పెళ్లి తర్వాత తొలిసారి కనిపించిన క్రేజీ జంట( వీడియో) | Anirudh And Kavya Maran Returned To Chennai | Sakshi
Sakshi News home page

Anirudh-Kavya Maran: పెళ్లి తర్వాత తొలిసారి కనిపించిన జంట( వీడియో)

Nov 14 2026 6:36 PM | Updated on Nov 14 2026 6:36 PM

Anirudh And Kavya Maran Returned To Chennai

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సీఈవో కావ్య మారన్‌ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నవంబర్‌ 11న గ్రీస్‌లో వీరి పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఈ నూతన దంపతులు ఇండియాకు చేరుకున్నారు.

చెన్నై ఎయిర్‌పోర్టులో
ఈ క్రమంలో అనిరుధ్‌, కావ్య కలిసి చెన్నై ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు కావ్య తండ్రి, సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత తొలిసారి ఈ జంట ఇలా కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా వీడియోను షేర్‌ చేస్తున్నారు.

కాగా, అనిరుధ్‌, కావ్య వివాహ రిసెప్షన్‌ ఈ నెల 21న చెన్నైలో జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ రిసెప్షన్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

(ఇదీ చదవండి: కృష్ణలా ఫోన్‌ చేయడం ఏ హీరోకి సాధ్యం కాదు: నటుడు గిరిబాబు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement