తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం కానుకగా సమర్పించారు.
దాత కుటుంబ సభ్యులు ఆభరణాల పళ్లెంలను స్వామివారి ఎదుట సమర్పించి పూజలు చేశారు.
ఇందులో 33 రకాల ఆభరణాలు 46 ఉన్నాయి. ఈ ఆభరణాల్లో వజ్రాల బరువు 238.2 క్యారెట్లు, నీలమణులు 2,247.7,పసుపు నీలమణులు 91.6,కెంపులు, పచ్చలు 84.2 క్యారెట్లు,సాలగ్రా మ రాళ్లు 2,916.5 గ్రాములు ఉన్నాయి.


