బంగ్లాదేశ్ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్‌గా జరుగుతున్న దాడులు భారత్‌ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.
షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్‌లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్‌పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.
🚨 Bangladesh
An attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.
Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025
అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్‌లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు పేర్కొన్నారు.


