‌లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. -
గాజువాకలో అగ్నిప్రమాదం
విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్ దగ్గర ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
రాజస్థాన్ రిఫైనరీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతులు మీదిగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 21, 2026) రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలోని పచ్‌పద్రలో దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం చేయనున్నారు. రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ భారత్ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే,ఇప్పుడీ ఈ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్.ఇందులో క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేయడమే కాకుండా,పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు కానున్నాయి. #WATCH | Rajasthan: Fire broke out at Refinery-cum-Petrochemical Complex at Pachpadra in Balotra. Firefighters have arrived at the refinery to control the fire. More details awaited. pic.twitter.com/q7ztFGVbAA— ANI (@ANI) April 20, 2026 -
గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనం సెల్లార్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు.వివరాల మేరకు.. టీఎన్జీవో కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం తెల్లవారుజామున భవనంలో మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని ఒకరు గాయపడగా.. మరొకరు అస్వస్థతకు గురయ్యారు. ఇక, భవనం పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక భవన వాసులు ఇబ్బందిపడ్డారు. భవనం సెల్లార్‌లోని 15 ద్విచక్ర వాహనాలు దగ్ధం కాగా, ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
రెక్కల కష్టం.. నిప్పుల పాలు!
ఖానాపురం: అది కేవలం మొక్కజొన్న కుప్ప కాదు.. రైతన్నల ఆరుగాలం శ్రమ, ఎన్నో ఇంటి అవసరాల కోసం పేర్చుకున్న ఆశల రాశి. వరంగల్ జిల్లా నాజీతండాకు చెందిన రాంజీ, బాలు అనే ఇద్దరు రైతులు ఎండనక వాననక కష్టపడి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో ప్రమాదవశాత్తు నిప్పులపాలైంది.సుమారు 3.50 లక్షల విలువైన పంట కళ్లముందే బూడిదవుతుంటే, ఆ మంటలను ఆర్పలేక ఆ రైతులు పడిన ఆవేదన వర్ణనాతీతం. కాలిపోయిన ఆ కుప్పల వద్ద రాంజీ భార్య కాంతి గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు చూసి తండావాసులు కన్నీరు పెట్టారు. ఏడాది కష్టం చివరకు గుప్పెడు గింజ కూడా మిగలకుండా మసి కావడంతో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కూలబడ్డాయి. -
బీవైడీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.ప్రమాదం జరిగిన తీరుసోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలుసాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.WATCH: Massive fire breaks out at Chinese electric vehicle company BYD’s parking garage in Shenzhen, China pic.twitter.com/hPMm61hHgu— Insider Paper (@TheInsiderPaper) April 14, 2026ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరికసాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్‌యూవీలను రీకాల్ చేసింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి, 40 మందికి గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సింగ్‌హితరాయ్‌లో వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సక్తి జిల్లాలోని సింగ్‌హితరాయ్ గ్రామం ఉంటుంది.పేలుడు తర్వాత కార్మికులు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది . గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణం ఏంటన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.సక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “సక్తి జిల్లా సింగ్‌హితరాయ్ ప్రాంతంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడులో 9 మంది మృతి చెందారు. గాయపడిన వారిని రాయగఢ్ ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. పేలుడు సమయంలో కార్మికులు ప్లాంట్‌లోపల పని చేస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన పేలుడుతో అక్కడి ప్రాంతం మొత్తం భయాందోళనలు సృష్టించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం బాయిలర్ లోపల ట్యూబ్ పగిలిపోవడం పేలుడుకు కారణంగా ఉండవచ్చని తెలుస్తోంది. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి కచ్చిత కారణం తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడు విరుధ్‌నగర్ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. సత్తూర్ దగ్గర ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. క్షతగాత్రులకు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. కొందరు కార్మికులు లోపలే చిక్కుకుని ఉన్నారని యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్నన్ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ఉదయం వరుసగా నాలుగుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ శబ్దం సుమారు 6 కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోయారు. భారీగా మంటలు ఎగసిపడడంతో.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొందరు కార్మికులు పేలుడుతో దూరంగా ఎగిరిపడగా.. సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్యాక్టరీ, గోదాంలకు చెందిన 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు లోపల ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. టపాసులు తయారు చేస్తుండగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంత్రి నాగేంద్రన్ శివకాశి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదని సమాచారం. సహాయక చర్యలు పూర్తయ్యాకే నష్టం వివరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL— ANI (@ANI) April 13, 2026 -
మొయినాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
-
పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?
సంగారెడ్డి, సాక్షి: గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గోదాముల్లో అగ్ని కీలలు
జీడిమెట్ల/జగద్గిరిగుట్ట: నగరంలో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జీడిమెట్లలోని రసాయన గోదాములో ఫ్యాబ్రికేషన్ పరిశ్రమతో పాటు మరో మూడు గోదాముల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జగద్గిరిగుట్ట పరిధిలోని బహదూర్‌పల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రితో పాటు రెండు వాహనాలు బుగ్గి పాలయ్యాయి. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని ఏస్వీకో ఆపరేటివ్ సొసైటీలో రాజేష్ అనే వ్యక్తి రసాయన గోదామును నడుపుతున్నాడు.గురువారం ఉదయం 7 గంటలకు గోదాములో రసాయనాలు, సాల్వెంట్లను కలుపుతుండగా మంటలు అంటుకున్నాయి. డ్రమ్ముల్లో రసాయనాలు ఉండటం, దానికి ఆనుకుని ఉన్న మరో రసాయన గోదాములో రసాయనాల నిల్వలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల తాకిడికి రెండు రసాయన గోదాములతో పాటు ఠాగూర్ కెమికల్స్‌కు చెందిన ఆర్ అండ్ డీ ల్యాబ్, ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన మెడికల్ వేస్ట్ గోదాము, హనుమాన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి.విషయం తెలుసుకున్న జీడిమెట్ల, సనత్‌నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని కుత్బుల్లాపూర్ ఏసీపి బాలగంగిరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నితిన్‌లు పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన 45 మంది..బహదూర్‌పల్లిలోని డెకరేషన్ ఈవెంట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్వీఎన్ పేరిట డెకరేషన్ ఈవెంట్ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్ వైర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగాయి. డెకరేషన్ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది వెనక నుంచి గ్రిల్స్ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని వెంకటేష్ ఆరోపించారు. -
కల్లబొల్లి కబుర్లతో నమ్మించి.. శారీరకంగా లొంగదీసుకున్నాడు!
కూర్మన్నపాలెం (విశాఖ) : కల్లబొల్లి కబుర్లుతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
మంటల్లో బస్సు.. క్షణంలో తప్పిన ఘోర ప్రమాదం


