దక్షిణాఫ్రికాతో మొదలైన టి20 సిరీస్‌లో అలవోక విజయాన్ని అందుకొని భారత్ 1–0తో ముందంజ వేసింది. బారాబతి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో భారత్ 101 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఆటతో చెలరేగాడు.


