- 22 మంది బలి
- నిండు గర్భిణి సైతం అగ్నికి ఆహుతి
- డ్రోన్ల బ్యాటరీ నిల్వ, పరీక్షా కేంద్రంలో రాజుకున్న మంటలు
- దట్టమైన పొగతో ఊపిరాడక పలువురు సిబ్బంది దుర్మరణం
- జకార్తా నగరంలో దుర్ఘటన
జకార్తా: ఇండోనేసియా రాజధాని నగరం జకార్తాలో ఏడంతస్తుల భవంతిలో ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నిండు గర్భిణి సైతం అగ్నికి ఆహుతయ్యారు. జకార్తా సిటీలోని కెమయోరన్ ప్రాంతంలోని ఒక భవంతిలోని మొదటి అంతస్తులో నిల్వచేసిన డ్రోన్ బ్యాటరీల్లో ఒకటి పేలడంతో అంటుకున్న నిప్పు రవ్వలు మెరుపువేగంతో పై అంతస్తులకు ఎగబాకి పెద్దస్థాయిలో మంటల్ని రాజేశాయి. దీంతో భవంతిలోని వాళ్లు వెంటనే తప్పించుకునే అవకాశం లేకుండాపోయిందని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ సుసత్యో పూర్ణోమో కాండ్రో వెల్లడించారు. బుధవారం సిబ్బంది మధ్యాహ్న భోజనాలు చేసే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
భవనానికి నిప్పు అంటుకుందని తెల్సిన వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, 28 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక డ్రోన్ల తయారీ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఈ బహుళ అంతస్తుల భవంతిలో ఉంది. మొదటి అంతస్తులో బ్యాటరీలను నిల్వచేయడంతోపాటు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశా రు. ఇక్కడి బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్యాటరీలకు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మెరుపులు వచ్చి చివరకు అగ్గిరాజుకుందని మరో ప్రత్యక్ష సాక్షి ఇన్టాన్ పుష్పిత చెప్పారు.
మంటలు పై అంతస్తులకు ఎగబాకుతుండటంతో పొడవాటి నిచ్చెనల సాయంతో ఆరో అంతస్తులో చిక్కుకున్న కొందరు కార్మికులకు ఎలాగోలా బయటకు తీసుకురాగలిగారు. బ్యాట రీలు పేలడంతో వెలువడిన పొగ భవంతిని కమ్మేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చాలా మంది చనిపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఘటనకు వాస్తవిక కారణా లను ఆధా రసహి తంగా కనిపెట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భవంతిలో అత్యయిక పరిస్థి తుల్లో తప్పించుకునే ఏర్పాట్లు లేవని ఘటనాస్థలిని పరిశీలించిన జకార్తా గవర్నర్ ప్రమోనో అనున్గ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన భవంతిలో పీటీ రెట్రా డ్రోన్ ఇండోనేసియా అనే కంపెనీ కార్యాలయం నడుస్తోంది. ఇది నిర్మాణం, గనులు, ముడిచమురు, సహజవాయువు, ఇంధన, వ్యవ సాయం, పట్టణ ప్రణాళిక రంగ కంపెనీలకు డ్రోన్ల ను సమకూరుస్తోంది.


