న్యూఢిల్లీ/పనజీ: 25 నిండు ప్రాణాలు బలిగొన్న గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం ఉదంతంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి క్లబ్ యజమానులుగా భావిస్తున్న అజయ్ గుప్తా అనే భారతీయునితో పాటు సురేందర్ కుమార్ ఖోస్లా అనే బ్రిటిష్ జాతీయునిపై మంగళవారం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రాథమిక యజమానులుగా చెబుతున్న సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే థాయ్ లాండ్ కు పారిపోవడం తెలిసిందే.
వారిని తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం వారిపై ఇంటర్ ఆయిల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఐదుగురిని అరెస్టు చేసినట్టు డీఐజీ వర్షా శర్మా తెలిపారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ఆ క్లబ్ మొత్తాన్నీ మంగళవారం నేలమట్టం చేశారు.


