ఎవరో చేస్తారని వేచి ఉండటం, సాయం కోసం ఎదురు చూపులతో కాలం వృధా చేయకుండా ముందుకు సాగాలనుకునేవారు..అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. సర్దుకుపోదాం అనుకుంటే..జీవితం కూడా చప్పగా సాగుతుంది. అదే దృఢ సంకల్పంతో నడుంబిగించి కార్యచరణకు పూనుకుని ఒక్క అడుగు వేస్తే..మనతోపాటు యావత్తు సమాజం అడుగులు వేస్తుంది అనేందుకు ఈ కర్ణాటకలో హలేహైరిగే గ్రామమే ఉదాహరణ. ఈ కథ ప్రపంచానికే ఒక స్ఫూర్తి.
కర్ణాటకలో మైసూరుజిల్లాలో హెచ్‌డీ కోటె తాలుకాలో ఉండే హలే హైరిగే గ్రామాన్ని కలిపే కపినది సమీపంలోని రహదారి చాలా అధ్వాన్నంగా ఉండేది. మూడు కొలోమీటర్ల దూరం వెళ్లేందుకే మూడుగంటలు పైనే పడుతుంది. ఎందుకంటే రహదారి మొత్తం గోతులు మయం, బురద బురద కావడంతో వాహనాలు రాకపోకలు చాలా కష్టతరంగా ఉండేది. ముఖ్యంగా రైతులు తమ పొలానికి వెళ్లాలన్నా, ధాన్యం తరలించి అమ్ముకోవాలన్న నానాయాతనలు పడేవారు.
పోనీ ప్రభుత్వం గానీ, స్థానిక నాయకులు గానీ ఎవ్వరూ ఎలాంటి చొరవ చూపలేదు. దాంతో కర్ణాటకలోని రామనగర జిల్లాలోని జలమంగళ గ్రామానికి చెందిన నాగభూషణం అనే రైతు తనే స్వయంగా చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఈ రైతు తన సొంతూరులోని భూమికి సరైన నీటిపారుదల లేకపోవడంతో అమ్మేసి మైసూరు జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలుకాలో హలేహైరిగి గ్రామానికి తరలి వచ్చాడు. అక్కడ ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు.
ఈ భూమితోనైనా లాభాలు గడిద్దామంటే..తన పొలానికి వెళ్లే రహదారి అతడి ఆశలన్నింటినిపై నీళ్లు జల్లేసింది. ఎందుకంఏట ఏళ్లుగా ఎవ్వరు పట్టించకోకపోవడంతోటా రహదారి మొత్తం బురదమయం, గుంతలు మయంగా మారిందని తెలుసుకున్నాడు భూషణం. చుట్టుపక్కల గ్రామాలకు అనుసంధానమైన రహదారి అయినా..నిరూపయోగంగా మిగిలిపోయింది. దాంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి రహదారిని మరమత్తు చేయాలని అభ్యర్థించాడు. అయితే నాగభూషణంకి ఆ 50 అడుగుల వెడల్పు ఉన్న ఆ రహదారి కావేరి నీరవారి నిగమ లిమెటెడ్(సీఎన్‌ఎన్‌ఎల్)కు చెందిందని అధికారులు తెలియజేశారు.
ఇంకెవరైనా పై అధికారులు చర్యలు తీసుకుంటారని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తనే స్వయంగా ఆ బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒక ఎర్త్‌మూవర్‌ను అద్దెకు తీసుకుని, దెబ్బతిన్న రహదారిని పూడ్చడం ప్రారంభించాడు. మొదట్లో అతడొక్కడే వ్యక్తిగత ప్రయత్నంగా మొదలుపెట్టగా, ఇతరు గ్రామస్తులు కూడా పాల్గొనడం ప్రారంభించారు. మొదట నాగభూషణంకి మద్దతిచ్చింది మాత్రం స్థానిక నివాసి బసవరాజు. అతడు ఈ రహదారి మరమత్తు కోసం రూ. 10 వేలు విరాళం ఇవ్వగా, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ రూ. 15,000 విరాళంగా ఇవ్వడమే గాక మట్టి రవాణా కోసం ఒక ట్రాక్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు.
ఇక ఆ తర్వాత సమీపంలోని ఒక రిసార్టు కూడా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించింది. ఇలా అందురు స్వచ్ఛందంగా ముందుకు రావడం ప్రారంభించారు. అలాగే అనేక ఇతర రైతులు కూడా తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా విరాళాలు అందించారు. ఇలా భారీగా విరాళాలు రావడంతో ఈ కార్యక్రమానికి మెరుగైన సమన్వయం అవసరమని గ్రహించి 'హలే హైరిగే రాస్తేయ దురస్తి టీమ్' అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్లంతా గ్రామస్తులను ఒక చోట చేర్చి..పనులు సజావుగా సాగేలా బాధ్యతలు విభజించేవారు.
రైతన్నల రాతనే మార్చిన ‘దారి’
ఇక నాగభూషణం కూడా ఈ రహదారి కోసం తన వంతుగా రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అలా వాళ్లంతా కలిసి మూడు కిలోమీటర్ల చక్కటి రహదారిని స్వయంగా నిర్మించుకున్నారు. ఒక నెలపైనే కష్టంతో తమ కలను సాకారం చేసుకున్నారు ఆ రైతులు. అదికాస్తా వాళ్ల తలరాతనే మార్చేసింది. ఎప్పుడైతే రోడ్డు ఏర్పడింది..ఆ క్షణమే వాళ్ల పొలాలకు చక్కటి ధర వచ్చింది. అలాగే కోసిన పంటను నేరుగా మార్కెట్‌కి తరలించగలుగుతున్నారు.
సకాలంలో తమ పంటకు కావల్సిన ఎరువులు, విత్తనాలను తరలించడం సులభమైంది. గతంలో రూ. 40 లక్షలు విలువ చేసే భూములు కాస్తా..ఈ కొత్త రహదారి నిర్మాణంతో రూ. 70 లక్షల విలువకు చేరుకోవడం విశేషం. ఇక నాగభూషణం కూడా రోడ్డు ఏర్పడటంతో తన భూమిలో పట్టు పురుగుల పెంపకాని అంతరాయం తొలిగి..పనులు పనులు చకచక సాగడం మొదలైంది
అలాగే స్థానిక రైతులకు కూడా తమ వ్యవసాయ కార్యకలాపాలన్నీ సౌకర్యవంతంగా మారడం విశేషం. ఎవరో వస్తారు, చేస్తారని కాకుండా ఒక్కరూ ధైర్యంగా ముందడుగు వేస్తే..ఆ మంచి పనికి యావత్తు సమాజం సహకరించి మనతో అడుగులు వేస్తుందని చెబుతోంది కదూ ఈ కథ.
ఇదీ చదవండి: పరిస్థితులు ఎలా ఉన్నా.. పోరాడటం అంటే ఇదే..! నాలుగో అంతస్తు నుంచి అమాంతం


