లిల్లీ, పారిజాత పుష్పాల డిజైన్‌ చీరలో తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌ ..! | Tamannaah Bhatia Meets Sadhguru In A Rs 65500 Printed Saree | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: లిల్లీ, పారిజాత పుష్పాల డిజైన్‌ చీరలో తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌ ..!

Nov 27 2026 12:11 PM | Updated on Nov 27 2026 12:20 PM

Tamannaah Bhatia Meets Sadhguru In A Rs 65500 Printed Saree

Tamannaah Bhatia Meets Sadhguru: ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో తమన్నా భాటియా, చిత్రనిర్మాత విశాల్ భరద్వాజ్‌తో కలిసి సద్గురువు రాసిన ఫోటో బుక్ 'డిసపియరింగ్ ఫేసెస్' (Disappearing Faces) గురించి జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ పుస్తకంలో సద్గురువు గత 50 ఏళ్లుగా హిమాలయ ప్రాంతాల్లో, ముఖ్యంగా టిబెట్, నేపాల్‌లలో పర్యటించినప్పుడు తీసిన పోటోలు ఉన్నాయి. ముంబైలోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, తమన్నా భాటియా పూల డిజైన్, ముత్యాల అలంకరణ కలిగిన చీరలో ఎంతో హుందాగా కనిపించారు. 

ఆమె ధరించిన ఈ పూల డిజైన్‌ చీర  'పిచ్చిక' (Picchika) అనే బ్రాండ్‌కు చెందినది. చేతితో ముద్రించిన  (hand-printed) డిజైన్లకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, జాన్వీ కపూర్, కాజోల్, మాధురి దీక్షిత్‌ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ బ్రాండ్‌ దుస్తులను ఇష్టపడతారు. లేత గులాబీ రంగులో ఉన్న ఈ చీరపై లిల్లీ, పారిజాత పుష్పాలను చేతితో ముద్రించారు. ఇటాలియన్ ప్యూర్ సిల్క్ ఆర్గాంజా వస్త్రంతో తయారైన ఈ చీరపై ఉన్న ముత్యాల అలంకరణ దీనికి మరింత అందాన్ని చేకూర్చింది. 

ఇటాలియన్ ప్యూర్ సిల్క్ ఆర్గాంజా వస్త్రంతో తయారైన ఈ చీరపై ఉన్న ముత్యాల అలంకరణ దీనికి మరింత అందాన్ని చేకూర్చింది. మృదువైన, పారదర్శకమైన ఈ వస్త్రం ధరించినప్పుడు శరీర ఆకృతికి చక్కగా సరిపోతుంది. ఇందులో పూల కాడలను బంగారు రంగు 'గోటా' (gota) పనితనంతో హైలైట్ చేశారు. ఈ చీరకు జతగా ఆమె 'కోటా సిల్క్' దుపట్టాను ధరించారు. దీనిపై కూడా లిల్లీ, పారిజాత పుష్పాల డిజైన​ ఉండగా, సున్నితమైన బంగారు రంగు అలంకరణలు చీరలోని అందాన్ని మరింత పెంచాయి. మరి ఇంత అందమైన చీర ధర వచ్చేసి అక్షరాల రూ. 65,500/-.

ఇక తమన్నా తన బ్రాండ్‌ అయిన 'తమన్నా ఫైన్ జ్యువెలరీ'కి చెందిన నెక్లెస్, చెవిపోగులు, వరుసగా అమర్చిన బంగారు గాజులతో తన లుక్‌ను అలంకరించుకుంది. మేకప్ కోసం, ఆమె మ్యాట్-డ్యూయీ బేస్, పింక్ బ్లష్, సాఫ్ట్ పింక్ లిప్‌స్టిక్, ఐలైనర్, మస్కారా, పింక్ ఐషాడోలను ఎంచుకుంది, దీంతో ఆమె కళ్ళు మరింత ఆకర్షణీయంగా కనిపించాయి. నుదుటి మధ్యలో పెట్టుకున్న ఎర్రటి బిందీ మొత్తం లుక్‌కు పూర్తిదనాన్ని ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. 

కొన్ని సంభాషణలు ముగిసినా..మనతో ఉండిపోతాయి. డిసపియరింగ్ ఫేసెస్' గ్యాలరీలో గడిపిన ఆదివారం ఎంతో గుర్తుండిపోయేలా సాగింది. సద్గురువు, విశాల్‌ భరద్వాజ్‌లతో ఆలోచనలను, దృక్పథాలను పంచుకోవడం నిజంగా గొప్ప అనుభం అని పేర్కొంది. కాగా, ఈ చర్చ సందర్భంగా తమన్నా భాటియా సద్గురువు జగ్గీ వాసుదేవ్‌ను ఇలా ప్రశ్నించారామె. కాలం గడిచిపోవడం అనే అత్యంత అనివార్యమైన విషయాన్ని మనం ఎందుకు అంగీకరించడం లేదు? అని తమన్నా ‍ప్రశ్నించగా.. భారతదేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామం అని భావిస్తున్నానని చెప్పారు. 

లేదంటే, ఈ దేశంలో స్త్రీ, పురుషులు ఎప్పుడో హుందాగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టేవారు. కానీ మనం పాశ్చాత్య ఆలోచనలను స్వీకరించాము, అక్కడ మొత్తం నాగరికతలు హార్మోన్లే పాలిస్తాయి. ప్రస్తుత సమాజం యవ్వనానికి, హర్మోన్ల తీవ్రత ఎక్కువగా ఉండే వయసుకు మితిమీరిన ప్రాముఖ్యతను ఇవ్వడం మొదలుపెట్టిందన్నారు. మనం జీవితంలో  ఒక అంశాన్నే సర్వస్వంగా భావిస్తే, అప్పుడు చాలా వక్రీకరించిన జీవితాన్ని గడుపుతారని అన్నారు.

 

ఇదీ చదవండి: సమంత వ్యక్తిత్వంపై ప్రశంసలు..బాబుకి ఆ పేరే ఎందుకంటే..!: శోభరాజు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement