పొలాల్లోనే భారీ ప్లాస్టిక్‌ సంచులు! | Sagubadi: Russia turns to giant plastic bags to store unexported grain | Sakshi
Sakshi News home page

పొలాల్లోనే భారీ ప్లాస్టిక్‌ సంచులు!

Nov 17 2026 6:39 PM | Updated on Nov 17 2026 7:06 PM

Sagubadi: Russia turns to giant plastic bags to store unexported grain

నల్ల సముద్ర మార్గంలో డ్రోన్‌ దాడుల కారణంగా రష్యా గోధుమ ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ఏడాది జులై ప్రారంభం నుంచి ఎగుమతులు సుమారు మూడో వంతు పడిపోవటంతో కోట్లాది టన్నుల ధాన్యం దేశంలోనే నిలిచిపోయింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రష్యా రైతులు ఖరీదైన సంప్రదాయ గోదాములకు బదులుగా పొలాల్లోనే భారీ ప్లాస్టిక్‌ వాక్యూమ్‌ సంచులను (అర్జెంటీనా సైలో బ్యాగ్స్‌) ఆశ్రయిస్తున్నారు. 

రష్యాలో 16 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ గోదాముల్లో 40 శాతం మాత్రమే ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అధిక వడ్డీ రేట్ల వల్ల కొత్త గోదాములు నిర్మించటం రైతులకు భారంగా మారింది. పైగా ఉన్న గోదాములు కూడా పొలాలకు దూరంగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1990వ దశకంలో అర్జెంటీనాలో రూ΄÷ందించిన ఈ ΄్లాస్టిక్‌ సైలో బ్యాగుల సాంకేతికత రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారింది.

18 నెలల వరకు నిల్వ
పొడవాటి గొట్టం ఆకారంలో ఉండే ఒక్కో పాలిథిలిన్‌  సంచిలో గరిష్ఠంగా 200 టన్నుల ధాన్యాన్ని గాలి చొరబడకుండా నిల్వ చేయవచ్చు. నాణ్యత దెబ్బతినకుండా వీటిలో 18 నెలల వరకు ధాన్యాన్ని భద్రపరచవచ్చని పాలిథిలిన్‌  సరఫరా సంస్థ ‘సిబూర్‌’ పేర్కొంది. ఈ ఏడాది 2 కోట్ల టన్నుల  గోధుమలు మిగిలిపోతాయని అంచనా. ఇప్పటికే కోటి టన్నుల ధాన్యాన్ని ఈ సంచుల్లో పొలాల్లోనే నిల్వ చేసినట్లు రష్యన్‌  గ్రెయిన్‌  అసోసియేషన్‌  వెల్లడించింది.

అయితే, సంచుల మడతల ద్వారా ఎలుకలు లోపలికి చేరే ప్రమాదం ఉన్నందున నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పక్షుల బారి నుంచి కాపాడేందుకు విమానాశ్రయాల్లో వాడే తరహా శబ్దపు ఫిరంగులను (బర్డ్‌ స్కేరింగ్‌ కెనాన్స్‌) రైతులు వినియోగిస్తున్నారు. అకాల వర్షాలతో మన రైతులు భారీగా నష్టపోకుండా ఈ మెగా సంచుల్ని ధాన్యం నిల్వకు ఉపయోగిస్తే మేలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement