విడాకులు కూడా వివాహంలా వేడుకలు..! | South Korean Woman Throws Grand Divorce Party Goes Viral | Sakshi
Sakshi News home page

విడాకులు కూడా వివాహంలా వేడుకలు..! ఆమె వివరణకు కన్నీళ్లు ఆగవు..

Nov 17 2026 4:56 PM | Updated on Nov 17 2026 5:11 PM

South Korean Woman Throws Grand Divorce Party Goes Viral

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలా ముగిసిపోతున్నాయి. కనీసం కొన్నేళ్లు కూడా సజావుగా సాగడం కష్టం అన్నట్లుగా ఉన్నాయి. కారణాలేమైనా ఆ తర్వాత జీవితం సాఫీగా సాగడం మహిళలకే కష్టంగా ఉంటుందన్నది జగమెరిగినా సత్యం. 

అయితే కొందరు ధీర వనితలు దాన్నే మార్చి తాము కూడా సంతోషంగా లైఫ్‌ని లీడ్‌ చేయగలమని చేసి చెబుతున్నారు. పైగాకొందరు మహిళామణులు అక్కడితో ఆగడం లేదు విడాకులు తీసుకున్న మహిళ కళంకిత కాదు అన్నట్లు తమదైన రీతిలో చెబుతున్నారు. కానీ ఇక్కడ ఈ మహిళ ఓ అడుగు ముందుకేసి..అందరు విస్తుపోయేలా వేడుకలు నిర్వహించింది. అది కూడా ఎలాగంటే..

End of her marriage To Mark New Chapter: ఆ మహిళే 37 ఏళ్ల చో సియోంగ్-యోన్. తన అధికారిక విడాకులను పురస్కరించుకుని ఏకంగా వివాహం మాదిరిగా అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది. అచ్చం పెళ్లిలో ధరించినట్లుగా తెల్లటి దుస్తుల ధరించి కేక్‌ కట్‌ చేసింది. అది కూడా బంధు మిత్రుల పరివార సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం. అంతేగాదు అతిథులను ఉద్దేశిస్తూ చాలా భావోద్వేగంగా మాట్లాడింది. 

కన్నీళ్లు ఆపుకుంటూ .. వైవాహికం బంధ దూరమైనంత మాత్రన ఆమె గుర్తింపు లేని మనిషి కాదని, తనకు తాను తొలి.ప్రాధాన్యత ఇచ్చేలా చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారందరి మనసులను తాకింది. కొందరు ఇదేంటి విడాకులు తీసుకుంటే వేడుకలు అని విమర్శించినా..చాలామంది మాత్రం..వివాహబంధం ముగింపు అనేది జీవితానికే ఎండ్‌ కార్డు లాంటిది కాదని కొత్త ఆరంభమని చెప్పేలా ఆమె చేసుకున్న వేడుకను స్వాగతించారు, ప్రశంసించారు కూడా. 

నెటింట కూడా చాలామంది ఎంత గొప్ప ఆలోచన అంటూ మెచ్చుకొంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు విడాకులనేవి కూడా వివాహంలానే సాధరణమైనదే, అలాగని విడాకులను ప్రోత్సహించడం లేదు. కేవలం డైవర్స్‌ తర్వాత జీవితాన్ని చక్కగా ప్రారంభించడం గురించి అని ముక్తకంఠంతో నినదించడం విశేషం. అంతేగాదు నెటిజన్లు విడాకులు తీసుకుని కూడా ఎంతో హుందాగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నవారికి కచ్చితంగా మద్దతు ఉంటుందని అభిప్రాయ వ్యక్తం చేశారు కూడా. 

కాగా, దక్షిణ కొరియాలో విడాకులు తీసుకున్న మహిళను చాలా అవహేళనగా చూస్తుంటారు. దాన్ని సవాలు చేస్తూ చో అనే మహిళ వివాహ వ్యవస్థకు అతితంగా  తన గుర్తింపును తిరిగి పొందడం అని తనదైన రీతిలో చాటి చెప్పింది. పైగా వివాహ బంధం ముగియడాన్ని కష్టతరమైన అనుభవం కాదు..కొత్త జీవిత ప్రారంభం అంటూ తనలాంటి వాళ్లలో ఆశను కలిగించేలా ప్రేరణగా నిలిచింది.

 

ఇదీ చదవండి: ‘అందరం సమానం’ అని కుమారుడి భలే నేర్పించాడు ఈ తండ్రి..! వీడియో వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement