ఫండే
ట్రెండీమెన్
ఫ్యాషన్
చలికాలం వచ్చిందంటే స్వెటర్లు, జాకెట్లు, వార్డ్‌రోబ్‌లో హుడీలకు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే! వెచ్చదనంతోపాటు కూల్ లుక్ ఇచ్చే ఈ దుస్తులను ధరించేటప్పుడు ఈ చిన్న టిప్స్ తెలిస్తే చాలు, వింటర్‌లోనూ ఫ్యాషన్ హీరో మీరవుతారు!
ఓవర్ స్టయిల్!
లూజ్ ఫిట్ హుడీలు చలికాలంలో మంచి ఎంపిక. వీటిని వైడ్ లెగ్ జీన్స్ లేదా బ్యాగీ ట్రౌజర్లతో జత చేస్తే ట్రెండీగా ఉంటుంది. పైన పొడవాటి వింటర్ కోటు లేదా క్రాప్డ్ బాంబర్ జాకెట్ వేసుకుంటే లుక్‌కు మరింత హంగు వస్తుంది. అయితే ఓవర్‌సైజ్ పేరుతో దుస్తుల్లోనే మునిగిపోకండి. ఫిట్‌లో కాస్త బ్యాలెన్స్ ఉండాలి!
బ్లాక్ హుడీ.. వింటర్ సేఫ్ బెట్!
చలికాలపు ఫ్యాషన్ లో బ్లాక్ హుడీకి తిరుగులేదు. బ్లూ లేదా ఫేడెడ్ జీన్స్‌తో వేసుకుంటే క్యాజువల్ లుక్ వస్తుంది. దానిపైన లెదర్ జాకెట్, బైకర్ జాకెట్ లేదా వులెన్ కోటు వేసుకుంటే క్లాసీగా కనిపిస్తారు. ఇలా బ్లాక్ హుడీకి ఏది కాంబినేషన్ గా వేసుకున్నా చక్కగా సరిపోతుంది!
గ్రే హుడీ... గ్రేట్ కాంబో!
గ్రే హుడీ వింటర్ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన బెస్ట్ పీస్. బ్లాక్ జీన్స్, డార్క్ ట్రౌజర్లు, ఆలివ్ కార్గో ప్యాంట్లతో చక్కగా సరిపోతుంది. పైన నేవీ బ్లూ లేదా బ్లాక్ కోటు వేసుకుని, వైట్ స్నీకర్స్ జోడిస్తే సింపుల్‌గా స్టయిలిష్‌గా కనిపిస్తారు. గ్రే మీద గ్రే వేసుకోవాలనుకుంటే రెండింటి షేడ్స్ వేరుగా ఉండేలా చూసుకోండి. లేదంటే చలిలో కలిసిపోయిన పొగమంచులా కనిపిస్తారు!
లేయరింగ్ లుక్!
హుడీపై కోటు, బాంబర్ జాకెట్ లేదా స్వెట్ జాకెట్ వేసుకుంటే స్టయిల్‌తోపాటు వెచ్చదనం కూడా దక్కుతుంది. హుడీని కోటు కాలర్ బయటకు నీట్‌గా ఉంచితే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, ఇలా పొరలుగా దుస్తులు ధరించేటప్పుడు మరీ మందంగా కాకుండా సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.
ఫ్యాబ్రిక్... వెచ్చదనం ముఖ్యం!
వింటర్ కోసం హుడీ కొనేటప్పుడు మందపాటి కాటన్ ఫ్లీస్ లేదా బ్రష్డ్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. హుడ్ ఆకారం నిలిచేలా, కఫ్‌లు చేతులకు సరిగ్గా పట్టేలా ఉండాలి. మరీ పలుచటి ఫ్యాబ్రిక్ అయితే చలిని ఆపకపోగా, లుక్‌నూ నీరసంగా మార్చేస్తుంది.
చివరగా.., సరైన హుడీకి సరైన జీన్స్, జాకెట్, షూస్ జోడిస్తే వెచ్చదనంతోపాటు వింటర్ స్టయిల్‌నూ సొంతం చేసుకోవచ్చు. అలా చలికాలంలో బద్ధకానికి యూనిఫామ్‌లా కాకుండా, స్టయిల్‌కు సిగ్నేచర్‌లా మార్చుకోండి!
ఇదీ చదవండి: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన కొడుకు.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!


