శ్రీశైలం : కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో జ్వాలాతోరణోత్సవం వైభవంగా జరిగింది
ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరుకాగా, శివనామస్మరణతో క్షేత్రం మారుమోగింది.
కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం వంటి కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి.


