భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా వేదికకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్–2026’ పోరు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో ఎనిమిది దేశాల జట్లు పోటీపడుతున్నాయి.


